అగ్ని మహా పురాణము

Table of Contents

ఛందోజాతి నిరూపణము

అగ్నిదేవుడు చెప్పెను:

ఉత్కృతి ఛందస్సునందు నూట నాలుగు అక్షరములు ఉండును. ఉత్కృతి నుండి నాలుగేసి అక్షరములు తగ్గించుచు పోయినచో వేరువేరు ఛందస్సులు ఏర్పడును. అవి వైదిక ఛందస్సులు, గాయత్రి మొదలు త్రిష్టుప్ వరకు వున్నవి. లౌకిక ఛందస్సులు కూడ వాటి పేర్లు త్రిష్టుప్, పంక్తి, బృహతీ, అనుష్టుప్, ఉప్టిక్, గాయత్రి అనునవి. గాయత్రిలో ఒక్కొక్క అక్షరము తగ్గినచో సుప్రతిష్ఠా ప్రతిష్టా మధ్యా, అత్యుక్తాత్యుక్తా మొదలగు ఛందస్సు లేర్పడును. ఛందస్సులో నాల్గవ భాగమునకు పాదమని పేరు. ముందు గణఛందస్సు చెప్పబడుచున్నది. నాలుగు లఘు అక్షరములు ఒక గణము. ఇవియైదు కొన్ని చోట్ల ఆది గురువు - మధ్య గురువు - అంత్య గురువు సర్వ గురువు - నాల్గు అక్షరము లును లఘువులు ఉండవచ్చును. ఇపుడు అర్యా లక్షణము చెప్పబడుచున్నది. ఏడున్నర గణములతో ఆర్య ఏర్పడును. విషమ గణము జగణము కాకూడదు. ఆరవ గణము జగణము కావలెను. లేదా సర్వ లఘువు కావలెను. సర్వ లఘువైనపుడు ఆగణము యొక్క ద్వితీయాక్షరము నుండి పదసంజ్ఞ ఏర్పడును. ఆరవ గణము మధ్య గురువుగాని, సర్వ లఘువు కాని అయినచో, ఏడవ గణము కూడ సర్వ లఘువైనచో దాని ప్రథమాక్షరము నుండి పదసంజ్ఞ ప్రవర్తించును. ఉత్తరార్ధమున ఐదవ గణము సర్వ లఘువైనచో దాని ప్రథమాక్షరము నుండి పద ప్రారంభమగును. ఉత్తరార్ధమున ఏడవ గణము ఏకమాత్ర లఘువగును. పూర్వార్ధ ఉత్తరార్ధములందు మూడేసి గణములుండి వాటి తరువాత పాద విరామమైనచో ఆ ఆర్యకు పథ్యాయని పేరు. పూర్వార్ధము నందుగాని ఉత్తరార్ధమునందు గాని రెండింటి యందుకాని మూడు గణముల తరువాత పాద విరామము లేకున్నచో దానికి విపులయని పేరు. ద్వితీయ చతుర్థగణములు గుర్వక్షరముల మధ్యనుండి జగణము కూడ వున్నచో దానికి చపలయనిపేరు. పూర్వార్ధమున చపలా లక్షణమున్నది. ముఖచపలా! ఉత్తరార్థమున చపలా లక్షణమున్నది. జఘన చపలా, రెండింటి అందును, చపలాలక్షణము ఉన్నది మహా చపలా! పూర్వార్థమువలె ఉత్తరార్ధమున్నచో గీతి ఉత్తరార్థమువలె పూర్వార్థమున్నచో ఉపగీతి. పూర్వోక్త క్రమమునకు విపరీతముగ నున్నచో ఉద్గీతి. ఇప్పుడు మాత్రాఛందస్సు చెప్పబడుచున్నది. ప్రథమ తృతీయ చరణములందు పదునాలుగు లఘువులు, ద్వితీయ చతుర్గ చరణములందు పదహారు లఘువులు, అన్ని చరణముల అంతమునందు రగణ లఘువు, గురువులు ఉన్నచో వైతాళీయ ఛందస్సు. దీని అంతమున ఒక గురువు అధికముగ ఉన్నచో అది ఔపచ్ఛందసికము. దీని చరణముల అంతములందు భగణము, రెండు గురువులు వున్నచో ‘ఆపాతాలికా’ ఈ వైతాళీ ఛందస్సునందు చెప్పబడిన రగణాదులతో ఒక్కొక్క పాదము యొక్క అంతమున ఎనిమిది లకారములు, చెప్పబడినవి. వాటిని విడిచి ప్రత్యేక పాదమున మిగిలిన లకారములలో సమ ‘ల’ కారములు విషమ ‘ల’ కారములతో కలువకూడదు. ద్వితీయ చతుర్థ పాదములందు ఆరు లఘువులను వరుసగా ప్రయోగించకూడదు. తృతీయ చతుర్థ పాదములందు చతుర్థ ‘ల’ కారము, పంచమ ‘ల’ కారముతో సంయుక్తమైనచో యది ప్రాచ్యవృత్తి. ప్రథమ తృతీయ పాదములందు ద్వితీయ తృతీయ ‘ల’ కారములు మిశ్రితములైనచో ఉదీచ్యవృత్తి రెండు లక్షణములను ఒకే పర్యాయము ప్రవర్తించినచో అది ప్రవృత్తికా. నాల్గు పాదములు విషమ పాదములను అనుసరించి యున్నచో అది చారుహాసిని. సమపాద లక్షణములు ఉన్నచో అపరాంతిక. ఒక్కొక్క పాదమున పదునారు ‘ల’ కారములుండి, పాదాంతి మాక్షరములు గురువులైనచో అది మాత్రా సమకము. దీనిలో పండ్రెండవ ‘ల’ కారముల స్వరూపము నందేవున్నచో యది వనవాసికా పంచమ అష్టమ ‘ల’ కారములు లఘువులైనచో విశ్లోకము తొమ్మిదని కూడ లఘువైనచో అది చిత్ర. నవమదశమములు కలిసినచో ఉపచిత్ర మాత్రా సమకాది పంచఛందస్సులలో ఒక్కొక్క పాదముతో నాలుగు పాదముల ఛందస్సు ఏర్పరచినచో దానికి పాదాకులకము అని పేరు. ఒక్కొక్క పాదమున పదునారేసి లఘువులు ఉండి దేనితోను కలిసి గురువు కానిచో అది గీత్యార్య. దీనిలోనే అర్ధ భాగములో అన్ని మాత్రలు గురువులు, రెండవ అర్థమున లఘువులు అయినచో అదిశిఖా, దీనికి విపర్యసార్ధమైనచో తూలిక. పూర్వార్థమున ఇరువది తొమ్మిది ‘ల’ కారములు, ఉత్తరార్థమున ముప్పది ఒక్క ‘ల’ కారములు, చివరి రెండు లఘువుల స్థానమున ఒక గురువు వున్నచో అది సమావల. ‘గు’ యనునది ఒక గురువును చెప్పును. అక్షర సంఖ్యలో గురుసంఖ్యను తగ్గించగ మిగిలినది లఘుసంఖ్య అగును. (331)