అగ్ని మహా పురాణము

Table of Contents

సమవృత్త నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

విచ్ఛేదమునకు ‘యతి’ యని పేరు. ఒక్కొక్క పాదమున త, గ, ణ, యగణములున్నది. ‘తనుమధ్య’ జ, స, గు లున్నది ‘కుమారలలిత’ భ, భ, గు వున్నది ‘చిత్రపద’. మ, గు, గు లు ఉన్నది విద్యున్మాలా. భ, త, లగులున్నది మాణవకా ‘క్రీడితకా’. రన, స, లు వున్నది హల ముఖీ. న, న, మ లు ఉన్నది భుజంగ శిశుభృతమ, న, గు, గులు ‘హంసరుత’. య, స, జ, గులు, ‘శుద్ధవిరాట్’, య, న, గు లు పణవము. ర, జ, ర, గు లు ‘మయూరసారిణి’. మ, భ, స, గు లు మత్త త, జ, జ, గులు; ‘ఉపస్థిత’, భ, మ, స, గులు రుక్మవతి’, త, త, జ, గుగులు, ‘ఇంద్రవ్రజ్రా’, జతజ, గుగులు, ఉపేంద్రవ్రజ్రా, ఇంద్రవ్రజ్ర, ఉపేంద్రవ్రజ్రా లక్షణములు రెండును ఒకే ఛందస్సుతో ఉన్నవి. ఉపజాతి, భ, భ, గు,గు, లు, తోదకము, భ, త, త, గు, గు లు శాలిని, దీనిలో చతుర్థ సప్త మాక్షరములపై యతి. మ, భ, త, గు, గులు వాతోర్మి. చతుర్థ సప్తమాక్షర యతి. మ, భ, త, న, ల, గులు ‘భ్రమరీ విలసిత’. చతుర్థ సప్త మాక్షర యతి, ర, న, ర, ల, గులు రథోత్థతా చతుర్థ సప్తమాక్షర యతి. ర, న, భ, గు, గులు ‘స్వాగత’, న, స, గు, గు, లు ‘వృత్త’. ర, జ, ర, ల, గులు ‘శ్యేని’, జ, ర, జ, గు గులు ‘విలాసిని’ లేదా ‘రమ్యా’.

ఇకపై జగతీ ఛందస్సు ఆరంభమగును. జ, త, జ, ర, లు వంశస్థ వృత్తము. త, త, జ, ర, లు ‘ఇంద్రవంశి’. నాలుగేసి సగణములు కలది. ‘తోటక వృత్తము’. న, భ, భ, ర, లు ‘దృతవిలంబితము’. న, న, మ, య, లు ‘శ్రీపుట’ వృత్తము, అష్టమ చతుర్థాక్షరము లందు విరామము, జ, స, జ, స, లు ‘జలోద్ధతగతి’. షష్టాక్షరములందు యతి, న, న, మ, ర, లు. త, త, ము న, య, న, య, లు, ‘కుసుమవిచిత్ర’ న, న, ర, ర లు ‘చంచలాక్షికా’, నాలుగు యగణములు ఉన్నచో ‘భుజంగ ప్రయత’ నాలుగు రగణములు ‘స్రగ్విణి’, సజ, స, స, లు ‘ప్రమితాక్షర’, భ, మ, స, మ, లు ‘కాంతోల్పీడ’, మ, మ, య, య, లు ‘వైశ్వదేవి’ పంచమ సప్తమాక్షరములందు యతి. న, జ, భ, య, లు నవమాలిని, మ, న, జ, ర, గులు ప్రహర్షిణి’. తృతీయ దశమాక్షరములపై యతి. జ, భ, స, జ, గు, లు ‘రుచిర, చతుర్థ నవమాక్షరములపై యతి, న, న, న, సగులు ‘గౌరి’. య, త, న, స, గు, గు లు ‘అసంబాధ’, పంచమ నవమాక్షరములపై యతి. న, ర, స, ల, గు, లు ‘అపరాజిత’. సప్తమ సప్తమాక్షరములపై యతి. న వ, భ, న, ల, గు, లు ‘ప్రహరణకలిత’, సప్తమ సప్త మాక్షరములపై యతి. త, భ, జ, జ, గు, గులు వసంత తిలక, దీనికి ‘సింహోన్నత’, ‘ఉద్ధర్షిణి’ అని నామాంతరములు. నాలుగు నగణములు ఒక సగణము చంద్రావతి, షష్ట నవమాక్షరములపై యతి ఉన్నచో దీనికి మాలా అని పేరు. అష్టమ సప్తమాక్షరము లపై యతి ఉన్నచో ‘మణి, గణ, నికర’ అని పేరు. న, న, మ, య, యలు మాలినీ. అష్టమసప్త మాక్షరములపై యతి, భ, ర, న, న, గు లు ‘ఋషభగజవిలసితము’. సప్తమ నవమాక్షరములపై యతి. య, మ, న, స, భ, ల గు లు, శిఖరిణి’. షష్ట ఏకాద శాక్షరములపై యతి. జ, స, జ, స, య, ల, గులు ‘పృథ్వి’. అష్టమ, నవమాక్షరములపై యతి. మ, ర, న, భ, న, ల, గు లు వంశపత్రపతితము. దశమ సప్తమాక్షరములపై యతి. న, స, మ, ర, స, ల, గులు షష్ట చతుర్థ సప్తమాక్షరములపై యతి ఉన్నది ‘హరిణి’, మ, భ, న, త, త, గు, గులు ‘మందాక్రాంతా’, చతుర్థ షష్ట సప్తమాక్షరములపై యతి. మ, త, న, య, య, యలు ‘కుసుమితలతా వేల్లిత’. పంచమ, షష్ట, సప్త మాక్షరములపై యతి. మ, స, జ, భ, త, గులు ‘శార్దూలవిక్రీడితము’. ద్వాదశ సప్తమాక్షరములపై యతి. మ, ర, భ, న, య, భ, ల గులు సువదన. ఇది కృతి ఛందస్సులో అంతర్గతము. సప్తమ, షష్టాక్షరములపై యతి. కృతి ఛందస్సు యొక్క ప్రతిపాదము నందు వరుసగా గురు లఘువులు ఉన్నచో దానికి వృత్తమని పేరు. మ, ర, భ, న, య, యలు ‘స్రగ్ధరా’. సప్తమాక్షరములపై యతి, భ, ర, న, ర, న, గులు. ‘సుభద్రక’, దశమైకా దశాక్షరములపై యతి, న, జ, భ, జ, భ, జ, భ లగులు, అశ్వలలిత ఏక దశద్వాదశములపై యతి, మ, త, న, న, న, న, లగులు మత్తక్రీడ. అష్టమ పంచ దశా క్షరములపై యతి. భ, త, న, స, భ, భ, న, యలు తన్వి. పంచమ, సప్తమ, ద్వాద శాక్షరములపై యతి. భ, మ, స, భ, న, న, న, గు లు ‘క్రౌంచపద’ . పంచమ, పంచమ, అష్టమ, సప్తమాక్షరములపై యతి. మ, మ, త, న, న, న, ర, న, ల గులు ‘భుజంగవిజృంభితము’అష్టమ, ఏకాదశ సప్త మాక్షరములపై యతి. మ, న, న, న, న, న, న, స, గుగులు ‘అప హావ వృత్తము’. నవమ, షష్ట షష్ట పంచమాక్షరములపై యతి. ఒక్కొక్క పాదములో రెండు నగణములు, ఏడు రగణములు ఉన్నచో ‘దండకము’. దీనికే చండవృష్టి ప్రపాతమని పేరు. దీనిలో రెండు నగణములు కాక, రగణమునందు వృద్ధియైనచో వ్యాల జీమూతాది నామములగు దండకములు ఏర్పడును. ఇప్పుడు గాథాప్రస్తారమును చెప్పెదను. (334)