అగ్ని మహా పురాణము
క్షత్ర, విట్ శూద్రవర్గ వర్ణన
అగ్నిదేవుడు పలికెను:
మూర్ధాభిషిక్త, రాజన్య, బాహుజ, క్షత్రియ, విరాట్=క్షత్రియుడు. అధీశ్వరః=సామంతరాజు లందరును వంగి నమస్కరించు రాజు. చక్రవర్తి=సార్వభౌమః=సకల భూ మండలమునందు అధికారము కలవాడు. చిన్నచిన్న మండలములు పాలించువారు మండలేశ్వరులు. మంత్రీ, ధీసచివః, అమాత్యః=పర్యా. మహామంతః=ప్రధానుడైన మంత్రి. ప్రాడ్వివాకః, అక్షదర్శకః=వ్యవహారమును పరిశీలించువాడు; భౌరికః=సువర్ణాధ్యక్షుడు. అధ్యక్షః, అధికృతః=అధికార. అంతర్వంశికః=అంతః పురాధికారి. సౌవిదల్ల, కంచుకిన్, స్థాపద్య, సౌవిద=అంతఃపుర రక్షకులు. షండః, వర్షవరః=అంతఃపుర భృత్యులు. సేవకః, అర్థీ, అనుజీవీ=పర్యా. తన దేశమునకు సరిహద్దున ఉన్న రాజు శత్రువు; వాని రాజ్యమునకు అవతలనున్నవాడు మిత్రుడు. వానికి అవతల వున్నవాడు ఉదాసీనుడు. వెనుకనున్న వాడు పార్ష్ణి గ్రాహుడు. చరః సృశః, ప్రణిధిః=గూఢచారి. ఆయతిః=భవిష్యత్కాలము, తదాత్వం=తత్కాలము. ఉదర్కః=భవిష్యత్ఫలము. అగ్ని జలాదుల వలన కలుగు భయము. అదృష్ట భయము. స్వపర రాజ్యముల నుండి కలిగినది దృష్ట భయము; భద్ర కుంభః, పూర్ణకుంభః=పర్యా. భృంగారః, కనకాలుకా=పర్యా. ప్రభిన్నః, గర్జితః, మత్తః=మదించిన ఏనుగు; వమథు=ఏనుగు తొండము నుండి వచ్చు జల బిందువులు; శ్రుణిః, అంకుశః=పర్యాయ పదములు. పరిస్తోమః, కుథ=ఏనుగుపై పరచిన ఆస్తరణము. కర్ణీరథః, ప్రవహణమ్=స్త్రీలు ప్రయాణించు రథము. దోలా, ప్రేంకా, ఐయల, ఆధోరణ, హస్తిపక, హస్త్యారోహ, నిషాదిన్=ఏనుగు నెక్కువారు. (మావటీడు); భట, యోధ, యోధృ=పర్యా, కంచుకః, వారణః=కవచము, శీర్షణ్యమ్, శిరస్త్రమ్=పర్యా. తనుత్రమ్, వర్మ, దంశ నమ్=కవచము. ఆముక్తః, ప్రతిముక్తః, పినద్ధః, అపినద్ధః=ధరించిన కవచము. వ్యూహః=వల విన్యాసము. చక్రమ్, అనీకమ్=సైన్యము. ఒక ఏనుగు, ఒక రథము, మూడు గుర్రములు. ఐదుగురు కాలిబంట్లు వున్నది ‘పత్తి’. పత్తిలోని అంగములను ఏడు పర్యాయములు మూడేసి రెట్లు చేసినచో వరుసగా సేనాముఖ, గుల్మ గణ, వాహినీ, పృతనా, చమూ, అనీకినీ అను సేనా విభాగములు ఏర్పడును. గజములు మొదలగు సకలాంగములతో కూడిన పది అనీకుల సేనకు అక్షౌహినీ అనిపేరు; ధనుః, కోదండః, ఇశ్వాసః=ధనుస్సు. కోటి, అటనీ=ధనుస్సు యొక్క రెండు అగ్ర భాగములు. లస్తకః=ధనుర్మధ్యము. మౌర్వీ, జ్యా, సింజినీ, గుణః=నారి. పృషత్క బాణ విశిఖ, అజిహ్మగ, ఖగ, అశుగ, ఇవి పర్యాయపదములు.
తూన, ఉపాసంగ, తూణీర, నిషంగ, ఇషుధి=అంబుల పొది; అసి, ఋష్టి, నిస్త్రింశ, కరవాల, కృపాణ=ఖడ్గము. త్సరుః=ఖడ్గముపిడి. ఈలీ, కరపారికా=చేతులను రక్షించుకొను సాధనము. కుఠారః, స్వదితిః=గొడ్డలి, ఛురికా, అసిపుత్రికా=చిన్న కత్తి ప్రాసః, కుంతః=పర్యా. సర్వలా, తోమరః=పర్యా. వైతాలికాః, బోధకరాః=ప్రాతః కాలమున మేల్కొలుపు వారు. మాగధాః, వందినః=సోత్రపాఠకులు. సంశప్తకాః=శపథముచేసి యుద్ధము నుండి తిరిగిరానివారు. పతాకా, వైజయంతీ=చిన్నజండా, కేతనమ్, ధ్వజమ్=పెద్ద జండా. అహంపూర్వికా=నేనుముందు, నేను ముందు అని చెప్పుట. అహమహమిక=నేను నేను సమర్థుడనను అహంకారము. శక్తి, పరాక్రమ, ప్రాణ, శౌర్య, స్థాన, సహస్, బల=(స్థామ) పర్యా. మూర్ఛా, కష్మలం, మోహః=పర్యా. అవనుర్దః=పీడించుట. అభ్యవ స్కందనః, అభ్యాసాదనమ్=శత్రువును ఆక్రమించుట. విజయః, జయః=పర్యా. నిర్మాసవనమ్, సంజ్ఞపనం, మారణం, ప్రతిఘాతనం=చంపుట. దిష్టాంత, ప్రళయ, పంచతా, కాలధర్మ, అత్యయ=మరణము; విశ్, భూమి స్పృశ్, వైశ్య=పర్యా. వృత్తిః, వర్తనం, జీవనం, జీవిక, కృషి=మొదలగునవి వృత్తులు, కుసీదం=వడ్డీపై జీవించుట ఉద్ధారః=అర్థప్రయోగః=వడ్డీకి ధనమిచ్చుట. కణిషం=సస్యముల వెన్ను; కింశారు=సస్యముల ముల్లు. స్తంబః=గుత్సః భజుకరీ=వరి. కడంగరః, బుసం=పర్యా. మాషము మొదలగునది శమీధాన్యమనియు, యవాదులు శూకధాన్యమనియు, నీవారములు తృణ ధాన్యమనియు చెప్పబడును. శూర్పం, పస్ఫోటనం చాటు. స్యూతః, ప్రసేవః=త్రాడు (అల్లినది); కండోలః, పిటః=బుట్ట, కటః, కిలింజకః చాప, రసవతీ, పాకస్థానం, మహానసం=వంటఇల్లు. పౌరోగవః=పాక గృహాధ్యక్షుడు. సూపకారాః, వల్లవాః, అరాలికాః, ఆంధసికాః, సూదాః, ఔదనికాః, గుణాః=వంట చేయువారు. అంబరీషం, బ్రాష్టః=మంగలము. కర్కరీ, ఆలుః, గలంతికా=కత్తిపీట. ఆలింజరః, మణికం పెద్ద ఘటము, శుషవీ=నల్ల జీలకర్ర, ఆరనాలః, కుల్మాషం=గంజి. వాహ్లికం, హింగువ, రామఠం=హింగు (ఇంగువ). నిశా, హరిద్రా, పీతా=పసుపు, మత్స్యండి, ఫాణితం, ఖండము. కూర్చికా, క్షీరముతో తయారుచేసిన పదార్థము. స్నిగ్ధం, మస్రుణం, చిక్కడం=చిక్కగా నున్నది. పృథుకః, చిపిటకః=అటుకులు, ధానాః=వేయించిన యవలు, జేమనం, లేపః, ఆహారః=పర్యా. మాహేయీ, సౌరభీ, గౌః=ఆవు, యుగ్య, పాసంగ్య, శాకట=కాడిమోయు ఎద్దులు, భష్కయిణీ=చాల కాలము క్రితము ఈనిన ఆవు. ధేనుః=క్రొత్తగా ఈనిన ఆవు. సంధినీ=వృషభముతో కలసిన ఆవు. నేహత్=గర్భము పోయిన ఆవు.
పణ్యాజీవః, ఆపణికః=వ్యాపారము చేయువాడు. న్యాసః, ఉపనిధీ=దాచుటకు ఇచ్చిన వస్తువు. విపణః, విక్రయః=అమ్ముట. ‘దశ’వరకును. సంఖ్యావాచకములు సంఖ్యేయమును చెప్పును. త్రిలింగములలో ఉండును. వింశతి వరకు అన్ని సంఖ్యా వాచకములు సంఖ్యేయ సంఖ్యార్థములలో నిత్య ఏకవచనాంతములో ఉండును. సంఖ్యార్థము నంది ఇవి ద్వివచన, బహువచనములందు కూడ ఉండును. ‘సవతి’ వరకు=ఇవి స్త్రీలింగములు, ‘పంక్తి మొదలు ‘శత’ ‘సహస్ర’ ఆదికము క్రమముగా పదేసి రెట్లుండును. తులా, అంగులి, ప్రస్థములతో చేయబడు మానము మూడు విధములు. ఐదు గుంజలు ఒక మాషము. పదహారు మాషములు ఒక అక్షము లేదా కర్షము, నాల్గు కర్షములు ఒక పలము. ఒక అక్షము బంగారమునకు సువర్ణము. బిస్తము అని పేరు. ఒక పలము సువర్ణము కురుబిస్తము, నూరు పలములు ఒక తుల, ఇరవై తులలు ఒక భారము. వెండి రూపాయకు కార్షా పణము కార్షికము అని పేరు. రాగి పైసకు పణము అని పేరు. ద్రవ్య, విత్త, స్వాప, తేయ, రిక్థ, రుక్థ, ధన, వసు=ధనము; రీతిః, ఆరకూటః=ఇత్తడి; తామ్రకమ్, శుల్బమ్, ఔదుంబరం=రాగి. తీక్ష్ణం, కాలాయసం, అయః=ఇనుము. క్షారః, కాచః=గాజు, చపలః, రసః, సూతః, పారదః=పాదరసము. గరళం=మహిష శృంగము, త్రపు, సీసకం, పిచ్చటం=సీసము. హిండీరః, అబ్ధి, కఫః, ఫేనః=సముద్రము మీదనున్న నురుగు; మధూచ్చిష్టం, సిక్థకం=మైనము, రంగః, వంగః=పర్యా, పిచుః, స్థూలః దూది. కులటి, మనశ్శిలా=మణి శీల. యవక్షారః=పాక్యః, పర్యా; త్వక్షీరా, వంశలోచనా=పర్యాయములు.
వృషల, జఘన్య, శూద్ర=శూద్రులు. చండాల=అంత్యజాదులు వర్ణ సంకరములు. కారుః=శిల్పి; శ్రేణిః=ఒక సంఘముగా కలిసియున్న సజాతీయులగు శిల్పుల సంఘము. రంగా జీవః, చిత్రకరః=పర్యా. త్వష్టా, తక్షా, వర్ధకిః=వడ్రంగి; నాడింధమః, స్వర్ణకారః=కంసాలి బంగారు పనిచేయువాడు. నాపితః, అంతావసాయి=మంగలి. జాబాలః, ఆజాజీవః=గొల్ల; దేవలః=దేవ పూజపై జీవించువాడు. తన భార్యలతో నాటకము వేసి జీవించువారు జాయా జీవులని శైలూషలులని చెప్పబడుదురు. భృతకః, భృతిభుక్ రోజు కూలి. వివర్ణ, పామర, నీచ, ప్రాకృత, పృథర్జన, విహీన, అపసద, జాల్మ, నీచులు; భృతః, దాసేరః, చేటకః=భృత్యుడు. పటుః, పేశలః, దక్షః=నేర్పరి, మృగయుః, లుబ్ధకః=వేటగాడు, చాండాలః, దివాకీర్తిః=చండాలుడు. పుస్తం=లేపనాది కర్మ; పాంచాలికా, పుత్రికా=బొమ్మ, వర్కరః పడుచుదైన పశువు. మంజూష, పేటకః, పేటా, పెట్టె. తుల్య, సాధారణ=పర్యా. ప్రతిమా-ప్రతికృతిః=పర్యా. ఈ విధముగ బ్రహ్మాది వర్గములు చెప్ప బడినవి. (366)
