అగ్ని మహా పురాణము
- పురాణ పరిచయం
- శ్రీ అగ్ని మహాపురాణ విశేషాలు
- అగ్నిపురాణ ప్రాముఖ్యత
- అగ్నిపురాణంలో ఏం చెప్పబడింది
- అగ్ని పురాణ శ్లోక సంఖ్య
- ఇంకొక అగ్ని పురాణం
- అగ్నిపురాణం-వక్తృశ్రోతృ పరంపర
- అగ్నిపురాణం-వర్గీకరణ
- అగ్నిపురాణ రచనా కాలము – స్థలము
- అగ్నిపురాణంలో ప్రక్షిప్తాలుగా భావించబడుతున్న భాగాలు
- అగ్నిపురాణం-అలంకార శాస్త్రం
- తెలుగులో అగ్నిపురాణాలు
- అగ్ని పురాణము-మహాత్మ్యము
- ముగింపు
- సూతునికి శౌనకాది మునుల ప్రశ్న
- మత్స్యావతార కథ
- కూర్మావతార కథ
- వరాహ, వామన, పరశురామావతార కథలు
- రామాయణ కథ- బాల కాండము
- అయోధ్యా కాండ
- అరణ్యకాండ
- కిష్కింధ కాండ
- సుందరకాండ
- యుద్ధ కాండము
- ఉత్తర కాండము
- శ్రీహరి వంశ వర్ణనము
- భారతాఖ్యానము
- కురు పాండవ యుద్ధము
- పాండవ చరిత వర్ణనము
- బుద్ధ, కల్కి అవతార కథనము
- జగత్ సృష్టి వర్ణనము
- స్వాయంభువ వంశ వర్ణనము
- కశ్యప వంశ వర్ణనము
- జగత్సర్గ వర్ణనము
- సామాన్య దేవపూజా విధానము
- స్నాన విధి
- ఆదిమూర్త్యాది పూజా విధి
- కుండ నిర్మాణ అగ్ని కార్యాది విధి
- వాసుదేవాది మంత్ర లక్షణము
- ముద్రా లక్షణము
- సర్వవిధి
- ఆచార్య అభిషేక విధానము
- సర్వతోభద్రమండల విధి
- మండల విధి
- కుశాపామార్జన విధానము
- సంస్కార కథనము.
- పవిత్రారోపణ శ్రీధర నిత్యపూజా విధానము
- అగ్నికార్య విధానము
- పవిత్రాదివాసన విధి
- విష్ణుపవిత్రారోపణ విధి
- సర్వదేవ పవిత్రారోపణ విధి
- దేవాలయ నిర్మాణ ఫలము
- భూపరిగ్రహ వర్ణనము
- అర్ఘ్యదాన శల్య కథనము
- శిలావిన్యాస విధి
- ప్రాసాద లక్షణము
- ప్రాసాద దేవతాస్థాపన భూతశాస్త్ర విధానము
- వాసుదేవాది ప్రతిమాలక్షణము
- పిండికాది లక్షణము
- శాలగ్రామ మూర్తి లక్షణము
- శాలగ్రామ పూజా కథనము
- చతుర్వింశతి మూర్తి స్తోత్రము
- మత్స్యాది ప్రతిమా లక్షణము
- దేవీప్రతిమా లక్షణము
- సూర్యాది ప్రతిమా లక్షణము
- చతుష్షష్టి యోగిన్యాది లక్షణము
- లింగాది లక్షణము
- లింగమానముల లక్షణము
- పిండికా లక్షణము
- దశ దికృతి యాగ కథనము
- కుమ్భాధివాస విధి
- స్నపనాది విధానం
- వాసుదేవ ప్రతిష్ణా విధి
- ద్వారప్రతిష్ఠా ధ్వజారోహణాది విధి
- లక్ష్మీ ప్రతిష్ఠా విధి
- సుదర్శనచక్రాది ప్రతిష్ఠా కథనము
- పాతాళ నృసింహ మంత్రం
- కూపాది ప్రతిష్ఠా విధానము
- సభా గృహ స్థాపనము
- సాధారణ ప్రతిష్ఠా విధానము
- జీర్ణోద్ధార విధి
- దేవయాత్రోత్సవ విధానము
- స్నపనోత్సవ విధానము
- వృక్షాది ప్రతిష్ఠా విధానము
- గణేశపూజావిధి
- స్నాన తర్పణాది విధి
- సూర్యపూజా విధానము
- శివ పూజా విధి
- శివపూజాంగ హోమ విధి
- చండపూజావిధి
- కపిలాపూజాది విధానము
- పవిత్రాధివాసనము
- పవిత్రారోహణ విధానము
- దమనకారోహణ విధానము
- సమయదీక్షా విధానము
- సంస్కార దీక్షా విధానము
- నిర్వాణ దీక్షా విధానము
- నిర్వాణ కళా శోధనము
- ప్రతిష్ఠాకళాశోధన విధానము
- విద్యాకళా శోధన విధానము
- శాంతి కళా శోధన విధానము
- నిర్వాణదీక్షావిధి
- ఏకతత్త్వదీక్షా విధి
- అభిషేకాది విధి
- నానా మంత్రాది కథనము
- వాస్తు ప్రతిష్ఠా విధి
- వాస్తు పూజా విధానము
- శిలావిన్యాస విధానము
- ప్రతిష్ఠాకాల సామాగ్ర్యాది విధి వర్ణన
- అధివాసన విధానము
- శివ ప్రతిష్టా విధానము
- గౌరీప్రతిష్ఠా విధానము
- సూర్య ప్రతిష్ఠా విధానము
- ద్వారప్రతిష్ఠా విధానము
- ప్రాసాద ప్రతిష్ఠా విధి విధానము
- ధ్వజారోపణాది విధానము
- జీర్ణోద్ధార విధానము
- ప్రాసాద లక్షణము
- నగరాది వాస్తు నిరూపణము
- నగరాదిక వాస్తు కథనము
- స్వాయంభువ సర్గ కథనము
- భువనకోశ నిరూపణము
- తీర్థమాహాత్మ్యము
- గంగా మాహాత్మ్యము
- ప్రయాగ మాహాత్మ్యము
- వారాణసీ మాహాత్మ్యము
- నర్మదాది మాహాత్మ్యము
- గయామాహాత్మ్యము
- గ్రయాయాత్రా విధి
- మహానదిలో సంధ్యోపాసన
- శ్రాద్ధకల్ప వర్ణనము
- భారతవర్ష వర్ణనము
- మహాద్వీపాది వర్ణన
- భువనకోశ వర్ణన
- జ్యోతిశ్శాస్త్ర సారము
- కాలగణనము
- యుద్ధజయార్ణవము-నానాయోములు
- యుద్ధ జయార్ణవ జ్యోతిశాస్త్ర సారము
- యుద్ధ జయార్ణవమున నానాచక్ర వర్ణన
- నక్షత్ర నిర్ణయము
- నానాబల వర్ణన
- కోటచక్రము
- అర్ఘకాండము
- మండల వర్ణనము
- ఘాత చక్రాదివర్ణన
- నానా బలవర్ణనము
- తైలోక్య విజయవిద్య
- సంగ్రామ విజయ విద్య
- నక్షత్రచక్రము
- మహామారీ విద్య
- షట్కర్మ నిరూపణము
- షష్ఠి సంవత్సర నిరూపణము
- పశ్యాదియోగవర్ణనము
- షట్త్రింశత్పదకమ్
- మంత్ర ఔషధులు
- కుబ్జికాపూజ
- కుబ్జికాపూజ
- మాలినీమంత్ర న్యాసము
- అష్టాష్టకము
- త్వరిత పూజాదికము
- సంగ్రామ విజయ పూజ
- లక్షహోమ, కోటి హోమములు
- మన్వంతర వర్ణనము
- వర్ణాశ్రమ ధర్మములు, ఇతర ధర్మములు
- గృహస్థ వృత్తి
- బ్రహ్మచర్యాశ్రమ వర్ణనము
- వివాహ విషయములు
- ఆచార వర్ణనము
- ద్రవ్యశుద్ధి
- శావాశౌచాదికము
- స్రావాది అశౌచమ్
- అసంస్కృత అశౌచమ్
- వానప్రస్థ ధర్మములు
- యతిధర్మ నిరూపణము
- ధర్మశాస్త్ర నిరూపణము
- శ్రాద్ధకల్ప వర్ణనము
- నవగ్రహహోమ నిరూపణము
- నానాధర్మ వర్ణనము
- వర్ణధర్మ వర్ణనము
- అయుత లక్ష కోటి హోమ విధానము
- మహాపాతకాది ప్రాయశ్చిత్తము – 1
- ప్రాయశ్చిత్తములు – 2
- ప్రాయశ్చిత్తములు-3
- ప్రాయశ్చిత్తములు-4
- స్తోత్ర ప్రాయశ్చిత్తము
- ప్రాయశ్చిత్తములు (అ)
- ప్రాయశ్చిత్తములు (ఆ)
- వ్రతపరిభాష
- ప్రతిపత్ వ్రతములు (పాడ్యమి వ్రతములు)
- విదియా వ్రతములు
- తృతీయాతిథి వ్రతములు
- చతుర్థీ వ్రతములు (చవితినాడు జరుపు వ్రతములు)
- పంచమీ వ్రతములు
- షష్ఠీవ్రతాని
- సప్తమీవ్రతాని
- అష్టమీ వ్రతములు-I
- అష్టమీ వ్రతములు -II
- నవమీ వ్రతములు
- దశమీ వ్రతములు
- ఏకాదశీ వ్రతములు
- ద్వాదశీ వ్రతములు
- శ్రవణ ద్వాదశీ వ్రతము
- అఖండ ద్వాదశీ వ్రతం.
- త్రయోదశీ వ్రతములు
- చతుర్దశీ వ్రతములు
- శివరాత్రి వ్రతం
- అశోకపూర్ణిమాది వ్రతములు
- ఒక వారవ్రతములు
- నక్షత్ర వ్రతములు
- ఒక రోజు వ్రతములు
- మాస వ్రతములు
- వివిధ వ్రతములు
- దీపదాన వ్రతం
- నవవ్యూహార్చనము
- పుష్పాధ్యాయ కథనము
- నరక స్వరూపము
- మాసోపవాస వ్రతము
- భీష్మపంచక వ్రతము
- అగస్త్యపూజ
- కౌముద వ్రతము
- వ్రతదాన సముచ్చయము
- దానపరిభాషా కథనము
- షోడశమహాదానాది వర్ణన
- నానాదాన వర్ణనము
- కామ్య - మేరుదాన వర్ణనము
- పృథ్వీదానములు
- మంత్ర మాహాత్మ్య కథనము
- సంధ్యా విధి వర్ణనము
- గాయత్రీ మంత్రార్థము - 1
- గాయత్రీ మంత్రార్థము-2
- రాజ్యాభిషేక విధానము
- అభిషేక మంత్రములు
- రాజ సహాయ సంపత్తి వర్ణనము
- అనుజీవి వృత్త కథనము
- దుర్గసంపత్తి
- రాజధర్మములు -1
- కామశాస్త్రము
- రాజధర్మములు-2
- సామాది ఉపాయ వర్ణనము
- దండప్రణయనముల
- యుద్ధయాత్ర
- స్వప్నాధ్యాయము-దుఃస్వప్న నివారణము
- శకున వర్ణనము-1
- శకునములు-2
- శకున వర్ణనము -3
- యాత్రా మండల చింతా కథనము
- షాడ్గుణ్య వర్ణనము
- రాజు యొక్క దినచర్యా కథనము
- రణదీక్షా వర్ణనము
- శ్రీ స్తోత్ర వర్ణనము
- రాముడు బోధించిన రాజనీతి - 1
- రాముడు బోధించిన రాజనీతి - 2
- షాడ్గుణ్య కథకము
- సామాది ఉపాయ కథనము
- రాజనీతి కథనము
- పురుషలక్షణ వర్ణనము
- స్త్రీ లక్షణ వర్ణనము
- చామరాది లక్షణ కథనము
- రత్న పరీక్షా కథనము
- వాస్తు లక్షణ కథనము
- పుష్పాది పూజాఫల కథనము
- ధనుర్వేద వర్ణనము -1
- ధనుర్వేద వర్ణనము -2
- ధనుర్వేద వర్ణనము -3
- ధనుర్వేద వర్ణనము-4
- వ్యవహార కథనము-1
- వ్యవహార కథనము-2
- వ్యవహార కాండమున దివ్యములు
- దాయవిభాగము
- సీమా వివాద నిర్ణయము
- వాక్పారుష్యాది ప్రకరణము
- వేద పారాయణ విధానము
- యజుర్విధాన కథనము
- సామవిధానము
- అథర్వవిధానము
- ఉత్పాత శాంతి విధానము - 1
- ఉత్పాత శాంతి విధానము - 2
- దిక్పాలాది స్నాన కథనము
- వినాయక స్నానము
- మహేశ్వర స్నానము - లక్ష కోటి హోమములు
- నీరాజన విధి
- ఛత్రాది మంత్రములు
- విష్ణు పంజర స్తోత్రము
- వేదశాఖా కీర్తనము
- దానాది మాహాత్మ్యము
- సూర్యవంశ వర్ణనము
- సోమ (చంద్ర) వంశ వర్ణనము
- యదువంశ వర్ణనము
- ద్వాదశ సంగ్రామములు
- రాజవంశ వర్ణనము
- పురువంశవర్ణనము
- సిద్ధౌషదాది కథనము
- సర్వరోగ రణ ఔషధములు
- రసాది లక్షణము
- వృక్షాయుర్వేద కథనము
- నానారోగములను హరించు ఔషధములు
- మంత్ర రూప ఔషధ కథనము
- మృతసంజీవన సిద్ధయోగము
- మృత్యుంజయ కల్పము
- గజ చికిత్స
- అథాశ్వవాహన సారము
- అశ్వలక్షణ చికిత్సాకథనము
- అశ్వ శాంతి కథనము
- గజశాంతి కథనము
- గవాయుర్వేద కథనము
- మంత్ర పరిభాష
- సర్పలక్షణ కథనము
- సర్పదష్ట చికిత్స
- పంచాంగ రుద్ర దష్ట చికిత్స
- విషహృన్మంత్రౌషధము
- గోనసాది చికిత్సా కథనము
- బాలగ్రహహర బాలతంత్రము
- గ్రహ మంత్రాదికములు-ఉపసంహరణ
- సూర్యార్చన కథనము
- నానావిధ మంత్రౌషధములు
- అంగాక్షరార్చనము - వాసుదేవాది పూజ
- పంచాక్షరాది పూజాదికము
- పంచ పంచాశద్విష్ణునామ కథనము
- నారసింహాది మంత్ర కథనము
- తైలోక్యమోహన మంత్ర కథనము
- లక్ష్మ్యాది పూజా కథనము
- త్వరితా పూజలు-ధ్యానాదిక విధులు
- త్వరితామూల మంత్ర వర్ణనము -1
- త్వరితా మూలమంత్రాది వర్ణనము-2
- త్వరితావిద్యా సిద్ధి
- వివిధ మంత్ర నిరూపణము
- త్వరితాజ్ఞాన నిరూపణము
- స్తంభనాది మంత్రములు నిరూపణము
- నానామంత్ర నిరూపణము
- సకలాది మంత్రోద్ధారణము
- గణపూజా నిరూపణము
- వాగీశ్వరీ పూజా విధానము
- మండలములు
- ఘోర అస్త్రాది శాంతికల్ప నిరూపణము
- పాశుపత శాంతి వర్ణనము
- షడంగాస్త్ర వర్ణనము
- రుద్రశాంతి వర్ణనము
- ఆగ్నేయ అంశకాది వర్ణనము
- గౌర్యాదిపూజా విధానము
- దేవాలయాది మాహాత్మ్యవర్ణనము
- ఛందస్సారము - 1
- ఛందస్సారము - 2
- ఛందస్సారము
- ఛందోజాతి నిరూపణము
- విషమ కథనము
- అర్ధసమ నిరూపణము
- సమవృత్త నిరూపణము
- ప్రస్తార నిరూపణము
- శిక్షా నిరూపణము
- కావ్యాది లక్షణ వర్ణనము
- నాటక లక్షణ నిరూపణము
- శృంగారాది రస నిరూపణము
- రీతి నిరూపణము
- నృత్యాది అంగకర్మ నిరూపణము
- అభినయాది నిరూపణము
- శబ్దాలంకారములు-నిరూపణము
- అర్థాలంకార వర్ణనము-1
- శబ్దార్థ అలంకారము -2
- కావ్యగుణ వివేక వర్ణనము
- కావ్యదోష వివేక వర్ణనము
- ఏకాక్షర కోశము - నిరూపణము
- కుమార వ్యాకరణ శాస్త్రము
- సంధి సిద్ధ నిరూపణము
- సుబ్విభక్తి సిద్ధరూప నిరూపణము
- స్త్రీలింగ శబ్ద సిద్ధ రూప నిరూపణము
- నపుంసక శబ్ద సిద్ధ రూప నిరూపణము
- కారకము, నిరూపణము
- సమాసములు - నిరూపణము
- తద్ధితము,నిరూపణము
- ఉణాది సిద్ధరూపము, నిరూపణము
- త్విభక్తి సిద్ధ రూపములు, నిరూపణము
- కృదంత నిరూపణము
- శబ్దకోశము స్వర్గాది వర్గ నిరూపణము
- అవ్యయవర్గము, నిరూపణము
- నానార్థ వర్గము - నిరూపణము
- భూమ్యాదివర్గము, నిరూపణము
- మనుష్యవర్గము - నిరూపణము
- బ్రహ్మవర్గ వర్ణన
- క్షత్ర, విట్ శూద్రవర్గ వర్ణన
- సామాన్య నామలింగములు, వర్ణములు
- నిత్యనైమిత్తిక ప్రాకృత ప్రళయములు
- ఆత్యంతిక ప్రళయ గర్భోత్పత్తి
- శరీరావయవములలో నాడీ ప్రమాణము
- నరక నిరూపణము
- యమ నియమములు
- ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు
- ధ్యాన నిరూపణము
- ధారణా యోగ నిరూపణ
- సమాధి
- బ్రహ్మ విజ్ఞానము, నిరూపణము-1
- బ్రహ్మ విజ్ఞానము, నిరూపణము-2
- బ్రహ్మవిజ్ఞానము నిరూపణము-3
- అద్వైత బ్రహ్మ విజ్ఞానము
- గీతాసారము
- యమగీత
- ఆగ్నేయ పురాణ మాహాత్మ్యము
గజ చికిత్స
పాలకాప్యుడు పలికెను:
ఓ లోమపాదా! నీకు గజ లక్షణములను, గజ చికిత్సను చెప్పెదను. దీర్ఘములైన తొండములుండి, దీర్ఘ శ్వాస తీసుకొను గజములు సహన శక్తి కలవి. ఇరువది లేదా పదునెనిమిది నఖములుండి శీత కాలమున మదమును స్రవించునవి ప్రశస్తములు. కుడి దంతము ఎత్తుగావున్నవి, మేఘమువంటి బృంహితము కలవి విశాలమైన కర్ణములు కలిపి, చర్మము పై సూక్ష్మ బిందువులు కలవియు అగు ఏనుగులను సంగ్రహించవలెను. పొట్టి లక్షణ హీనములగు వాటిని సంగ్రహించరాదు. పార్శ్వ గర్భముగల ఆడ ఏనుగులను మూఢోన్మత్త గజములను వుంచుకొనగూడదు. వర్ణము సత్వము, బలము, రూపము, కాంతి సంహననము, జవము అను ఏడు సల్లక్షణములుగల గజము యుద్ధమున శత్రువులను జయించును. శిబిరమునకు, సేనకును గొప్పశోభ నిచ్చునవియు గజములే. రాజులు ఏనుగుల వలననే విజయమును కోరుకొనుచుందురు.
ఏనుగుల, అన్ని విధముల జ్వరమునందును అనువాసనము చేయవలయును. ఘృత తైలాభ్యంగయుక్తమగు స్నానము వాత రోగ వినాశకము. స్కంద రోగమునకు కూడ పాలకమునందు వలె ఏనుగులకు చికిత్స చేయవలయును. పాండు రోగమున గోమూత్రమును హరిద్రను ఘృతమును ఇవ్వవలెను. మలబంధము నందు శరీరమునకు తైలముపూసి స్నానము చేయించుట మంచిది. ఏనుగుకు పంచలవణయుక్తమగు మదిరను త్రాగించవలెను. మూర్ఛరోగము వచ్చిన ఏనుగుకు వాయు విడంగ, త్రిఫలా, త్రికటు, సైంధవముల గ్రాసమును తినిపించి మధు యుక్తమగు జలము త్రాగించవలెను. శిరుశ్శూల రోగమునందు అభ్యంగము నశ్యము ప్రశస్తతములు. తైలయుక్త పుటకములతో పాద రోగములకు చికిత్స ప్రారంభించి, పిదప కల్కకషాయములతో శోధనము చేయించవలెను. కంపన రోగమున నున్న గజమునకు శికి తిత్తిరి, లావపక్షుల మాంసమును పిప్పటి మరిచములు కలిపి తినిపించవలెను. అతిసార రోగమునందు బాలబిల్వ లోధ్రధాతకీ, శర్కరలతో పిండితినిపించవలెను. తొండమునకు రోగము వచ్చినప్పుడు లవణ యుక్తమగు ఘృతమును నశ్యముగ ఇవ్వవలెను. ఉత్కర్ణక రోగమునందు మాగధి నాగరాజ జీరలతో చేసిన గంజి వారాహీ కందరసము ఇవ్వవలెను. దశమూల కులుత్థ ఆమ్లక కాకమాచిలతో చేసిన తైలమును మిర్చితో కలిపి ఉపయోగించినచోగల గ్రహరోగము నశించును. మూత్ర క్రుచ్చ రోగమునందు అష్ట లవణ యుక్తములగు సురను ఘృతమును త్రాగించవలెను. లేదా త్రాపుష బీజక్వాథమును ఇవ్వవలెను. చర్మ దోషమునందు నింబక్వాథముగాని, వృషక్వాథముగాని ఇవ్వవలెను. కోష్ఠక్రుములను తొలగించుటకు గోమూత్ర వాయు విడంగములు ప్రశస్తములు. గాయములు మాన్పించుటకు శృంగిబేరకణ ద్రాక్ష, శర్కరలతో కాచిన జలము ప్రశస్తము. మాంసరసము కూడ హితకరము. అరుచిరోగమున వ్యోషయుక్తమగు పెసల అన్నము మంచిది. త్రివృత్ వ్యోష అగ్ని, దంతి, ఆర్క, శ్యామ, క్షీర, గజ, పిప్పలులతో చేసిన స్నేహము గుల్మరోగములు పోగొట్టును. ఇట్లే గజ చికిత్సకుడు భేదన ద్రావణ అభ్యంగ స్నేహపాన అనువాసనములతో గూడ అన్ని విధములగు విద్రధి రోగము లను నశింపచేయవలెను.
గజమునకు కట రోగము నందు ముద్గ సూపముతో యష్టికమును కలిపి, బాల బిల్వములతో లేపము చేయవలయును. అన్ని విధముల శూలములను తొలగించుటకు దిన పూర్వ భాగమున పిడంగ, ఇంద్ర, యవ, హింగు వివిధ హరిద్రా పిండములను ఇవ్వవలెను. ఇది ఏనుగులకు ఉత్తమ భోజనము. ఇతర భక్ష్యములు అధమ భోజనము యవలు ఇక్షువు ఏనుగులకు బలమును పెంచును. శుష్కతృణము ధాతు ప్రకోపము కల్గించును. క్షీణించిన మదముగల గజమునకు పాలు త్రాగించుట అగ్నిదీప్తిని కలిగించు ద్రవ్యము. వండిన మాంసరసము లాభకరములు. వాయస, కుక్కుర కాక ఉలూక, హరులను క్షౌద్రముతో కలిపి పిండముచేసి, యుద్ధమునందు మహాపదయందును ఇవ్వవలెను. కటు, మత్స్య, విడంగ లవణ కోశాతకీ క్షీర, హరిద్రలతో ధూపము వేసినచో ఏనుగు జయప్రదమగును. పిప్పలి తండులములు బియ్యము తైలము మాధ్వీకము, తేనె వీటిని నేత్రమందు వేసినచో అవి దీపనీయములు. చటకాపురీషము, పారావత పురీషము, క్షీర వృక్షము, మద్యము వీటితో చేసిన అంజనము ఏనుగులకు ఇష్టమైనది. ఈ అంజనము నేత్రములకు పూసిన ఏనుగు యుద్ధము నందు శత్రువును మర్దించును. నీల కమలములు ముస్తతగరము వీటిని-తండు లోదకము నందు నూరి, ఏనుగుల నేత్రములకు పెట్టినచో పరమ శాంతి నిచ్చును. గోళ్ళు పెరిగినపుడు వాటిని ఖండించవలెను. ప్రతిమాసము తైలా భ్యంగనము చేయవలయును. ఏనుగులు శయనించు స్థానమున ఎండిన పేడ పరాగము ఉండవలెను. శరద్గ్రీష్మములందు వీటికి ఘృత సేకము చేయుట ఉపయోగ కరము. (287)
