అగ్ని మహా పురాణము

Table of Contents

రీతి నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

కావ్యశాస్త్ర జ్ఞాన నిమిత్తమై ఉపయోగించు రీతి పాంచాలీ, గౌడదేశీయ, వైదర్భీ, లాటజాయని నాలుగు విధములు. ఉపచారయుతమైనది హ్రస్వ సమాసములు కలది మృదువుగావున్నది పాంచాలీ. దీర్ఘసమాసములతో, అనవస్థిత సందర్భము కలది అధికోప చారయుక్తరహితమైనది గౌడి. ఉపచార రహితము మిక్కిలి కోమలముగాని కూర్పుకల సమాసవర్ణితమగు రీతి వైదర్భి. స్పుటసందర్భము కలది నాతి దీర్ఘ సమాసములు కలదియగు రీతిలాటి. చాలమంది విద్వాంసులు పరిత్యజించినను అధికోపచారయుక్తమగు ఈలాటి లభించుచున్నది. క్రియలలో వైషమ్యమును పొందని వాక్యరచనకు వృత్తియని పేరు. భారతీ, ఆరభటీ, కైశికీ, సాత్వతీ అని అది నాలుగు విధములు. వాక్ప్రధానమైనది, ఎక్కువ పురుషులను ఆశ్రయించినది. స్త్రీల చేతకూడ ప్రాకృతమునందు ఉపయోగింపబడినది అగు రీతి భరత రచితమగుటచే భారతీయని చెప్పబడును. దీనికి వీథి ప్రహసనము ఆముఖము నాటకాది ప్రరోచన అని, భారతికి నాలుగు అంగములు. ఉద్ఘాతుక, లపిత, అసత్ప్రలాప, నాక్ఛ్రేణీనాలికా, విషణవ్యవహార, త్రిగత, ఛల, అవస్కందీత, గండ, మృదవ ఉచితములు అని వీథికి పదమూడు అంగములు. పరిహాసయుక్తమగు తాపసాది వచనము ప్రహసనము. ఆరభటి యందు మాయ ఇంద్రజాలము యుద్ధము మొదలగునవి వుండును. సంక్షిప్తకారము, పాతము, వస్తూత్థాపనము యని ఆరభటి భేదములు. (340)