అగ్ని మహా పురాణము

Table of Contents

కుమార వ్యాకరణ శాస్త్రము

స్కందుడు చెప్పెను:

కాత్యాయనా! బాలకుల జ్ఞానము కొరకై వ్యాకరణ సారమగు సిద్ధ శబ్ద స్వరూపము చెప్పెదను. శాస్త్ర వ్యవహారములకు ఉపయుక్తములగు ప్రత్యాహారాది సంజ్ఞలు చెప్పెదను. ‘ఆ, ఇ, ఉణ్’ మొదలు, ‘హల్’ వరకు మూలోక్తము ప్రత్యాహారము. ఉపదేశమునందు అంత్యమగు హల్లు, అను నాసికమగు అచ్చు ఇత్సంజ్ఞకములు. అంతిమ ఇత్సంజ్ఞక వర్ణముతో కలిపి చెప్పబడిన ఆది వర్ణము తనకును మధ్యనున్న వర్ణములకును గ్రాహకము. వీటికి ప్రత్యాహారములని పేరు. ‘అణ్’ మొదలు ‘శల్’ వరకు మూలోక్తములగునవి ప్రత్యాహారములు. అణ్, ఇణ్, యణ్ వీటిలో పరనకారముతో ప్రత్యాహారము. (349)