అగ్ని మహా పురాణము

Table of Contents

సామాన్య నామలింగములు, వర్ణములు

అగ్నిదేవుడు పలికెను:

ఇప్పుడు సామాన్య నామలింగములను చెప్పెదను. వినుము. సుకృతీ, పుణ్యవాన్, ధన్యః=పుణ్యాత్ముడు; మహేచ్ఛః, మహాశయః=గొప్ప ఇచ్ఛ కలవాడు; ప్రవీణ, నిపుణ, అభిజ్ఞ, విజ్ఞ, నిష్ణాత, శిక్షిత=నేర్పుకలవాడు. వదాన్య, స్థూలలక్ష, దాన, శౌండ, బహుప్రద=గొప్ప ఔదార్యవంతుడు. కృతజ్ఞః, కుశలః-ప్రవీణుడు. ఆసక్తః, ఉదుక్తః, ఉత్సుకః, కార్య లగ్నుడు. ఇభ్యః, ఆఢ్యః=ధనవంతుడు. పరివృఢః, అధిభూః, నాయకః, అధిపః=అధిపతి. లక్ష్మీవాన్, లక్ష్మణ, శ్రీలః=కాలక్ష్మీ సంపన్నుడు. స్వతంత్రః, స్వైరీ, అపావృతః=పర్యా. ఖలపూః, బహుకరః=కళ్ళము శుభ్రము చేయువాడు. దీర్ఘసూత్రః, చిరక్రియః=పనులలో చాల ఆలస్యము చేయువాడు. జాల్మః, అసమీక్ష్యకారి=ఆలోచన లేకుండ పనిచేయువాడు. కుంఠః=పనులలో మాంద్యము కలవాడు, కర్మఠః=కర్మశూరుడు; భక్షకః, ఘస్మరః, అద్మరః=పర్యా. లోలుపః, గర్ధలః, గృధ్నుః=లోభి; వినీతః, ప్రశ్రితః=వినయవంతుడు. ధృష్ణుః=వియాతః=ధృష్టుడు. నిభృతః-ప్రగల్భః=ప్రతిభావంతుడు. భీరుకః, భీరుః=పిరికివాడు. వందారుః=నమస్కరించువాడు. భూష్ణుః, భవిష్ణుః=కాబోవునది; విదురః, విందకః=తెలుసుకొనువాడు. మత్తః=శౌండః, ఉత్కటః, క్షీభః=మత్తెక్కినవాడు. చండః=చాల కోపము కలవాడు. దేవ ద్రియఙ్=దేవతలను అనుసరించువాడు. విశ్వగ్ద్ర్యిఙ్=అన్ని వైపులకు వెళ్ళు వాడు. సద్ర్యఙ్=కూడవచ్చువాడు. వాగ్మీ=మాటలలో నేర్పరి. బావదూకః=ఎక్కువ మాటలాడు వాడు. జల్పాకః, వాచాలః, వాచాటః=నింద్యమైన వాక్కు కలవాడు. అపధ్వస్తః=ధిక్కరింపబడినవాడు. కీలితః, సంయతః=బుద్ధుడు.

రవణః, శబ్దనః=ధ్వని చేయువాడు; నాందీ వాదీ, నాందీకరః పర్యాయ పదములు. వ్యసనారః, ఉపరక్తః=పీడితుడు. విహస్తః, వ్యాకులః=శోకాకులుడు. నృశంసః, క్రూరః, ఘాతుకః, పాపః=క్రూరుడు. ధూర్తః=వంచకుడు. వైధేయః, బాలిశః=మూర్ఖుడు; కృపణః-క్షుద్రః=లోభి. మార్గణః, యాచకః=యాచకులు. అహంయుః=అహంకారవంతుడు. శుభం యుః=శుభాన్వితుడు. కాంత, మనోరమ, రుచ్య=సుందరము. హృద్య, అభీష్ట, ఈప్సిత=ప్రియమైనది; ఫల్గు-శూన్యం, సారములేనిది. ముఖ్య, వర్య, వరేణ్యక, శ్రేయాన్, శ్రేష్ట, పుష్కల=శ్రేష్ఠములు. ప్రాగ్య, అగ్ర్య, అగ్రీయ=శ్రేష్ఠములు. వడ్ర, ఉరు, విపుల=విశాలము. పీవన్, స్థూల, పీవర=బలిసియున్న. స్తోక, అల్ప, క్షుల్లక, సూక్ష్మ-స్లక్ష్ణ్మ దభ్ర, కృశ, తను, మాత్రా, తృటి, లవ, కణ=సూక్ష్మము అల్పము; భూయిష్టం, పురుహం, పురు=అధికము. అఖండం, పూర్ణం సకలం=పర్యా. ఉపకంఠ, అంతిక, అభితః, సన్నిధి, అభ్యాశ=సమీపము. నేదిష్ఠ=చాల దగ్గరగా వున్నది. దవిష్ఠం=సుదూరము. వృత్త, నిస్థల, వర్తుల=గుండ్రనిది. ఉచ్చ, ప్రాంశు, ఉన్నత, ఉదగ్ర=ఉన్నతమైనది. ధ్రువ, నిత్య, సనాతన=నిత్యము. ఆవిద్ధ, కుటిల, భుగ్న, వేల్లిత=పర్యా. చంచల, తరల=పర్యా. కఠోర, జరఠ, దృఢ=పర్యా. ప్రత్యగ్ర, అభినవ, నవ్య, నవీన, నూతన, నవ=క్రొత్తది, ఏకతానః=ఏకాగ్రచిత్తుడు. ఉచ్చండం, అవిలంబితం=తొందరగా, ఉచ్చావచం=అనేక భేదములు కలది. సంబాధః, కలిలం=ఇరుకు. తిమిత, స్థిమిత, క్లిన్న తడిసిన; అభియోగః, అభిగ్రహః=ఎదుటి వానిపై దోషము ఆరోపించుట. స్ఫాతిః=వృద్ధి; ప్రథా=ప్రసిద్ధి; సమాహారః, సముచ్చయః=సమూహము. అపహారః, అపచయః తగ్గిపోవుట. విహారః, పరిక్రమః=విహరించుట, ప్రత్యాహారః=ఇంద్రియములను విషయముల నుండి మరలించుట. నిర్హారః=లాగి వేయుట. విఘ్నః, అంతరాయః, ప్రతూహః=సమానార్థకములు. ఆస్యా, ఆసనా, స్థితిః=కూర్చుండుట. సన్నిధిః, సన్నికర్షః=దగ్గరగా ఉండుట, సంక్రమః దుర్గములో ప్రవేశించుట, ఉపలంభః=అనుభవము, ప్రత్యాదేశః=నిరాకరణము; పరిరంభ, పరిష్వంగ, సంశ్లేష, ఉపగూహన=ఆశ్లేషించుట; అనుమా=పక్ష హేత్వాదులచే తెలుసుకొనుట; డింబ, భ్రమర, విప్లవ=భయపడ్డ వాడు వేయు కేక; శాబ్దం=శబ్దము వల్ల కలిగిన దూరస్థ పదార్థ జ్ఞానము; ఉపమానకం=సాదృశ్యమును బట్టి ఏర్పడిన తుల్య వస్తు జ్ఞానము; అర్థాపత్తిః=కార్యమును బట్టి మరొక విషయమును ఊహించుట; అభావకః=ప్రతియోగి కనబడక పోవుటచే అది అచట లేదు అని కలుగు జ్ఞానము. ఈ విధముగ మానవులకు జ్ఞానము కొరకై నామ లింగ స్వరూపుడగు హరి చెప్పబడినాడు. (367)