అగ్ని మహా పురాణము

Table of Contents

సంధి సిద్ధ నిరూపణము

స్కందుడు చెప్పెను:

దండాగ్రం సాగతాదధీదం నదీహతే మధూదకమ్, పితృషభః ఋకారశ్చ తవేదం సకలోదకమ్! అర్థర్చోఽయం తవల్కారః సైషాసైంద్రీ తవౌదనమ్, ఖట్వౌఘోఽభవ దిత్యేవంవ్యసుధీర్వ స్వలంకృతమ్| పిత్రర్ధోపవనం దాత్రీనాయకో లావకోనయః త ఇహతయి హేత్యాది తేఽ త్రయోఽ త్ర జలేఽ కజమ్| ప్రకృతింనో అహో ఏహి అ అవేహి ఇంద్రకమ్, ఉ ఉత్తిష్ఠ కవీఏతౌ వాయూఏతౌ వనే ఇమే! అమీఏతే యజ్ఞభూతే ఏతి దేవ ఇమన్నయ, వక్షేసంధిం వ్యంజనాం వ్యాగ్యతోఽజే కమాతృకః| షడేతే తదిమే వాది వాజ్ఞ నీతిః షణ్ముఖాదిక్. వాఙ్మనసంవాగ్భవాదిర్వాక్ల్మక్ష్ణం తచ్చరీరక్! తల్లునాతి తచ్చ కుఙ్ ఙాస్తేచ సుగణ్ణిహ, భవాంశ్చరన్ భవాంశ్చాత్రో భవాంష్టీకా భవాంష్టకః| భవాంస్తీర్థం కుఙ్ ఙాస్తేచ సుగణ్ణిహ, భవాంశ్చరన్ భవాంశ్చాత్రో భవాంష్టీకా భవాంష్టకః| భవాంస్తీర్థం భవాస్థేయాన్ భవాంలేఖా భవాంజయః భవాంఛేతే భపాంచ్ శేతే భవాండీనః త్వంభర్తా తంకరిష్యాదిః సంధిర్ఞే యోవి సర్గతః! కశ్ఛిద్యాత్, కశ్చరేత్, కష్టః కష్ఠః కస్థశ్చ కశ్చలేత్! కఃఖనేత్ కల్గకరోరతి స్మకఃపఠేత్ కఃఫలేతవా, కశ్శ్వశురః, కః శ్వరశురః కస్సావరః కఃసావరః కఃఫలేత కఃశయితాకోఽత్రయోధః క ఉత్తమః, దేవాఏతేభో ఇహసాదరాయాంతి భాగోరపజ! సుపూః సుదూరా త్రిరాత్ర వాయుర్యాతి పునర్నవహి, పునరేతి సయాతీహ ఏషయాతి క ఈశ్వరః! జ్యోతిరూపం తవచ్ఛత్రం మ్లేచ్ఛదీశ్చిద్ర మాచ్ఛిదత్|

సంధి సిద్ధ రూపములను చెప్పెదను. ముందు స్వర సంధి చెప్పెదను. ‘దండాగ్ర’ మొదలు ‘జలేకజమ్’ వరకు ఉన్నవి ఉదాహరణము. అహో, ఏహి, దేవ ఇమం నయ వరకును ఉదాహరణములు. ప్రకృతి భావమునకు ఉదాహరణములు. ఇప్పుడు వ్యంజన సంధి చెప్పెదను. ‘వాగ్యతః’ మొదలు తంకరిష్యసి వరకును వున్నవి హల్సంధికి ఉదాహరణములు. కశ్ఛింద్యాత్ మొదలు జ్యోతీ రూపమ్’ వరకును వున్నవి విసర్గ సంధికి ఉదాహరణములు. తపఛత్రమ్ మ్లేచ్ఛ ధీః, ఛిద్ర మాచ్ఛిదత్. తుగాగమమునకు ఉదాహరణములు. (350)