అగ్ని మహా పురాణము

Table of Contents

కృదంత నిరూపణము

 కుమారస్వామి చెప్పెను:

కృత్ప్రత్యయములు భావకర్మ కర్త్రర్థము లందు మూడింటి యందును వచ్చును. అచ్ ల్యుట్, క్తిన్, భావఘయ్, యచ్, అ, తవ్య, ఆదులు కృత్ప్రత్యయములు, అచ్ ప్రత్యయము చేర్చగా వినయః, ఉత్కరః, ప్రకరః, దేవః, భద్రః, శ్రీకరః మొదలగు రూపములు సిద్ధించును. ల్యుట్-శోభనమ్, క్తిన్-వృద్ధికి, స్తుతిః, మతిః, ఘయ్-భావః, యుచ్-కారణా భావనా మొదలగునవి. అ-చికిత్సా, తవ్య-కర్తవ్యమ్, ఉదాహరణము, అనీయ-కరణీయ కమ్, యత్-దేయం ధ్యేయమ్, ణ్యత్-కార్యమ్. ఇవన్నియు కృత్య ప్రత్యయములు; క్తాదులు, కర్త్రర్థము నందు కొన్నిచోట్ల భావ, కర్మార్థము లందును చేర్చబడును. ఉదాహరణ - గ్రామః గతః, గ్రామం గతః త్వయాగురు ఆశ్లిష్ట మొదలగునవి. శతృ-భవన్, శానచ్-ఏధమానః, భవన్ స్త్రీ లింగములో భవన్తీ అగును. అన్ని ధాతువుల కంటెను నువుల్, తృచ్, ప్రత్యయములు వచ్చును. (ఉదా: భావనః, భవితా మొదలగునవి క్విప్-స్వయంభూః, ల్యుట్ కు భూతార్థమున క్వసు, కానచ్ ప్రత్యయములు చేర్చగ బభూవివాన్, పేచివాన్ పేచానః, శ్రద్ధదానకః ఇత్యాది రూపములగును. అణ్ చేర్చగా-కుంభకారః మొదలగునవి సిద్ధించును. ఉణాదులు భూతార్థములందు కూడ వచ్చును. ఉదా: కారః, పాయుః, వాయుః ఇత్యాదులు ఛందయందు ఇవి బహుళముగా వచ్చును. (359)