అగ్ని మహా పురాణము

Table of Contents

షష్ఠీవ్రతాని

అగ్ని దేవుడు చెప్పెను:

ఇప్పుడు షష్ఠీ వ్రతములను గూర్చి చెప్పెదను. కార్తిక కృష్ణ షష్ఠియందు ఫలములు భుజించి కార్తికేయునకు అర్ఘ్య దానము చేయవలెను. దీనివలన మనుష్యుడు భుక్తి ముక్తులను పొందును. దీనికి స్కందషష్ఠీ వ్రతమని పేరు. భాద్రపద కృష్ణ షష్ఠి యందు అక్షయ షష్ఠీ వ్రతము చేయవలెను. ఇది మార్గ శీర్షమునందు గూడ చేయవలెను. ఈ అక్షయ షష్ఠీ దివసమున ఏ ఒక సంవత్సరము నందైనను ఉపవాసముండువాడు భుక్తి ముక్తులను పొందును. (181)