అగ్ని మహా పురాణము

Table of Contents

మనుష్యవర్గము - నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

మనుష్య, బ్రహ్మ, క్షత్ర, వైశ్య, శూద్ర వర్గములను క్రమముగ చెప్పెదను. నృ, నర, పంచజన, మర్త్య=నరులు. యోషిత్, యోషా, అబలా, వధూః=స్త్రీ. ప్రియుని కోరుచు సంకేత స్థానమునకు వెళ్ళునది అభిసారికా, కులటా-పుంశ్చలీ అసతీ=కులట. నగ్నికా, కోటరీ, నగ్న స్త్రీ; కాత్యాయనీ, సగము ముసలిది; సైరంద్రీ=పర గృహమున సేవ చేయునది. అసిక్నీ=ఇంకను ముసలితనము రానిది. మలినీ-రజస్వలా=పర్యా. వారస్త్రీ, గణికా, వేశ్యా=పర్యా. యాతా, తోటికోడలు. ననందా=భర్త సోదరీ; సపిండాః, సనాభయః=సిపిండులు. సమానోదర్య, సోదర్య, సగర్భ్య, సహజ=పర్యా. సగోత్ర, బాంధవ, జ్ఞాతి, బంధు, స్వజన=పర్యా. దంపతీ, జంపతీ, భార్యాపతీ, జాయాపతీ=పర్యా. గర్భాశయ, జరాయు, ఉల్బ, కలల=పర్యా. గర్త, భ్రూణ=పర్యా. క్లీబః, షండః, నపుంసకః=పర్యా, డింభః, నవజాత శిశువు, బాలకః, మాణవకః=పర్యా. పిచండిలః=పెద్దపొట్ట కలవాడు. అభ్రటః=వంగిన ముక్కు కలవాడు. పౌగండః=వికలాంగుడు; ఆరోగ్యమ్, అనామయమ్, పర్యా. ఏడః, బధిరః=చెవిటివాడు. కుబ్జః, గడులః=గూనివాడు. ఖుణిః=వంకర చేతులవాడు. క్షయః, శోషః, యక్ష్మా=క్షయ రోగము. ప్రతిశ్యాయః, పీనసః=జలుబు, క్షుత్, క్షుతం, క్షవః=తుమ్ము, కాసః, క్షవథుః=దగ్గు, శోధః, స్వయధుః, శోభః=వాపు. పాదస్ఫోటః-విపాదికా, కాళ్ళపగులు. కిలాసః సిద్మః=పర్యా. పామ, కచ్ఛూః, పామా విచర్చికా=గజ్జి, కోఠ, మండలకమ్, కుష్టమ్, పర్యా, దుర్నామకః=అర్షస్=మూలశంక, ఆనాహః, నిబంధః మలమూత్ర నిరోధము. గ్రహణీ, రుక్ర్ప వాహికా=గ్రహణి రోగము. బీజ, వీర్య, ఇంద్రియ, శుక్ర=వీర్యము. పలల, క్రవ్య, ఆమిష=మాంసము. వృక్కా, అగ్రమాంసమ్, హృదయ మాంసము హృదయమ్, హృత్=పర్యా. మేదస్, వసా, వసా=కొవ్వు, మన్యా=మెడవెనుకవున్న నాడి; ధమని, శిరా=పర్యా. తిలకమ్, క్లోమ=పర్యా. మస్తిష్కమ్=మెదడు. దూషికా=కంటిపుసి. అంత్రమ్, పురీతత్, ప్రేగు. గుల్మః, ప్లీహా=పర్యా. వస్నసా, స్నాయుః=పర్యా. కాలఖండః, యకృత్=పర్యా. కర్పరః, కపాలః=పర్యా. కేకసమ్, కుల్యం, అస్థి=పర్యా. కంకాలః=అస్థిపంజరము. కశేరుకమ్=వెన్నెముక. కరోటిః=పుర్రె. పరుశుకా=ప్రక్క ఎముకలు. అంగ, ప్రతీక, అవయవ, శరీర, వర్ష్మ, విగ్రహ=పర్యా. కట, శ్రోణి ఫలక=పర్యా. కటి, శ్రోణి, కకుద్మతీ=పర్యా. నితంబః=స్త్రీ కటి యొక్క పశ్చాద్భాగము, జఘనమ్=పురోభాగము. కూపకౌ=నితంబము నందున్న గుంటలు. కకుందరే=కూపకములు; కటి, ప్రోథ, స్ఫిచ=పర్యా. ఉపస్థః, చెప్పనున్న పురుష స్త్రీ లింగములకు పేరు. భగమ్, యోనిః=పర్యా. శిశ్నః, మేఢ్రం, మోహనః, శేషః=పర్యా. పిచిండః, కుక్షిః, జఠరమ్, ఉదరమ్, తుందః=పర్యా. కుచ, స్తన=పర్యా. చూచుకం=కూచాగ్రము; క్రోడం, భుజముల మధ్యభాగము. స్కంధః, భుజ శిరః, హంసః=భుజము. జతృ=భుజముల సంధి, పునర్భవ, కరరుహ, నఖ, నఖర=పర్యా. చెయ్యి చాపగ అంగుష్ఠ మొదలు తర్జని చివరవరకు వున్న భాగము ప్రాదేశమని పేరు. అంగుష్ఠము నుండి కనిష్ఠిక చివరి వరకు వున్నది వితస్తి (జాన). ఇది పండ్రెండు అంగుళములు ఉండును. అన్ని వ్రేళ్ళను చాపిన చెయ్యికి చపేట-ప్రతల ప్రహస్త అని పేరు. పిడికిలి బిగించినచో దానికి ‘రత్ని’యని పేరు. రత్ని నుండి కనిష్టీ వరకు వున్న భాగమునకు ‘అరత్ని’ యని పేరు. శంఖాకారముగల కంఠమునకు కంబుగ్రీవా-త్రిరేఖా అని పేరు. అవటుః, గాటా, కృతాటికా=కంఠ రంధ్రమునకు పేరు. పెదవుల క్రింది భాగమునకు చిబుకము అని పేరు. గండః, గలః, హనుః=గండ స్థలము పేరు. అపాంగః, నేత్రాంతము. కటాక్షః=నేత్రాంతముతో చూచుట; చికురః, కుంతలః, బాలః, కేశము (జుట్టు) ప్రతికర్మ, ప్రసాధనమ్=అలంకరించుకొనుట. ఆకల్పః, వేషః, నేపథ్యమ్, నాటకాదులలో వేషము ధరించుట. చూడామణిః, శిరోరత్నము; తలః=హార మధ్యమందలి మాణిక్యము. కర్ణికా, తాళపత్రమ్=కర్ణ భూషణము. లంబనమ్, లలంతికా=క్రిందికి వ్రేలాడు హారము. మంజీరః, సూపురమ్=అందెలు, కింకిణీ చిన్నఘంట. దైర్ఘ్యమ్, ఆయా మః, అనాహః=వస్త్రాదుల పొడవు, పరిణాహః, విశాలతా=వైశాల్యము; పటచ్చరమ్=జీర్ణ వస్త్రము; సంవ్యానమ్, ఉత్తరీయమ్=పర్యా. రచనా, పరిస్పందః=పుష్పాది రచన ఆభోగః=ఉపచారాదుల పరిపూర్ణత్వము. సముద్గకః, సంపుటకః చిన్నపెట్టె. ప్రతి గ్రాహః పతద్గ్రహః=ఉమ్మివేయు పాత్ర. (364)