అగ్ని మహా పురాణము

Table of Contents

అగ్నిపురాణంలో ప్రక్షిప్తాలుగా భావించబడుతున్న భాగాలు

అ) అగ్నిపురాణంలో మొదటి నుంచి తీర్థాలు, అంత్యక్రియలు వివిధ

ఉన్న స్మృతి విషయాలను తెలిపే                    దేవతల ఆరాధన, వర్ణాశ్రమ

అధ్యాయాలు (ప్రాచీన మూలాల                    ఆచారాలు, సాధారణ

నుంచి ప్రక్షిప్తం చేసిన భాగాలు                      ఆచారాలు, ప్రాయశ్చిత్తాలు, క్రీ.శ. 9వ శతాబ్దంలో

తప్ప)                                                               అశౌచము గ్రహసంబంధబలులు,

పాపాలు తపస్తుతి, నరకాలు,

దానాలు రాజులు చేయవలసిన

కర్మకాండ మొదలైనవి.

ఆ) ప్రక్షిప్తభాగాలు                   ఆరాధన, స్నానవిధి, అగ్నికార్యము

21-106 అధ్యాయాలు           ముద్రలతో అర్చనము, దేవాలయ                 పైన చెప్పిన

263-272 అధ్యాయాలు      నిర్మాణము, విగ్రహ ప్రతిష్ఠలు.            అధ్యాయాలకు

317-326 అధ్యాయాలు        ఆవాహన విధానాలు,                         తరువాత

ఇంకా కొన్ని అధ్యాయాలు     పుస్తకదానాలు, వాస్తు                        కాలంలో చేర్చబడి

ఉన్నా గుర్తించటానికి             ఇతరములు                                        ఉండాలి.

వీలు కాకుండా ఉన్నాయి.

(హిందూ ఆచార, కర్మకాండల పురాణ ఆధారాలు-ఆర్.సి. హజ్రా గ్రంథము)

దీనివలన అగ్ని పురాణం ఏడవ శతాబ్దం తరువాత వచ్చిన గ్రంథమనీ అలంకార శాస్త్రానికి సంబంధించిన భాగం నిశ్చితంగా క్రీ.శ. 900 తరువాతనే కూర్చబడిందనీ, బహుశా ఇది క్రీ.శ. 1050 తరువాతదయి ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది.

మరొక ప్రధానమైన విషయం ఏమనగా-ప్రాచీన అలంకారికులలో ఒక్కడు కూడా అగ్ని పురాణం నుండి శ్లోకాలు ఉదాహరించలేదు. మమ్మటుడు విష్ణుపురాణం నుంచి శ్లోకాలు ఉదాహ రించాడు కాని అగ్నిపురాణం నుంచి ఉదాహరించలేదు. అగ్నిపురాణం అలంకార శాస్త్ర విషయాలలో ప్రామాణికం అని చెప్పిన మొట్ట మొదటి అలంకారికుడు క్రీ.శ. పధ్నాల్గవ శతాబ్దానికి చెందిన విశ్వనాథుడు. ధ్వన్యాలోకంలోను, లోచనంలోను భరతుని నాట్యశాస్త్రమే పరమప్రామాణిక గ్రంథంగా పేర్కొనబడింది. భామహుడు, దండీ కూడ దీనిని పరమ ప్రమాణంగా గ్రహించారు. అందుచేత అగ్నిపురాణం భరత, భామహ, దండి, ఆనంద వర్ధనుల తరువాత వచ్చిన గ్రంథమే కాని అంతకు పూర్వం ఉన్నది కాదు. బహుశా ఇది భోజునికంటె కూడ అర్వాచీనమైనది. ఈ విధంగా దీనిని అలంకార శాస్త్రానికి మూలగ్రంథంగా పరిగణించవలసిన పనిలేదు. కేవలం పురాణాలన్నీ వేదవ్యాస రచితాలే అనే విశ్వాసంగల మధ్యయుగానికి చెందిన రచయితలు మాత్రం పురాణం అనే పేరు పెట్టడంతో ఇది అలంకారశాస్త్రానికి సంబంధించిన అతి ప్రాచీన గ్రంథమని విశ్వసించారు.