అగ్ని మహా పురాణము

Table of Contents

ఉణాది సిద్ధరూపము, నిరూపణము

కుమారస్వామి చెప్పెను:

ఇపుడు ధాతువు కంటె పరముగ వచ్చు ఉణాది ప్రత్యయములను గూర్చి చెప్పెదను. ఉణ్-కారుః=శిల్పి జాయుః, మాయుః=పిత్తము. ఇట్లే గోమాయువు ఆయువు మొదలగునవి. ఉణాదులు బహుళముగ వచ్చును. ఆయుః స్వాదువు హేతువు మొదలగునవి ఉణాది ప్రత్యయ సిద్ధములు. కింశారః=వరిముల్లు, కృకవాకుః=కోడి, గురుః=భర్త. మరుః శయివు=అజగరము, సరుః=ఆయుధము, స్వరుః=వజ్రము, త్రపు=సీసము, ఫల్గు=సారరహితము, క్రన్ ప్రత్యయము చేర్చగా గృధ్రః నిష్పన్న మగును. కిరచ్-మందిరమ్ తిమిరమ్ (చీకటి), ఇలచ్-సలిలమ్=(నీరు), బండిలమ్=కల్యాణము, క్వస్ ప్రత్యయము చేర్చగా, విద్వాన్=బుధుడు, శిబిరమ్=రహస్యమైన నివాసస్థానము, తుస్-హోతుః=పిల్లి, ఉణాదులు అభిధానమును బట్టి వచ్చుచుండును, కర్ణః=చెవి మరియు కాముడు వాస్తు=గృహ భూమి, జైవాతృక=చంద్రుడు, వహ-డిన్-చేర్చగా అనడ్వాన్, జీవాతు=జీవన ఔషధము, వహ్ ధాతువునకు ‘ని’ ప్రత్యయము చేర్చగా వహ్నిః, ఇనన్-హరిణః=మృగము మరియు కాముకుడు, పాత్రము, కంబోజః=పాత్రము, సరండః=భాండము, చతుష్పథము, హేరండః=వృక్షము, వరండః=సామ వేదము, స్ఫారం=అత్యదికము ‘కన్’ ప్రత్యయము చేర్చగా చీరము సిద్ధించును. వల్కలము; ఫారుః=పిరికివాడు, ప్రచండః=గురుడు, జవసమ్=తృణము, జగత్=భూలోకము, కృశానుః=అగ్ని, సూర్యుడు, వర్వరః=కుటిలుడు, ధూర్తుడు, చత్వరమ్=చతుష్పదము, చీవరమ్=భిక్షువులు కప్పుకొను వస్త్రము, మిత్రః=సూర్యుడు, పుత్రః=కుమారుడు, పితా=తండ్రి, వృధాకుః=వ్యాఘ్రము, వృశ్చికము, గర్తః=గొయ్యి, భరతః=నటుడు ఇంకను ఉణాదులున్నవి. (357)