అగ్ని మహా పురాణము

Table of Contents

త్విభక్తి సిద్ధ రూపములు, నిరూపణము

కుమారస్వామి చెప్పెను:

తిఙ్ విభక్తినిగూర్చియు ఆదేశములనుగూర్చియు సంక్షిప్తముగా చెప్పెదను. తిఙ్ ప్రత్యయములు భావ, కర్మ, కర్త్రర్థములందు వచ్చును. సకర్మక అకర్మ ధాతువులకు కర్త్రర్థమున ఆత్మనేపద పరస్మైపద రెండింటియందు తిఙ్ ప్రత్యయములు వచ్చును. సకర్మ ధాతువులకు కర్మ కర్తర్ణము లందువచ్చును. వర్తమానము నలట్ విధ్యాద్యర్థములందు లిఙ్ విధ్యాద్యర్థములందును ఆశీస్సునందును లోట్, అనద్యతన భూతమున తిఙ్ భూతమున లుఙ్, పరోక్ష భూతమున లిట్, అద్యతన భవిష్యత్తున లుట్, ఆశీరర్థమున లిఙ్, శేష భవిష్యదర్థమున లృట్, లిఙ్ నిమిత్త క్రియాది పత్తియందు లృఙ్డ్ వచ్చును. తఞ్ శానచ్ కానచ్లకు ఆత్మనే పదమని పేరు. మొదటి తొమ్మిది పరస్మై పది ప్రత్యయములు, తిప్, తస్, అంతి ప్రథమ పురుష. సిప్, ధస్, థ మధ్యమ పురుష, మిప్, వస్, మస్ ఉత్తమ పురుష; తా, ఆతాయ్, అన్త ఇవి ఆత్మనే పద ప్రథమ పురుష ప్రత్యయము థాస్, ఆధాం ధ్వమ్ మధ్యమ పురుష ప్రత్యయములు. ఇవహి, మహి ఉత్తమ పురుష ప్రత్యయములు. భూవాదులకు ధాతువులు అని పేరు, భూ, థ్ మొదలు ‘కృ’ వరకును మూలోక్తములగు ధాతువులు శబ్దాది వికంగణములు ప్రత్యయములు చేర్చినపుడు క్రియా బోధకములు. క్రీడ్, వృఙ్గ్, గృహ్, చుర్, పా, నీ, అర్చి. ఈ ధాతువులను (ప్రధానములు). భూ ధాతువునకు క్రమముగా తిఙ్గ్ ప్రత్యయములు చేర్చుటచే సః భవతి, తౌ భవతః, తేభవసి, త్వంభవసి, యువాం భవథః, యూయం భవథః, అహంభవామి, ఆవాంభవామః, వయం భవామః. ఇత్యాది రూపములు అగును. ఇట్లే ఏధ ధాతువునకు మూలమునందు లట్ రూపములు ఇవ్వబడినవి. పచతి మొదలగునవి వెనుకటి రూపములవలె ఏర్పడును. భావార్థమున ‘యక్’ చేర్చగా ‘భూయతే’ కర్మార్థమున ‘యక్’ చేర్చగా అసౌ అనుభూయతే, ‘సన్’ చేర్చగా బూభూషతి, ‘ణిచ్’ చేర్చగా ఈశ్వరం భావయతి. ‘యఙ్గ్’ చేర్చగా బోభూయతే యఙ్గ్ లుక్ నందు భోభూతి ఇత్యాది రూపములగును. పుత్రీయతి, పుత్రకామ్యతి, పటపటాయతే, ఘటయతి ఇత్యాది రూపములగును. సన్‌ణిచ్ ప్రత్యయములు రెండును చేర్చగ భుభూష యతి ఇత్యాదులగును. లిఙ్గ్ నందు భవేత్ ఇత్యాది రూపములగును. ఏధ ధాతువునకు ఏధేత ఇత్యాది రూపములగును. లోట్ యందు భవతు ఇత్యాది రూపములు, ఏధతామ్ ఇత్యాది రూపము అగును. ఈ విధముగనే కొన్ని ధాతువులకు కొన్ని ‘ల’ కారములందు మూలమున సిద్ధ రూపములు చూపబడినవి. (358)