అగ్ని మహా పురాణము
భూమ్యాదివర్గము, నిరూపణము
అగ్నిదేవుడు పలికెను: భూ, పుర, అద్రి, వనౌషధి సింహాది వర్గములను చెప్పెదను. భూః=అనంతా, క్షమా, ధాతీ, క్ష్మా, కుః. ధరిత్రీ=భూమి. మృత్-మృత్తికా=మట్టి. మృత్స్నా-మృత్సా=ప్రశస్తమైన మట్టి; జగత్, త్రివిష్టపమ్-లోకః, భువనం, జగతీ=పర్యా. అయనం, మార్గః, వర్త్మ, అధ్వా, పథిన్, పదవీ, శ్రుతిః, పద్ధతిః ..... పద్యా, వర్తనీ, ఏకపదీ=మార్గములు. పూః=స్త్రీ, పురీ, నగరీ, పత్తనం, పుటభేదనం, స్థానీయం, నిగమః=నగరము. రాజధాని కంటె భిన్నమైన నగరము శాఖా నగరము. వేశ్యాజనాశ్రయము వేశము; ఆపణః, నిషద్యా=దుకాణము; విపణిః, పణ్య వీధికా=అంగడి; రథ్యా, ప్రతోలీ, విశిఖా=నగర ముఖ్య మార్గములు. వస్త్రం, భయః, ప్రాకారః, వరణః, శాలః, ప్రాచీరః=నగరము చుట్టు వున్న ప్రాకారములు. భిత్తిః, కుడ్యమ్=గోడ. లోపల ఇనుప ఊసలు వేసిన కుడ్యమునకు ఏడూకః’ అని పేరు. వాసః, కుటీ, కుటః=నివాస స్థానము. శాలా, సభా=శాల. నాలుగు శాలలు కలగృహము సంజవనము. మునుల నివాసమునకు పర్ణశాల, ఉటజః అని పేరు. చైత్యమ్, ఆయతనమ్=పర్యా. మందురా=అశ్వశాల, ధనికుల నివాసము. ‘హర్మ్యము’ మొదలగునది. దేవతల, రాజుల, నివాసము ప్రాసాదము. ద్వాః=(స్త్రీ) ద్వారమ్, ప్రతీహారః=ద్వారము. వేదికా, వితర్దిః=అరుగు. ‘విటంకమ్’=పావురముల గూడు, కపాటమ్, అరరమ్=తలుపు. ‘నిశ్ర్శేణిః’, అధి రోహిణీ=నిచ్చెన. సమార్జనీ, శోధనీ=చీపురు. సంకరః, అవకరః=తుడిచిన తుక్కు. అద్రిః, గోత్రః, గిరిః, గావా=పర్వతము. గహనమ్, కాననమ్, వనం=అరణ్యము. ఆరామః, ఉపవనమ్, ఉద్యానవనము. ప్రమద వనమ్=అంతపురము నందలి ఉద్యానవనము. వీథీ, ఆవలిః, పంక్తిః, శ్రేణీ, రాజిః=పంక్తి. పూవులు పూసి ఫలములు కాయు వృక్షము వానస్వత్యము. పూవులు లేకుండా కాయలు కాయునది వనస్పతి. పండ్లు మగ్గిన పిమ్మట ఎండిపోవు వాటిని ఓషధులు అందురు. పలాశీ, ద్రుః, ద్రుషుః, ఆగమః=వృక్షము. స్థాణుః, ధ్రువః, శంఖుః=మొండేరు చెట్లు. ప్రపుల్ల, ఉత్ఫుల్ల, సంస్ఫుట=పూవులతో నిండిన వృక్షములు. పలాశమ్, ఛదనమ్, వర్ణమ్=ఆకు. ఇద్మ, ఏధస్, సమిధ్=సమిధలు. బోధి ద్రుమః, చలదళః=రావిచెట్టు. దధిత్థః, గ్రాహి, మన్మథః, దధి, ఫలః, పుష్ప ఫలః, దంత శఠః=వెలగ చెట్టు; హేమదుగ్ధః, ఉదుంబర వృక్షము. ద్విపత్రః=కోవిదార వృక్షము. సప్తవర్ణః=విశాల త్వక్=ఏడాకుల అరటి చెట్టు. కృతమాలః, సువర్ణకః, ఆరేవతః, వ్యాధి ఘాతః, శమ్యాకః, చతురంగుళః=పర్యా. దంత శఠః =జంబీరః=నిమ్మకాయ. తిక్త శావకః, వరుణః=పర్యా. పురుషః, తుంగః, కేసరః, దేవవల్లభః =పున్నాగ వృక్షము. నింబతరుః, మందారః, పారిజాతకః=పారిభద్ర వృక్షము. వంజులు, చిత్ర కృత్=పర్యా. పీతనకః=పీతనః=సమానార్థకములు. గుడ పుష్పః, మధు ద్రుమః=సమానార్థకములు. గుడఫలః, స్రంసీ=పీలు వృక్షము. నాదేయీ అంబు వేతసః=వేపచెట్టు. శిగ్రుః, తీక్ష్ణ గంధకః, కాక్షీరః, మోచకః=శోభాంజన వృక్షము. ఎర్రగా నున్న దీనినే మధు శిగ్రుః’ అందురు. అరిష్ఠః, ఫేనిలః=పర్యా. గాలవః-శాబరః లోధ్రః-తిరీటః-తిల్వః-మార్జనః-వృక్షము. శేలుః-శ్లేష్మాతః-శీతః-ఉద్దాలః-బహు వారకః, వైకంకతః, స్రువావృక్షః, గ్రంథిలః, వ్యాఘ్రపాత్=సమానార్థకములు. తిందుకః, స్పూర్ణకః, కాలః, పర్యా. నాదేయీ-భూమి జంబుకః=నాగ రంగ వృక్షము. క్రముకః-పట్టికా=పర్యా. కుంభీ, కైడర్యః, కట్పలః, సమానార్థకములు, వీర వృక్షః, అరుష్కరః, అగ్నిముఖీ, భల్లాతకీ, పర్యా. సర్జకః, అసనః, జీవః, పీతసాలః, పర్యా. సర్జః, అశ్వ కర్ణః=సాల వృక్షము. వీరద్రుః, ఇంద్రదుః, కకుభః, అర్జునః=అర్జున వృక్షము. ఇంగుదీ=ఇది మునుల వృక్షము; మోచా-శాల్మలీ=పర్యా. చిరబిల్వః-నక్తమాలః, కరజః=కరంజక వృక్షము. ప్రకీర్యః, పూతి కరజః=పర్యా, మర్కటీ, అంగార వల్లరీ=పర్యా, రోహీ, రోహితకః, ప్లీహశుత్రుః, దాడిమ పుష్పకః=పర్యా. గాయత్రీ. బాల తనయః, ఖదిరః, దంత ధావనః=పర్యా.
అరిమేధః, విట్కదిరః=పర్యా. కదరః=తెల్లకదిరము. పంచాంగుళః=వర్ధమానః, చంచుః, గంధర్వ హస్తకః=ఆముదపు చెట్టు, పింటీతకః, మరువకః=పర్యా. పీతదారుః, దారుః, దేవదారుః, పూతి కాష్ఠం=దేవదారువృక్షము. శ్యామా, మహిళాహ్వయ, లతా, గోవందినీ, గుండా, ప్రియంగుః, ఫలినీ, ఫలీ=పర్యా. మండూక వర్ణః=పత్రోఽర్ణః, నటః, కట్వంగః, టుంటుకః, స్యోనాకః, శుకనాసః, ఋక్షః, దీర్ఘవృంతః కుటన్నటః=పర్యా. పీతద్రుః, సరళః=పర్యా. నిచుం, అంబుజ, ఇజ్జల=పర్యా. కాకోదుంబరికా, ఫల్గు=పర్యా. పీతద్రుః, సరళః=పర్యా. నిచుల, అంబుజ, ఇజ్జల=పర్యా, కాకోదుంబరికా, ఫల్గు=పర్యా. అరిష్ట, పిచుమర్ధక, సర్వతోభద్ర, నింబ=పర్యా. శిరీష, కపీతన=పర్యా. వకుల, వంజుల=పర్యా. పిచ్ఛిలా, అగరు-శింశప=పర్యా. జయా, జయంతీ, తర్కారీ, పర్యా. కణికా, కణి కారికా, శ్రీపర్ణ, అగ్ని మంథ=పర్యా. వత్సక, గిరిమల్లికా=పర్యా. కాలస్కంద, తమాల, తాపిచ్ఛ=సమాన పదములు, తండులీయ, అల్ప మారిష=పర్యా. సింధువార=నిర్గుండీ, పర్యా. ఆస్ఫోటా=వనములో పుట్టిన సింధువారము. గణికా, యూథికా, ఆంబష్ఠా=పర్యా. సప్తలా, నవమాలికా, పర్యా. అతిముక్త, పుండ్రక=పర్యా. కుమారి=తరణి, సహా=పర్యా. రక్త కుమారికి కురవకమనియు, పచ్చని దానికి కురంటక మనియు పేర్లు. నీవి, ఛింటీ, బాణా=పర్యా. ఝింటీ, సైరీయః=పర్యా. రక్త సైరీయకము, కురువకము, పీతవర్ణము, సహచరి. దస్తూర, కితవ, ధూర్త, పర్యా. రుచక, మాతులుంగ=పర్యా. సమీరణ, మరువక, ప్రస్థపుష్ప, ఫణిజ్జక=పర్యా. కుఠేరక, వర్ణాస=పర్యా. ఆస్పీత, వసుక, అర్క=వర్యా. శివమల్లీ, పాశుపత, పర్యా. వృందా, వృక్షాదనీ, జీవంతికా, వృక్షరుహా=పర్యా. గడూచీ, తంత్రికా, అమృతా, సోమవల్లీ, మధుపర్ణ=పర్యా. మూర్వా, మోరటి, మధూలికా, మధుశ్రేణీ, గోకర్ణీ, పీలువర్ణీ= పర్యా. పాఠా, అంబష్ఠా, విద్ధకర్ణీ, ప్రాచీనా వనతిక్తికా=పర్యా. కటు, కటుంబరా, చకాంగీ, శకులాదనీ=పర్యా. ఆత్మగుప్తా, ప్రావృషాహి, కపికచ్ఛు, మర్కటీ=పర్యా. అపామార్గ, శైఖరిక, ప్రత్యక్పర్ణీ, మయూరక=పర్యా, ఫంజికా, బ్రాహ్మణీ, భార్గీ=పర్యా, ద్రవంతీ, శంబరీ, వృషా=పర్యా.
మండూకపర్ణీ, బండీరి, సమంగా, కాలమేషికా=పర్యా. రోదనీ, కచ్చురా, అనంతా, సముద్రాంత, దురాలభా=పర్యా. పుస్నిపర్ణీ, పృథక్పర్ణీ, కలశిధావని, గుహా=పర్యా. నిర్దిగ్ధికా=స్పృశీ, వ్యాఘ్రా, క్షుద్రా, దుస్స్పర్శా=పర్యా. అవల్గుజ, సోమరాజీ, సువల్లి, సోమవల్లికా, కాలమేషి, కృష్ణఫలా, వాకుచీ, పూతిఫలీ=పర్యా. కణా, పుష్టా, ఉపకుల్యా=పర్యా, శ్రేయసీ, గజపిప్పలీ=పర్యా, చవ్య-చవికా=పర్యా, కాకచించీ, గుంజా, కృష్ణలా=పర్యా. విశ్వా, విషా, ప్రతివాషా=పర్యా. వనశృంగారట, గోక్షుర=పర్యా. నారాయణీ, శతమూలీ, పర్యా. కాలేయక, హరిద్రవ, దార్వీ, వచంపదా, దారు=పర్యా, శుక్లా, హైమవతీ=తెల్లనివస, వచా, ఉగ్రగంధా, షట్ర్గందా, గోలోమీ, శతపర్వికా=పర్యా. ఆస్పోతా, గిరికర్ణీ=పర్యా. సింహాస్య, వాసక, వృష-=పర్యా. మిశీ, మధురికా, ఛత్రా=పర్యా. కోకిలాక్ష, ఇక్షుర, క్షుర=పర్యా, విడంగ, క్రుమిఘ్న=పర్యా. వజ్ర ద్రుసృక్, స్నుహీ, సుధా=పర్యా. మృద్వీకా, గోస్తనీ, ద్రాక్షా=పర్యా. బలా, వాట్యాలక=పర్యా. కాలా, మసూరవిదలా=పర్యా. త్రిపుటా, త్రివృత్=పర్యా. మధుక, క్లీతక, యష్టి మధుకా, మధుయష్టికా=పర్యా. విదారీ, క్షీరశుక్లా, ఇక్షుగంధా, క్రోష్ట్రీ, యాసితా=పర్యా, గోపీ, శ్యామా, శారిబా, అనంతా, ఉత్పల శారిబా=పర్యా. మోచా, రంభా, కదలీ=పర్యా, భంటాకీ, దుష్ప్రదర్శినీ=పర్యా. ధ్రువా, సాలపర్ణీ=పర్యా, శృంగి, ఋషభ, వృషభ, పర్యా. గాంగేరుకి, నాగబలా=పర్యా. ముషలీ, తాలమూలికా=పర్యా, జ్యోత్స్న, పటోకాలిగా, జాలీ=పర్యా. అజశృంగీ, విషాణీ=పర్యా. లాంగలికీ, అగ్ని శిఖా=పర్యా. తాంబూలీ, నాగవల్లీ=పర్యా. హరేణు, రేణికా, కౌంతీ=పర్యా. హ్రీబ్ధేరీ, దివ్యనాగర=పర్యా. కాలానుసార్య, వృద్ధ, అశ్మపుష్ప, శీత, శివ, శైలేయ=పర్యా. తాలపర్ణీ, దైత్యా, గంధకుటీ, మురా=పర్యా. గ్రంధిపర్ణ, శుక, బర్హి=పర్యా. బలా, త్రిపుటా, తృటి=పర్యా. శివా, తామలకీ=పర్యా. హను, హట్ట విలాసినీ=పర్యా. కుట, నట, దశపుర, వానేయ, పరిపేలవ=పర్యా. తపస్వినీ, జటా మాంసీ=పర్యా. పృక్కా, దేవీ, లతా, లఘు=పర్యా. కర్చూరక, ద్రావిడక=పర్యా. గ్రంధమూలీ, శరీ=కర్చూరకము. ఋక్ష గంధా, ఛగలాంత్రా , ఆవేగీ, వృద్ధదారక=పర్యా. తుండికేరీ, రక్తఫలా, బింబికా, పీలుపర్ణీ, పర్యా. చాంగేరీ, చక్రికా, అంబష్టా=పర్యా. స్వర్ణక్షీరీ, హిమావతీ=పర్యా, సహస్ర వేధీ, చుక్ర, అమ్లవేతస, శతవేధి=పర్యా. జీవంతీ, జీవనీ, జీవా=పర్యా, భూమినింబ, నేలవేము=కిరాతక=పర్యా. కూర్చశీర్ష, మధుకర=పర్యా. చంద్ర, కపివృక=పర్యా. దదృఘ్న, ఏడగజ=పర్యా. వర్షాభూ-శోధహారిణీ=పర్యా. కువందతీ, నికుంబస్త్రా, యమానీ, వార్షికా=పర్యా. లశున, గృంజన, అరిష్ట, మహాకంద, రసోన=పర్యా. వారాహీ, వరదా. గృష్టి=పర్యా. కాకమాచీ, వాయసి=శతపుష్పా, సితచ్ఛత్రా, అతిచ్ఛత్రా, మధురా, మిసి-అవాక్సుష్పీ-కారవీ=ర్యా. సరణా, ప్రసారిణీ, కటంబరా, భద్రవలా, పర్యా. కర్చూర, శటీ=పర్యా. పటోల, కులక, తిక్తక, పటు=పర్యా. కారవేల్ల, కటిల్లక=పర్యా. కుష్మాండక, కర్కారు=పర్యా. ఉర్వారు, కర్కటీ=పర్యా. హర్షోఘ్న, సూరణ=కంద, పర్యా. ముస్తక, కురువింద, పర్యా. త్వత్సార, వేణు, మస్కర, తేజన=వెదురు, ఛత్రా, అతిఛత్రా, పాలఘ్న=పర్యా. మాలా తృణక, భూస్తృణ=పర్యా. తృణరాజః, తాళః=పర్యా. ఘోంటా, క్రముక, పూగ=పర్యా.
శార్దూల, ద్వీపీ=పులి. హర్యక్షః, కేసరీ, హరిః=సింహము. కోలః, పోత్రీ, వరాహః=వరాహము. కోకః, ఈహామృగః, వృకః=తోడేలు, లూతా, ఊర్ణనాభి, తంతు వాయః, మర్కటః=సాలెపురుగు. వృశ్చికః, సూక కీటః=తేలు. సారంగః, తోకకః=సారంగపక్షి, కృకవాకుః, తామ్ర చూడః=కోడి, పికః, కోకిలః=కోకిల; కరటః, అరిష్టః, కాకః=కాకి. బకః, కహ్వః=కొంగ, కోకః, చక్రః, చక్రవాకః=చక్రవాక పక్షి, కాదంబః, కలహంసః=పర్యా. పతంగికా, పుత్తికా=పర్యా. సరఘా, మధుమక్షికా=తేనెటీగ, ద్వి రేఫః, పుష్పలిట్, భృంగః, షట్పదః, భ్రమరః, అలిః, పర్యా. కేకి, శికీ=నెమలి. కేకా=నెమలి కూత. శకుంతీ, శకుని, ద్విజ=పక్షి. పక్షతిః=పక్షమున మూలము. చంచుః, త్రోటిః=పక్షి ముట్టి. ఉడ్డీన, సండీన=పక్షిగతి విశేషము. కూలాయః, నీడమ్=పక్షిగూడు. పేషీ, కోశః, అండమ్=గ్రుడ్లు, పృథుక, శావక, శిశు, పోత, పాక, అర్భక, ఢింబు=శిశువు. సందోహ, పూహక, గణ, స్తోమ, ఓఘ, నికర, వ్రాత, నికురంబ, కదంబక, సంఘాత, సంచయ, బృంద, పుంజ, రాశి, కూట=సముదాయము. (863)
