అగ్ని మహా పురాణము

Table of Contents

సుదర్శనచక్రాది ప్రతిష్ఠా కథనము

హయగ్రీవుడు చెప్పెను: గరుడ, సుదర్శన, బ్రహ్మ, నృసింహమూర్తుల ప్రతిష్ఠ కూడ, వారివారి మంత్రములతో, విష్ణుమూర్తిని స్థాపించిన విధముననే స్థాపింపవలెను. ఆ విధానమును వినుము. “ఓం సుదర్శన... సుదర్శన మహాచక్ర శాన్త దుష్ట భయంకర ఛిన్దిఛిన్ది విదారయవిదాయ,పరమన్త్రాన్ గ్రససగ్రస భక్షయభక్షయ భూతాన్ త్రాసయ త్రాసయహం ఫట్ సుదర్శఆయనమః, సుదర్శనాయ నమః” అను మంత్రముతో చక్రపూజ చేసిన వీరుడు యుద్ధమునందు శత్రువులను చీల్చివేయగలడు. “ఓం క్షౌం నరసింహ ఉగ్రరూప జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల స్వాహా” అనునది నరసింహ మంత్రము. ఇపుడు నీకు పాతాళ నృసింహ మంత్రము ఉపదేశించుచున్నాను.