అగ్ని మహా పురాణము

Table of Contents

ఆచార్య అభిషేక విధానము

నారదుడు పలికెను:

శిష్యుడు ఆచార్యాభిషేకము ఎట్లు చేయవలెనో చెప్పెదను. దీనిచేత సాధకుడు సిద్ధిని పొందును. రోగి రోగవిముక్తుడగును. రాజు రాజ్యమును, స్త్రీ కుమారుని, పాపవినాశమును పొందును.

తూర్పున ప్రారంభించి మంచి రత్నములతో కూడిన మట్టి కుండలను మండప మధ్య భాగమున ఉంచవలెను. వాటిని సహస్రావర్తితములు లేదా శతావర్తితములు చేయవలెను. మండపము నందు తూర్పు-ఈశాన్య దిక్కులందు పీఠముపై విష్ణువును ఉంచి, సాధకునికిని, శిష్యునికిని సకలీకరణము చేయవలెను. పిమ్మట గీతాదిపూర్వకముగా ఆచార్యునకు పూజచేసి అభిషేకము చేయవలెను. యోగ పీఠాదులను సమర్పింపవలెను. “నీవు నరులను అనుగ్రహింపవలెను” అని ప్రార్థించవలెను. గురువు కూడ శిష్యునకు నియమములు అన్నియు బోధించవలెను. ఈ విధముగా గురురక్షణ పొందిన శిష్యుడు అన్ని లాభములను సంపాదింపగలడు. (28)