అగ్ని మహా పురాణము

Table of Contents

బ్రహ్మవర్గ వర్ణన

అగ్నిదేవుడు పలికెను: వంశ, అన్వవాయ, గోత్ర, కుల, అభిజన, అన్వయ=వంశము. మంతవ్యాఖ్యానము చేయువాడు ఆచార్యుడు. యజ్ఞము నందు వ్రతదీక్ష గ్రహించినవాడు ఆదేష్ట. యష్టా, యజమానః=పర్యా. ఉపక్రమః=తెలిసిచేసిన ప్రారంభము; సతీర్థ్యాః=ఒక గురువు కలవారు. సభ్యాః, సామాజికాః, సభాసదః, సభాస్తారాః=పర్యా, ఋత్విజః, యాజకాః=పర్యా. అధ్వర్యుః=యజుర్వేదము తెలిసిన ఋత్విక్, ఉద్గాతా=సామవేదము తెలిసిన ఋత్విక్, హోతా=ఋగ్వేదము తెలిసిన ఋత్విక్. చశాలః=యూపస్తంభము నందలి కటకము. స్థండిలం, చత్వరం=పర్యా. ఆమిక్షా=కాచిన పాలు తోడుబెట్టగా దానినుండి వచ్చిన నీరు; పెరుగు కలిపిన నెయ్యి పృషదాజ్యమ్. పరమాన్నం, పాయసం=పర్యా. యజ్ఞమునందు అభిమంత్రించి చంపబడిన పశువు ‘ఉపాకృతము’. పరంపరాక, శమన, ప్రోక్షణ=యజ్ఞ పశువధము. పూజా, నమస్యా, అపచితిః, సపర్యా, అర్హణా=పర్యా. వరివస్యా, శుశ్రూష, పరిచర్యా, ఉపాచనమ్=సేవ; నియమః, వ్రతమ్=పర్యా. పుణ్యకమ్=ఉపవాసాది వ్రతము; ప్రధానమైనది ముఖ్య కల్పము. అధమమైనది అనుకల్పము. కల్పః విధిః క్రమః=పర్యా. వివేకః=వేర్వేరుచేసి గ్రహించుట. ఉపాకరణమ్=సంస్కార పూర్వకముగ వేదమును గ్రహించుట. భిక్షు, పరివ్రాట్, కర్మందిన్, పారాశరిన్, మస్కరిన్=సన్యాసి; సత్యవాక్కు కలవారు ఋషులు. వేదాధ్యయన వ్రతమును సమాప్తి చేసినవాడు స్నాతకుడు. యతిన్, యతి=ఇంద్రియములను వశములో వుంచుకొనువాడు; శరీర సాధ్యమగు నిత్యకర్మకు ‘యమము’ అని పేరు. అప్పుడప్పుడుచేయు అనిత్యకర్మ నియమము. బ్రహ్మ భూయమ్, బ్రహ్మత్వమ్, బ్రహ్మ సాయుజ్యమ్=పర్యా. (365)