అగ్ని మహా పురాణము

Table of Contents

ముగింపు

అనేక ప్రత్యేక విశేషాలు ఇందులో ఉన్నాయి గనుకనే – “ఆగ్నేయం పఠితం ధ్యాతం శుభం స్యాద్భుక్తి ముక్తిదమ్” ఈ పురాణం చదివినా, స్మరించినా భుక్తి-ముక్తులు చేకూరుతాయి అని తెలుపుతున్నది.

మొత్తం మీద అగ్నిపురాణం భారతీయ సాహిత్యంలోనే చాలా ప్రత్యేకతగల గ్రంథం. అనేక ప్రామాణిక ప్రాచీన గ్రంథాల సారభూతమైన పురాణం.

ఈ విధంగా, భారతీయ సాహిత్యం, సంస్కృతులకు సంబంధించిన అన్ని విషయాల సంక్షిప్త సమాహారం ఈ అగ్నిపురాణంలో కనిపిస్తుంది. దీనిని అధ్యయనం చేయటంచేత ప్రాచీన భారతీయ విజ్ఞాన సమ్యక్ పరిచయం ఏర్పడుతుంది. అందుకే దీనిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా వర్ణిస్తున్నారు. కాబట్టే ‘ఆగ్నేయేహి పురాణేస్మిన్ సర్వా విద్యాః ప్రదర్శితాః’ అని తనను గురించి పురాణం పలుకుతున్నది. పురాణ లక్షణాలైన విషయాలతో బాటు హిందూ సాహిత్య, సంస్కృతుల సర్వ విజ్ఞాన సారమును దీనిలో మనం దర్శించవచ్చును.

సంస్కృత అగ్నిపురాణాన్ని శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టువారు తెలుగు లిపిలో ప్రతిశ్లోక తాత్పర్యంతో 1989లో రెండు సంపుటాలుగా ముద్రించారు. దీనికి విఖ్యాత పండిత పరిశోధకులు, సంస్కృత విద్వాంసులు శ్రీ పుల్లెల రామచంద్రుడు గారు ప్రతిశ్లోక తాత్పర్యాన్ని, ప్రత్యేక విషయ శోభిత ఉపోద్ఘాతాన్ని కూర్చారు. ఆ గ్రంథాన్ని రచనలో వాడుకొనడం జరిగింది. శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతీ ట్రస్టు వారికి, శ్రీ పుల్లెల రామచంద్రుడు గారికి నమస్కారములు అర్పిస్తున్నాము. ఈ వచన పురాణం తెలుగువారి అభిమానం పొందాలని ఆకాంక్ష.

                                                - ఆవంచ సత్యనారాయణ


 

ఓం గణేశాయ నమః

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ అగ్ని మహాపురాణం