అగ్ని మహా పురాణము

Table of Contents

తైలోక్య విజయవిద్య

పరమేశ్వరుడు పలికెను:

ఇపుడు నేను, సమస్త యంత్ర మంత్రములను నశింపచేయు త్రై లోక్య విజయ విద్యను చెప్పెదను. ‘ఓం హూం క్షూం హ్రూం............త్రై లోక్య విజయే హుం ఫట్ స్వాహా’ అను మంత్రము త్రైలోక్య విజయ విద్య. విజయము కోరువాడు నీలవర్ణము గలదియు, ప్రేతాది రూఢయు అగు త్రైలోక్య విజయావిద్య యొక్క ఇరువది హస్తముల ఎత్తుగల ప్రతిమ నిర్మించి దానిని పూజించవలెను; పంచాంగ న్యాసము చేసి (ఎఱ్ఱని) రక్త పుష్పముల హోమము చేయవలెను. ఈ త్రైలోక్య విద్యను పఠించుటచే సమర భూమి యందు శత్రు సైన్యములు పారిపోవును. మట్టితో ఒక మూర్తి తయారుచేసి, దానిలో శత్రువున్నట్లు భావన చేయుచు, ఆ శత్రువు పేరు భుజంగుడని తలచుచు, ‘ఓం నమో బహు రూపాయ ......బహురూపాయ నమః’ ఇత్యాది (మూలోక్త) మంత్రముచే అభిమంత్రించి, ఆ శత్రువు నశించుటకై పై మంత్రమును జపించవలెను. శత్రువు నశించును. (134)