అగ్ని మహా పురాణము

Table of Contents

ఏకతత్త్వదీక్షా విధి

పరమేశ్వరుడు చెప్పెను: ఇపుడు చిన్నది అగుటచే ఏకతాత్విక దీక్షను గూర్చి చెప్పుచున్నాను. సమయానుగుణముగా, యథోచితరీతిని స్వీయ మంత్రముతో సూత్ర బంధాదికము చేయవలెను, పిమ్మట కాలము, అగ్ని మొదలు శివపర్యంతమైన సమస్తతత్త్వముల చింతనము చేయవలెను. సూత్రములో మణులు గ్రుచ్చబడియున్నట్లు అన్ని తత్త్వములును శివతత్త్వములో గ్రుచ్చబడియున్నవి. శివతత్త్వాద్యావాహనము చేసి, వెనుకటివలె గర్భాధానాది సంస్కారములు చేయవలెను. కాని సర్వశుల్క సమర్పణమును మాత్రము మూల మంత్రముతో చేయవలెను. పిమ్మట తత్త్వ సమూహ గర్భితమైన పూర్ణాహుతి ఈయవలెను. ఆ ఒక్క ఆహుతిచేతనే శిష్యుడు నిర్వాణము పొందగలుగును. శివుని యందు నియోజనము, స్థిరత్వా పాదనము చేయుటకును రెండవ పూర్ణాహుతి కూడ చేయవలెను. పిమ్మట శివ కలశ జలముతో శిష్యునకు స్నానము చేయించవలెను. (89)