అగ్ని మహా పురాణము

Table of Contents

సప్తమీవ్రతాని

అగ్ని దేవుడు చెప్పెను:

అందరికిని భుక్తి ముక్తి ప్రదమగు సప్తమీ వ్రతమును చెప్పెదను. మాఘశుక్ల సప్తమీ తిథియందు కమలమును నిర్మించి దానిపై సూర్యుని పూజించినవాడు శోకరహితుడగును. భాద్రపద శుక్ల సప్తమియందు సూర్యుని పూజించినచో సకల అభీష్ట వస్తువులు లభించును. పౌష శుక్ల సప్తమియందు ఉపవాసముచేసి సూర్యుని ఆరాధించినచో సకల పాపములును నశించును. మాఘ కృష్ణ సప్తమినాడు ‘సర్వాప్తి సప్తమీ వ్రతము చేసినచో అభీష్ట-వస్తువులు లభించును. ఫాల్గుణ కృష్ణ పక్షమునందు సప్తమీ వ్రతమును చేయవలెను. మార్గశీర్ష శుక్ల పక్షమున పుత్రీయ సప్తమీ వ్రతము ఒక సంవత్సరము పాటు చేయు స్త్రీలకు పుత్రులు కలుగుదురు. (182)