అగ్ని మహా పురాణము

Table of Contents

సుబ్విభక్తి సిద్ధరూప నిరూపణము

స్కందుడు చెప్పెను:

కాత్యాయనా! విభక్తి సిద్ధరూపములను చెప్పెదను. సప్పులు, తిఙులు అని విభక్తులు రెండు విధములు. సప్పులలో విభక్తులుండును. సుఔజస్, ప్రథమ, ఆంఔట్‌శస్’ ద్వితీయ, టాభ్యాం భిస్, తృతీయ, ఙే, భ్యాంభ్యస్ చతుర్థి, ఙసి, భ్యాం భ్యస్, చతుర్థి ఙసి, భ్యాం, భ్యస్ పంచమి, ఙస్, ఓస్, ఆమ్, షష్టి, ఙి, ఓ, స్, సుప్, సప్తమీ; అజంతములు హలన్తములు అని ప్రాతిపదికములు రెండు విధములు. అవి మరల, పుంలింగ, స్త్రీలింగ నపుంసక లింగములని మూడేసి విధములు. పుంలింగాది శబ్దములలో ప్రధానమైన వాటిని చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పబడని వాటికి వృక్షాది శబ్దములు నాయకములు; వీటిలో వృక్షః, సర్వః, పూర్వః, ప్రథమః, ద్వితీయః, తృతీయః, ఖడ్గపాః, వహ్నిః, సఖా, పతిః, అహర్పతిః, పటుః (పుంలిం) గ్రామణీః, ఇంద్రః, ఖలపూః, మిత్రభూః, స్వభూః, సుశ్రీః, సుధీః, పితా, భాత్రా, (పుంలిం) కర్తా, కోష్టా, నప్తా, సురా, రాః; గౌః, ద్యౌః, గౌః ఈ అజంత శబ్దము పుంలింగమునందు నాయక శబ్దములు సువాక్, త్వక్, మొదలు శ్వలిట్ వరకు వున్నవి హలంత శబ్దము. జాయా శబ్దము మొదలు అసౌవరకును వున్నవి స్త్రీలింగమున నాయక శబ్దములు. కుండమ్ మొదలు అదః వరకును ఉన్నవి (మూలోక్తములు) నపుంసకలింగ నాయక శబ్దములు. ఈ శబ్దములకు ప్రథమాది విభక్తి ప్రత్యయములు ప్రాతిపదికకు పరముగ వచ్చును. ధాతుప్రత్యయ భిన్నమైనది. ప్రాతిపదికము. ప్రాతిపదికకు స్వార్ధము లింగము బోధించుటకు ప్రథమ వచ్చును. సంబోధనము నందునుకూడ ప్రథమ వచ్చును. కర్మ కర్త ఉక్తము లైనపుడు కూడ ప్రథమ వచ్చును. కర్మ అనగా చేయబడునది. కర్మకు ద్వితీయ వచ్చును. దేనిచే చేయబడునో అది కరణము; చేయువాడు కర్త, తిఙ్ కృత్తద్ధితములచే అనుక్తమైనపుడు తృతీయవచ్చును. కర్తృకారకమునకు తృతీయవచ్చును. సంప్రదానమునకు చతుర్థి; ఎవనికి ఇవ్వవలెనని ఇచ్చయింతురో దానికి సంప్రదానము అని పేరు. దేనినుండి ఒకటి వేరగునో దేనినుండి ఒకటి గ్రహింపబడునో దేనివలన భయమో, దానికి అపాదానము అనిపేరు. అపాదానమునకు పంచమీ వచ్చును. స్వస్వా మ్యాది సంబంధమునందు షష్టి వచ్చును. ఆధారమునకు అధికరణమని పేరు. దానికి సప్తమి వచ్చును. ఒకవస్తువును బోధించునపుడు ఏకవచనము, రెండు వస్తువులను బోధించుటకు ద్వివచనము, అనేకమైన వస్తువులను బోధించుటకు బహువచనము వచ్చును. ఇపుడు సిద్ధ రూపములు చెప్పెదను. ‘వృక్షః, సూర్యః’ మొదలు కమలేషు వరకు ఆయా శబ్దముల కొన్ని సిద్ధ రూపములు ఇవ్వబడినవి. కామమహేశ మొదలగు శబ్దములుకూడ వృక్ష శబ్దమువలె రూపములు ఉండును. సర్వే, విశ్వే, సర్వస్మై, సర్వస్మాత్, సర్వేషామ్, ఇత్యాది ప్రథమాది బహువచనము తప్ప ఈ శబ్దముల రూపములు వృక్ష శబ్దముల రూపములవలె ఉండును. ఉభయ, కతర, కతమ, అన్యతరాదులు కూడ ఇట్లే. ఈ విధముగా ‘పూర్వే పూర్వాశ్చ మొదలగు అనడుత్సు వరకు ఆయార అజంత హలన్త శబ్దములకు, పుంలింగమునందు కొన్ని విభక్తులలో సిద్ధ రూపములు ఇవ్వబడినవి. ఇప్పుడు స్త్రీ లింగ రూపములు చెప్పెదను. (351)