అగ్ని మహా పురాణము

Table of Contents

విషహృన్మంత్రౌషధము

అగ్నిదేవుడు పలికెను: ‘ఓం నమోభగవతే రుద్రాయ’ మొదలు ‘పరశుపాణయే’ వరకును వున్న మూలోక్త మంత్రము ‘నమో భగవతే పక్షి రుద్రాయ’ మొదలు ‘విషం ఠఠ  వరకును ఉన్న మూలోక్త మంత్రము చేతను సర్పదష్టుని అభిమంత్రించినచో వాని విషము తొలగిపోవును. ‘ఓం నమో భగవతే రుద్ర’ మొదలు ‘ద్రౌం హ్రీం-ఠః’ వరకును ఉన్న మూలోక్త మంత్రమును జపించి మంత్ర సిద్ధిపొందినవాడు నిత్యము సర్పములను బంధించ గలడు. ఒకటి రెండు మూడు, నాలుగు బీజములు కలదియు కృష్ణ చక్రముచే అంగ పంచకముగల గోపీజన వల్లభాయ స్వాహాయను మంత్రమును సర్వార్థసాధకము. ‘ఓం నమో భగవతే రుద్రాయ’ మొదలు ‘జ్ఞాపయతి ఠఠ’ వరకును వున్న మూలోక్త మంత్రమునకు పాతాళ క్షోభ మంత్రమని పేరు. ఈ మంత్రముతో అభిమంత్రించినచో విషము తొలగి పోవును. సర్పము కాటు వేసినపుడు మండుచున్న కాష్టముతో గాని, కాలుతున్న శిలతోకాని, అగ్నిజ్వాలతోగాని, కోకనదముతోగాని కరచిన స్థానమున కాల్చినచో విషము ఉపశమించును. శిరీష వృక్ష బీజములు పుష్పములు, అర్క క్షీరము బీజము, కటుత్రయము వీటిని త్రాగించినను పైన పూసినను కాటుక పెట్టినను విషము నశించును. శిరీష పుష్పరసముతో భావనచేసిన తెల్లని మరిచము పానవశ్య, అంజనాది రూపమున ఇచ్చినచో విషమును నశింపచేయును. సందేహము లేదు. కోశాతకీ వచా హింగు శిరీష, అర్కక్షర-త్రికటు మోషాం భస్సులను నశ్యాది రూపమున ఇచ్చినచో విషము నశించును. రామఠ ఇక్ష్వాకు సర్వాంగముల చూర్ణము నశ్యముగా ఇచ్చినచో విషమును తొలగించును. ఇంద్రబల, అగ్నికము ద్రోణము తులచి దేవిక సహ, వీటిరసములో త్రికటు చూర్ణము కలిపి తిన్నచో విషము నశించును. కృష్ణ పంచమినాడు తీసుకుని వచ్చిన శరీష పంచాంగము విషనాశకము. (297)