అగ్ని మహా పురాణము

Table of Contents

విషమ కథనము

అగ్నిదేవుడు పలికెను:

సమ, అర్ధసమ, విషమములను, మూడు విధములగు వృత్తములను చెప్పెదను. సమవృత్త సంఖ్యలో అదే సంఖ్యతో గుణించవలెను. దాని గణన ఫలము అర్ధ సమవృత్త సంఖ్య అగును. అర్ధ సమవృత్త సంఖ్యలో కూడ ఆ సంఖ్యతో గుణించగా ఎంత వచ్చునో యన్ని విషమ వృత్తములగును. విషమ వృత్త అర్ధ సమవృత్త సంఖ్యలలో మూల రాశిని తీసివేయగా శుద్ధవిశమ, శుద్ధ అర్ధసమ, వృత్తముల సంఖ్య తెలియును. ఒక్కొక్క పాదమునందు గురు లఘువులతో సమాప్తిని పొంది అనుష్టుప్ కు సమాని’ అని పేరు. అంతిమ వర్ణములు వరుసగ లఘువు గురువుయైనచో అది ప్రమాణి’ ఈ రెండింటి కంటే భిన్నమైనది. వితానము, ఇటుపైన మూడు అధ్యాయముల వరకు ‘పాదస్య’ అను పదము, పద చతురూర్ధ్వ ఛందస్సువరకు అనుష్టుప్ వక్త్రము అనునదియు, అధికార పదములు వక్త్ర జాతి ఛందస్సులో పాద ప్రథమాక్షరము తరువాత సగణన గణములను ప్రయోగించరాదు. చతుర్ధాక్షరము తరువాత భగణము ప్రయోగించవలెను. ద్వితీయ, చతుర్థ పాదముల నాల్గవ అక్షరముల తరువాత జగణము వచ్చినది పథ్యా వక్త్ర. కొందరి మతము ప్రకారము ఇందుకు విపరీతముగ చేసినచో అది పథ్యా. విషమపాద చతుర్థాక్ష రానంతరము, నగణము సమపాద చతుర్థాక్షరానంతరము యగణము ఉన్నది చపలా సమ పాదములలో ఏడవ అక్షరము లఘువు అయినచో అది విపులా, ప్రథమ తృతీయ పాదముల, చతుర్థాక్షరము తరువాత, యగణమునకు బదులు భగణాదులున్నచో యది ‘విపుల’. ఈ విధముగ ‘విపుల’ అనేక విధములుగా ఉండును. ఇంతవరకు వక్త్రజాతి ఛందస్సులు చెప్పబడినవి. అనుష్టుప్ ప్రథమ పాదము తరువాత పాదములందు క్రమముగా నాల్గేసి అక్షరమున్నచో దానికి పాద చతురూర్ధ్వము అని పేరు. దీనిలో చివరి రెండు అక్షరములు గురువులైనచో ఆపీడము. మొదటి రెండు అక్షరములు, గురువు, మిగిలినవన్ని లఘువు లైనచో ‘ప్రత్యాపీడము’ పదచతురూర్ధ్వ ఛందస్సులో, ప్రథమ పాదమునకు ఇతర పాదమునకును పరివర్తనమున్నచో వరుసగా మంజరి, లవలి, అమృతధార, అను ఛందస్సులు ఏర్పడును. ఇప్పుడు ఉద్గీతా ఛందస్సు చెప్పబడుచున్నది. ప్రథమ పాదమున స, జ, స, లఘువులు, ద్వితీయ పాదమున న, స, జ, గురువులు, తృతీయ పాదము భ, న, జ, లఘు గురువులు, చతుర్థ పాదమున స, జ, సజ, గురువులు ఉన్నచో అది ఉద్గతా ఛందస్సు. దీని తృతీయ చరణమున రా, న, భ, గురువులు వున్నచో యది సౌరభము. ఉద్గీత తృతీయ పాదమున న, న, స, స లు ఉన్నచో అది లలిత, ప్రథమ పాదమున య, స, జ, భ, గురు ద్వయములును, ద్వితీయ పాదమున స, న, జ, ర, గురువులు, తృతీయ పాదమున న, న, సములును, చతుర్థ పాదమునన, న, న, జ, భగణములును ఉన్నచో అది ప్రచుపిత ఛందస్సు. దీని తృతీయ పాదమున న, స, న, న, స, గుణములున్నచో వర్ధమానఛందస్సు. తృతీయపాదమున త, జ, ర ములు ఉన్నచో అది శుద్ధ విరాడర్షభము. ఇప్పుడు అర్ధ సమవృత్తములు చెప్పెదను. (332)