అగ్ని మహా పురాణము

Table of Contents

తద్ధితము,నిరూపణము

స్కందుడు చెప్పెను:

ఇపుడు త్రివిధ తద్ధితను చెప్పెదను. సామాన్య తద్ధిత వృత్తి ఈ విధముగా ఉండును. ‘లచ్’ ప్రత్యయము చేర్చగా ‘హంసలః’, ‘వత్సలః’ మొదలగునవి సిద్ధించును. ‘ఇలచ్’ ఫేనిలం ‘శ’- లోమశః ‘న’-పామనః, ‘ఇలచ్’-పిచ్ఛిలమ్. ‘అణ్’-పాజ్ఞః, ఆర్చకః, దంత శబ్దమునకు ఉరచ్ దంతురః, ‘ర’-మధురమ్, సుషిరమ్. ‘వ’ కేశవః, ‘య’- హిరణ్యమ్. ‘వ’-మాలవః, ‘వలచ్’ రజస్వలా. ‘ఞణి’-ధనీ, ఘరీ, హస్తీ, ‘టికన్’-ధనికమ్. ‘విన్’-పయస్వీ, మాయావీ. ‘యుచ్’- ఊర్ణాయుః. ‘మిన్’-వాగ్మీ. ‘ఆలచ్’-వాచాలః, ‘ఆటచ్’-వాచాటః. ‘ఇనచ్’-ఫలినః, బర్హిణః. ‘కన్’ -వృందాకరకః ‘ఆలుచ్’- శీతం నసహతే శీతాలుః, హిమంనసహతే హిమాలుః, వాత శబ్దమునకు ‘ఉలచ్’-వాతులః, అపత్యార్థమున ‘ఆణ్’-వాషష్ఠ కౌరవః. ఇది వాని నివాసము అను అర్థమున అణ్, పాంచాలః, మాథురః, తెలుసుకొనుచున్నాడు. చదువుచున్నాడు అను అర్థమున అణ్. చాంద్రకః ‘వున్’, క్రమకః, క్రోశకః, ప్రియంగూనాం భవం క్షేత్రమ్ ఇత్యాద్యర్థము నందు ‘ఖయ్’-హైయ్యంగ వీనకమ్, మౌద్గీనమ్, కౌద్రవిణమ్. అపత్యార్థమున అణ్. వైదేహః, ఇయ్-దాక్షిః, దాశరథిః. ‘ఫక్’-నాడాయనః. ‘ఫయ్’-ఆశ్వాయనః. ‘యయ్’-గార్గ్యః, వాత్స్యః ‘ఢక్’-వైనతేయః. హేరక్-చాటకేరః. ‘ఢ్రక్’ (ఐరక్) గౌధేరకః. ‘ఆరక్’-గౌధారః. ‘ఘ’-క్షత్రియః. ‘ఖ’-కులీనః, ఞ-కౌరన్యర్. ‘యత్’-మూర్థన్య ముఖ్య మొదలగునవి. సుగంధి అనురూపము ‘ఇ’ వచ్చుటచే ఏర్పడినది.

తారకాది శబ్దములకు ఇతచ్ ప్రత్యయము. తారకతమ్ మొదలగునవి. ‘అనఙ్’-కుండోధ్నీ పుష్పధన్వా, సుధన్వా, చుంచుప్-విత్తచుంచుః, చణ్-కేశ చణః రూపప్-పటరూపకమ్. ఈయస్-పఠీయాన్, తరప్-అక్షతరః, వచతితరాం, తమప్-అతితమాం, మృద్వీతమాం కల్పప్-ఇంద్ర కల్పః, అర్కకల్పః. ‘దేశీయ’-రాజ దేశీయః. ‘దేశ్య’-రాజదేశ్యః. ‘జాతీయ’-పటుజాతీయః. ‘మాత్రచ్’ జానుమాత్రమ్, ద్వయసచ్-ఊరు ద్వయసమ్. దగ్నచ్-ఊరుదగ్నమ్. ‘టయప్’-పంచతయః, టక్-దౌవారికః. ఇంతవరకు తద్ధిత సామాన్య వృత్తి చెప్పబడినది. ఇపుడు అవ్యయ తద్ధిత వృత్తి చెప్పబడుచున్నది. ‘యస్మాత్’ అను అర్థమున ‘తసిల్’ చేర్చగ, ‘యతః’ అని అగును. ‘త్రల్’-‘యత్ర తత్ర అస్మిన్కాలే’ అను అర్థమున ‘అధునా’ ‘ఇదానీం’ అను రూపములు ఏర్పడును. ‘దా’ అను చేర్చగా సర్వస్మిన్ అను అర్థమున సర్వదా అను రూపము ఏర్పడును. తస్మిన్కాలే అను అర్థమున రిహిల్-తర్హి అస్మిన్‌కాలే=ఇహ, కస్మిన్‌కాలే=కర్హి, థాల్-యథా. థం-కథమ్ పూర్వస్యాం దిశి అను అర్థము ‘అస్తాతి’ ప్రత్యయము. ఉదాహరణము పురస్తాత్. తుల్యే-అహని=సద్యః పూర్వాబ్దే=పరుత్, పూర్వతరాబ్దే=పరారి, అస్మిన్ సంవత్సరే=ఐషమః పరస్మిన్నహని అను అర్థమున వర శబ్దమున ఏద్యవి ప్రత్యయము చేర్చగ పరేద్యవి అగును. అస్మిన్నహని అను అర్థమున ‘ద్య’ చేర్చగా అద్య అగును. ‘ద్యుస్’ చేర్చగా పూర్వేద్యుః అగును. దక్షిణస్యాం దిశియను అర్థమున దక్షిణా, దక్షిణాహి అను రూపములు అగును. ఉత్తరస్యాందిశి అను అర్థమున ఉత్తరా, ఉత్తరాత్ అని అగును. ఉపరి అనుదానికి ఇష్టాతి చేర్చగా ఉపరిష్టాత్ అగును. ఉత్తర శబ్దమునకు ఏనచ్ ఉత్తరేణ, ఆచ్-దక్షిణా, ఆహి-దక్షిణాహి, ధా-ద్విధా, ధ్యముయ్-ఐకథ్యమ్, ధముయ్-ద్వైధం, త్రైధం, ఆచ్-ద్విధా, త్రిధా మొదలగునవి. ఇంతవరకు నిపాత తద్ధితలు చెప్పబడినవి. ఇపుడు భావ వాచకములు చెప్పబడుచున్నవి. ‘పటోర్భావః’ అను అర్థమున త్వ, తత్ చేర్చగా పటుత్వము, పటుతా పృథుశబ్దమునకు ఇమనిచ్, ప్రథిమా, సుఖ శబ్దమునకు ప్యయ్=సౌఖ్యమ్, స్తేన శబ్దమునకు యత్=స్తైన్యం, సఖి, సఖ్యమ్. కపేర్భావః కాపేయమ్. యక్-పథ్యమ్. అణ్-ఆశ్వమ్ కౌమారకమ్ యౌవనము. కన్-ఆచార్యకమ్ ఇట్లే ఇతర తద్ధితలను కూడ గ్రహించవలెను. (356)