అగ్ని మహా పురాణము
శబ్దకోశము స్వర్గాది వర్గ నిరూపణము
అగ్నిదేవుడు పలికెను:
స్వర్గాది నామములు లింగముగ కల హరిని గూర్చి చెప్పెదను, స్వస్ స్వర్గ, నాక, త్రిదివ, ద్యో దివ్, (పుం, స్త్రీ) త్రివిష్టపమ్=స్వర్గము, దేవాః వృందారకాః లేఖాః=దేవతలు, రుద్రులు మొదలగువారు గణ దేవతలు. విద్యాధరః అప్సరాః, యక్షః, రక్షః, గంధర్వః, కిన్నరః, పిశాచః, గుహ్యకః, సిద్ధః, భూతః=వీరందరు దేవయోనులు, దేవద్విషః, అసురాః దైత్యాః=దైత్యులు, సుగతః, తథాగతః=బుద్ధుడు, బ్రహ్మా, ఆత్మ భూ, సురజ్యేష్ఠ=బ్రహ్మ, విష్ణుః, నారాయణః, హరిః=విష్ణువు, రేవతీశః, హలీ, రామః=బలరాముడు, కామః, పంచశరః స్మరః=మన్మథుడు, లక్ష్మీః, పద్మాలయా, పద్మా=లక్ష్మి శర్వః, సర్వేశ్వరః, శివః=శివుడు, ఇతని జటాజూటమునకు కపర్దయని పేరు. పినాకః అజగవమ్ ఈ రెండును ఈతని ధనుస్సునకు పేర్లు. శివుని పారిషదులకు ప్రమథాః అని పేరు. మృడానీ, చండికా, అంబికా=పార్వతి ద్వైమాతురః, గజాస్యః=గణపతి, సేనానీః, అగ్నిభూః గుహః=కుమారస్వామి. అఖండల సునాశీర-సుత్రామా, దివస్పతిః=ఇంద్రుడు ఆతని భార్యకు పులోమజా శచీ, ఇంద్రాణీ అనిపేర్లు. ఆతని ప్రాసాదము వైజయంతమ్. ఆతని కుమారుడు జయంతుడు ఐరావతః, అభ్రమాతంగః, ఐరావణః, అభ్రము వల్లభః ఐరావతము హ్రాదినీ, వజ్రం. (పుం, న) కులిశమ్, భిదురమ్, పవి=వజ్రాయుధము, వ్యోమయానం, విమానః (పుంన)=విమానము, పీయూషం, అమృతమ్, సుధా=అమృతము. సుధర్మా-దేవసభా; స్వర్గంగా సురదీర్ఘికా=స్వరలోక గంగ, అప్సరస్ శబ్దము స్త్రీ లింగము నందును నిత్య బహువచనము నందును ఉండును. ఊర్వశి మొదలగువారు స్వర్గలోకవేశ్యలు. హా హాః ఉహూః, వీరు గంధర్వులు, అగ్నిః వహ్నిః, ధనంజయః, జాత వేదా-కృష్ణవర్త్మా, ఆశ్రయాశః, భావకః, హిరణ్య రేతాః, శుక్రః, అశుశుక్షణిః శుచిః, అప్పిత్తమ్=అగ్ని, ఔర్వః, బాడవః బడ వానలః=వడవాగ్ని; అగ్ని యొక్క జ్వాలలు బోధించు జ్వాలకీల శబ్దములు రెండు లింగము లందును ఉండును. అర్చిః, హేతిః, శిఖా, (స్త్రీ)=జ్వాలలు, స్ఫు లింగః (పుం స్త్రీని)=అగ్నికణము, ధర్మరాజః, పరతరాట్ కాలః, హంతకః, దండధరః, శ్రాద్ధ దేవః=యముడు; రాక్షస, కోణప, అస్రప, క్రవ్యాద, యాతుధాన, నైఋతి=రాక్షసులు, ప్రచేతస్, వరుణ, పాశీ=వరుణుడు, శ్వసనః, స్పర్శనః, అనిలః, సదాగతిః, మాతరిష్వన్, ప్రాణః, మరుత్, సమీరణః వాయువు. జవ, రంహస్, తరస్, వేగము, లఘు, క్షప్రిమ్, అరం, ద్రుతమ్, సత్వరం, చపలం, తూర్ణం అవి లంబితయ్ ఆశు=శీఘ్రముగా, సతత, అనారత, అశ్రాంత, సంతత, అవిరత, అనిశ, నిత్య, అనవరత, అజస్ర=ఎల్లప్పుడును, అతిశయః, భరః=అతిశయము, అతివేల, భృశ, అత్యర్థ, అతిమాత్ర, ఉద్గాఢ, నిర్బర, తీవ్ర, ఏకాంత, నితాంత, గాఢ, బాఢ, దృఢ=మిక్కిలి, గుహకేశః, యక్షరాజః, రాజరాజః ధనాధిపః=కుబేరుడు, కిన్నరః, కింపురుషః, తురంగవదనః, మయుః ఇవి సమానార్థకములు. నిధిః-శేవధిః=నిధి, వ్యోమ, అభ్ర, పుష్కర, అంబర-ద్యో, దివ్, అంతరిక్ష, ఖ=ఆకాశము, కాష్ఠా, ఆశా, కుకుభ్, దిశ్=దిక్కులు, అభ్యంతరమ్, అంతరాళమ్, చక్రవాళము, మండలమ్=మండలము. తటిత్వత్, వారిద, మేఘ, స్తనయిత్ను, బలాహక, మేఘము. కాదంబనీ, మేఘమాలా=మేఘపంక్తి, స్తనితం-గర్జితమ్=ఉరుము; శంపా, శతహ్రద, హ్రాదినీ, ఐరావతీ, క్షణప్రభా, తడిత్, సౌదామినీ, విద్యుత్ చంచలా చపలా=మెరుపు స్ఫూర్జథుః, వజ్ర నిర్ఘోషః=ఉరుము, అవగ్రహః అనగా వర్షా భావము.
ధారా వర్షమునకు ఆసారః అని పేరు. శీకరః=నీటి బిందువులు. వర్షాపలః, కరకా=వడగళ్ళు, దుర్దినమ్=మేఘములు కప్పిన దివసము. అంతర్థా, వ్యవధా, అంతర్థి (పుం) అపవారణ, అపిధాన, తిరోధాన, పిధాన, ఆచ్ఛాదన=ఆచ్ఛాదనము. ఆబ్జ, జైవాతృక, సోమ, గ్లౌ, మృగాంక, కళానిధి, విధు, కుముదబంధు=చంద్రుడు. బింబః (పుం.న.) మండలము. (పుం. స్త్రీన)=మండలము, పదహారవ భాగమునకు కళయని పేరు. భిత్త, శకల, ఖండక, ఖండము, చందికా, కౌముదీ, జ్యోత్స్నా=వెన్నెల, ప్రసాదః=ప్రసన్నత్వము, లక్షణమ్=లక్షకమ్, చిహ్నం=చిహ్నము, శోభా, కాంతి, ద్యుతి, ఛవి, కాంతి పరుమ శోభ-సషమ. తుషార, తుహిన, హిమ=మంచు-సన్నని మంచునకు అవశ్యాయః, నీహారః అని పేర్లు. ప్రాలేయః శిశిరః- హిమః=ఇవి కూడ నీహారమునకు పేర్లు. నక్షత్ర-ఋక్ష, ఖ, తారా, తారకా, ఉడు, స్త్రీ.న.=నక్షత్రము, గురుః, జీవః, ఆంగిరసః=గురుడు, ఉశనాః, భార్గవః=కవిః=శుక్రుడు, విదుంతుదః-తమః-రాహుః=రాహువు, లగ్నం=రాశియొక్క ఉదయము. మరీచి, అత్రి మొదలగువారు సప్తర్షులు. చితశిఖండినః అని పేరు. హరిదశ్వ, బ్రధ్న, పూష, ద్యుమణి, మిహిర, రవి=సూర్యుడు, పరివేషః, పరిధిః, సూర్యుని చుట్టు కట్టిన మండలము. కిరణ, ఉశ్ర, మయూఖ, అంశు, గభస్తి, ఘృణి, ఘృష్ణి, భాను, కర, మరీచి (స్త్రీ, పు.) దీధితి=కిరణము (స్త్రీ), ప్రభా, రుచి, త్విట్, భా, ఆభా, ఛవి, ద్యుతి, దీప్తి, రోచిస్, (న) శోచిన్(న)=కాంతి, ప్రకాశ, ద్యోత ఆతప, ఎండ, కోష్ణ, కవోష్ణ, మందోష్ణ, కదుష్ణ=కొంచెము వేడి, కొంచెము వేడి కలది అను అర్థమున త్రిలింగములు. తిగ్మ, తీక్ష్ణ, కర=తీక్ష్ణము, దిష్ట, అనేహ, కాల, కాలము, ఘస్రః=రాత్రింబవళ్ళు; సాయం సంధ్యా, పితుప్రసూః=సాయంకాల సంధ్యా, ప్రత్యూషః, అహర్ముఖం, కల్యం, ఉషః, ప్రత్యుషః=ప్రాతః కాలము, ప్రాహ్ణ అపరాహ్ణ, మధ్యాహ్నములకు త్రిసంధ్యము అని పేరు. శర్వరీ, యామి, తమీ=రాత్రి; తమిసా=చీకటి రాత్రి; జ్యోత్స్న=వెన్నెలరాత్రి. రాబోవు పగలు జరుగుచున్న పగలు కలసిన రాత్రికి ‘పక్షిణీ’ అని పేరు. అర్ధరాత, నాశీథ=అర్థరాత్రి, ప్రదోషః=సాయంకాల ప్రారంభము. ప్రతిపత్తునకును, పూర్ణిమ అమావాస్యలకును మధ్య నున్నది పర్వసంధి. రెండు పక్షాంత తిథులకు పంచదశీ అని పేరు. పౌర్ణమాసీ, పూర్ణిమా=పూర్ణిమ, చంద్రుడు ఒక కళ తక్కువున్నచో ఆ పూర్ణిమా ‘అనుమతి’ పూర్ణ చంద్రుడు ఉన్నది ‘రాకా’ అమావాసా, అమవసా, దర్వః-సూర్యేందు సంగమః=అమావాస్య చంద్రుడు కనబడినది, సినివాలీ, చంద్రకళ లేనిది, కుహూః, సంవర్త, ప్రళయ, కల్ప, క్షయ, కల్పాంత=ప్రళయము.
కలుష, వృజిన, ఏనస్, అఘ, అంహస్, దురిత, దుష్కృత=పాపము, ధర్మ (పుం న) పుణ్య, శ్రేయస్, సుకృత, వృష=పుణ్యము, ముత్, ప్రీతి, ప్రమద, హర్ష, ప్రమోద, ఆమోద, సంమద, ఆనందధు, ఆనంద, శర్మ, శాత, సుఖ=ఆనందము. స్వ శ్రేయసం, శివం, భద్రం, కల్యాణం, మంగళం, భావుకం, భవికం, భవికం, భవ్యం, కుశలం, క్షేమం, (పుం. న.)=క్షేమము. దైవం, దిష్టం, భాగధేయం, భాగ్యం, నియతిః, విధిః=దైవము, క్షేత్రజ్ఞః, ఆత్మా, పురుషః=జీవుడు, ప్రధానం, ప్రకృతిః=ప్రకృతి, హేతుః (పుం) కారణం, బీజం, హేతువు, నిదానం=ఆదికారణము. చిత చేతస్, హృదయ, స్వాంత, హృత్, మానస, మనస్=మనస్సు, బుద్ధిః, మనీషా, ధిషణా, ధీః, ప్రజ్ఞా శేముషీ, మతః, ప్రేక్షా, ఉపలబ్ధి, చిత్, సంవిత్, ప్రతిపత్, జ్ఞప్తి, చేతనా=బుద్ధి. ధారణా శక్తిగల బుద్ధి మేధ. మానసిక కర్మ సంకల్పము. సంఖ్యా, విచారణా, చర్చా=విచారణ. విచికిత్సా, సంశయః=సంశయము. అధ్యాహారః, తర్కః, ఊహః=ఊహ. నిర్ణయ, నిశ్చయ=నిర్ణయము. మిధ్యా=దృష్టి, నాస్తికతా=నాస్తికత్వము. భ్రాంతిః, మిథ్యా మతిః, భ్రమ. అంగీకార, అభ్యుపగమ, ప్రతిశ్రమ, సమాధి=అంగీకారము. జ్ఞానం=మోక్ష బుద్ధి. విజ్ఞానం, శిల్ప శాస్త్ర జ్ఞానము. ముక్తి, కైవల్య, నిర్వాణ, శ్రేయస్, నిశ్రేయస్, అమృత, మోక్ష, అపవర్గ=మోక్షము. అజ్ఞానం, అవిద్యా, అహంమతిః=అజ్ఞానము.
విమర్ధమువలన కలిగిన సువాసన పరిమళము. అది జన మనోహరముగా ఉండును. ఎక్కువ ఆనందము కల్గించునది ఆమోదము. ఘ్రాణమునకు తృప్తి నిచ్చునది, సురభి, శుక్ల, శుభ్ర, శుచి, శ్వేత, విశద, స్యేత, పాండర, అవదాత, సిత, గౌర, వలక్ష, ధవళ, అర్జున, హరిణ, పాండుర, పాండు=తెలుపు, తెల్లని, ధూసరః=కొంచెము తెల్లగా ఉన్నది కృష్ణ, నీల, అసిత, శ్యామ, కాల, శ్యామల, మేచక=నలుపు నల్లని, పీత, గౌర, హరిద్రాభ=పసుపు పచ్చని, పాలాశ, హరిత, హరిత్=ఆకుపచ్చని, రోహిత, లోహిత, రక్త, శోణ, కోకనదచ్ఛవి=ఎరుపు, ఎర్రని, అరుణః=అంతగా ఎర్రని కానిది, పాటలః=తెలుపు ఎరుపు రంగులు కలది. శ్యావ కపిశః=కపిశ వర్ణము కలది. ధూమ్ర-దూమల-కృష్ణ లోహితము, కడారః కపిల-పింగః-కద్రుః-పిశంగః-పింగళ=పింగళ వర్ణము కలది. చిత, కిర్మీర, కల్మాష, శబల, ఏత, కర్బుర=చిత్ర వర్ణము కలది. వ్యాహారః, ఉక్తిః లపితం=సంభాషణము. అపభ్రంశః అప శబ్దము. తిఙ్గన్త సుబంతముల సముదాయము లేదా కారకాన్వితమగు క్రియవాక్యము. ఇతిహాస, పురావృత్త పురాణ, పంచ లక్షణ=పురాణము. సత్యమైన కథ కలది ఆఖ్యాయికా, కల్పిత ప్రబంధము కథా, సమహార, సంగ్రహః=సముదాయము. ప్రవల్హికా, ప్రహేళికా=ఈ రెండును సమానార్థకములు. సమస్యా, సమాసార్థ=ఈ రెండును సమానార్థకములు, స్మృతిః, ధర్మ సంహితా=ధర్మ శాస్త్రము, అఖ్యా, ఆహ్వా, అభిధాన=పేరు. హూతి, ఆకారణా, ఆహ్వాన=పిలుచుట. ఉపన్యాసః, వాఙ్ముఖము=వాక్ప్రారంభము, వివాదః, వ్యవహారః=వివాదము. ప్రతివాక్య, ఉత్తర ఈ రెండును సమానార్థకములు. ఉపోద్ఘాతః, ఉదాహారః=సమానార్థకములు. అభిశాపః=అనగా మిథ్యాభిశంసనము యశః=కీర్తిః, పర్యాయములు. ప్రశ్నః, పృచ్ఛా, అనుయోగకః =పర్యాయములు.
ఆమ్రేడితం=రెండు మూడుసార్లు చెప్పినది. కుత్సా, నిందా, గర్హణ=నింద. ఆలాపః=మాటలాడుట. ప్రలాప=అనర్ధ వచనము. అనులాపః=మాటిమాటికి చెప్పుట. విలాపః=ఏడ్పు, విప్రలాపః=విరోధ వచనము. సంలాపః పరస్పర భాషణము. సుప్రతాప=మంచిమాట. అపలాపః=కప్పిపుచ్చుట. రుషతీ=అమంగళవాక్కు సంగతం=హృదయంగమమైనది. స్వాంత్వం=మిక్కిలి మధురమైనది. అబద్ధం=అర్థములేని మాట. నిష్ఠుర, అశ్లీల, పరుష=గ్రామ్యము. సూనృతం=ప్రియవాక్కు. సత్యం, తథ్యం, ఋతం=సత్యమైన మాట. నాద, నిస్వాన, నిస్వన, ఆరవ, ఆరావ, సంరావ, విరావ=ధ్వని, మర్మరః=వస్త్ర పర్ణాదుల ధ్వని, సింజితం=అలంకారమైన ధ్వని, నిక్వణః, క్వాణః=వీణాధ్వని, ఋతం=తిర్యగ్జంతువుల కూత, కోలాహలః, కలకలః=పర్యాయ పదములు. గీతం, గానం, పర్యాః, ప్రతిశృత్=(స్త్రీ) ప్రతిధ్వని. నిషాదకః=తంతీ కంఠ ధ్వని, కాకలీ=సూక్ష్మము. మధురము అయిన ధ్వని. కలః=మధురము అస్ఫుటమైన ధ్వని. మంద్ర=గంభీరము. తారః=అత్యుచ్య ధ్వని. ఈ మూడు పదములు మూడు లింగములలో ఉండును. ఏకతాలః=పాటతో కలిసిన లయ. వీణా, పల్లకీ, విపంచీ, పర్యా, పరివాదినీ=ఏడు తీగల వీణ. తతం=వీణాది వాద్యము. ఆనద్ధం=మురజాది వాద్యము. సుషిరం=వంశాది వాద్యము. ఘనం-కాంశ్య తాలాది వాద్యము. ఈనాలుగు విధములైన వాద్యములకు వాదిత్రం, ఆతోద్యం అని పేరు. మృదంగాః=మురజాః=పర్యా. అంత్య, ఆలింగ్య, అర్ధక=ఈ మూడును మురజ భేదములు. యశః, పటహః, ఢక్కా=పర్యా. ఆనక, దుందుభి=భేరి; అనకః, పటహః=పర్యా. ఝర్ఝరీ, డిండి మాదులు పటహ భేదములు. మర్దలః=పణవః=పర్యా, సంగీత క్రియా మానమునకు తాలకము అని పేరు. లయః, సామ్యం=పర్యా, తాండవం, నాట్యం, లాస్యం, నర్తనం=పర్యా, నృత్య, గీత, వాద్యములు, మూడింటికిని తౌర్యత్తికం నాట్యము అని పేరు. భట్టారకః, దేవః=రాజు. దేవీ=రాజ్యాభిషేకము పొందిన రాణి. శృంగార, వీర, కరుణ, అద్భుత, హాస్య, భయానక, బీభత్స, రౌద్రములు, రసములు, శృంగారః=శుచిః, ఉజ్జలః=పర్యా. కృత్స్నః, వర్ధనః, వీరః=పర్యా. కారుణ్య, కరుణా, ఘృణా, కృపా, దయా, అనుకంపా, అనుక్రోశ, పర్యాహసః, హాసః, హాస్యం=పర్యా. బీభత్సం, వికృతం=పర్యా. విస్మయ, అద్భుత, ఆశ్చర్య, చిత్ర=పర్యా, భైరవ, దారుణ, భీషణ, భీష్మ, ఘోర, భీమ, భయానక, ప్రతిభయ=సమానార్థకములు. రౌద్ర, ఉగ్ర=పర్యా. పైన చెప్పిన పదునాలుగు పదములు మూడు లింగములలోను ఉండును. దర, త్రాస, భీతి, భీ, సాధ్వస, భయ=పర్యా, మానసిక వికారమునకు భావమని పేరు. భావమును బోధించునది అను భావము.
గర్వ, అభిమాన, అహంకార=పర్యా, చిత్తమునకు ఉన్నతి మానము. అనాదర, పరిభవ, పరీభవ, తిరస్క్రియ=పర్యా. వ్రీడా, లజ్జా, త్రపా, హ్రీః=పర్యా. ధనమునందు ఆసక్తి అభిధ్యానము; కౌతూహల, కౌతుక, కుతుక, కుతూహల=పర్యా. విలాస, బిబ్బోక, విభ్రమ, లలిత, హేలా, లీలా, అనునవి శృంగార భావము వలన కలిగిన స్త్రీ చేష్టలు. వీటికి హావములు అని పేరు. ద్రవ, కేళి, పరీహాస, క్రీడా, లీలా, కూర్దన=ఇవి క్రీడ పరిహాస వాచకములు. ఇతరులను పరిహసించుట అచ్ఛురితకము. స్మితం=చిరునవ్వు. అధోభువన, పాతాళ=పర్యా. ఛిద్ర, స్వభ్ర, వపా, శుషి=ఛిద్రము. గర్త, అవట, భూపిమైన గొయ్యి. తమిశ్రం, తిమిరం, తమః=పర్యా. సర్ప, పృదాకు, భుజగ, దందశూక, బిలేశయ, సర్పము. విషం, క్ష్వేడః, గరళం=విషము. నిరయః, దుర్గతిః=నరకము. పయస్, కీలాల, అమృత, ఉదక, భువన, వన, జలము. భంగ, తరంగ, ఊర్మి, కల్లోల, ఉల్లోల=తరంగములు. పృషత్, బిందు=జల బిందువులు. కూల, రోధస్, తీరమ్=ఒడ్డు నీటి నుండి బయట పడినది పులినము. జంబాల, పంక, కర్దమ=బురద. పరీవాహాః=పొరలుచున్న నీరు. కుపక, విదారక, జలాశయములలో నిలిచియున్న నీరు. ఆతరః నది దాటించుటకు ఇచ్చు ధనము. ద్రోణీ, కర్రతో చేసినతొట్టె, కలుషః=ఆవిలః కలుషమైనది. అచ్ఛ, ప్రచన్నః=స్వచ్ఛమైనది. గభీరకం, అగాధం=లోతైనది. దాశః, కైవర్తః=పల్లెవాడు. శంబూకాః=నత్త గుల్లలు. సౌగంధిక, కహ్లాం=శ్వేతకమలము. ఇందీవరం-నీలకమలము. ఉత్పలం, కువలయం=కలువ. కుముద, కౌరవ=తెల్లకలువ, వీటి కందనమునకు శాలూకము అనిపేరు. పద్మం, తామరసం, కంజం=పద్మము. కువలయం, నీలోత్పలం=పర్యా. కోక నదం=ఎర్రకలువ, కరహాటః, శిఫా, కందం=పద్మలత యొక్క దుంప. కింజల్కః, కేసరః=పర్యా. ఖనిః, ఆకరః=పర్యా. పాదాః=దగ్గరనున్న చిన్న పర్వతములు. ఉపత్యకా=పర్వతమునకు దగ్గర ఉన్న భూమి. అధిత్యకా=పర్వతముపై ఉన్న భూమి. స్వర్గ పాతాళ వర్గాదులు చెప్పబడినవి. నానార్థకములను వినుము. (360)
