అగ్ని మహా పురాణము

Table of Contents

నానామంత్ర నిరూపణము

అగ్నిదేవుడు పలికెను: ముందు ‘హుం’ వుంచి పిదప ‘భేచ, ఛే’ చేర్చి పిదప ‘క్షః స్త్రీం హూంక్షే’ వ్రాసి, చివర ‘ఫట్’ చేర్చవలెను. ఇది విషసర్పాదులను తొలగించును. అన్ని కార్యములను సిద్ధింప చేయును. ‘ఖేచ, ఛే అనునది కాలదష్టునకు, జీవనము ఇచ్చు మంత్రము. ‘ఓం, హూం, ఖేక్షః’ ఈ మంత్రము విషమును శత్రువులను నశింప చేయును.’ స్త్రీం హుం ఫట్’ ఈ మంత్రము ప్రయోగము పాప రోగాదులను తొలగించును. ‘ఖేఛ’ యను ప్రయోగము విఘ్నములను దుష్టులను శమింప చేయును. ‘హూం స్త్రీం ఓం’ అను మంత్రము స్త్రీ మొదలగు వారిని వశము చేయును. ఖేస్త్రీం, ఖే అనునది వశమును విజయమును కలిగించును. ‘ఐం హ్రీంమొదలు హ్రీం ఐంశ్రాం’ అను కుబ్జికా విద్య సర్వార్థ సాధకము. ఇప్పుడు శివుడు స్కందునకు ఉపదేశించిన మంత్రములను వర్ణించెదను. (316)