అగ్ని మహా పురాణము

Table of Contents

కారకము, నిరూపణము

స్కందుడు చెప్పెను:

విభక్యర్థ సమన్వితమగు కారకమును చెప్పెదను. గ్రామోఽస్తి, హే మహార్క, ఇవి ప్రథమ, సంబోధనమునకు ఉదాహరణములు. ‘నౌమి విష్ణుం శ్రియాసహ’ ఇచట విష్ణుం అనునది కర్మ కావున ద్వితీయలో వున్నది. శ్రియా అనునది తృతీయా, సహయోగముచే వచ్చినది. క్రియ చేయుటలో స్వతంత్రుడు కర్త. వానిని ప్రేరేపించువాడు హేతుకర్త్ర, కర్మనే కర్తగా చెప్పినచో కర్మ కర్త. దీనికి ‘స్వయ భిద్యేత్ ప్రాకృతధీః’, ‘స్వయం ఛిద్యతే తరుః’ ఇత్యాదులు ఉదాహరణములు. అభిహితము, అనభిహితము అని కర్త రెండు విధములు. మొదటిది ఉత్తమము, రెండవది అధమము. ‘ధర్మః వ్యాఖ్యాయతే’ ఇత్యాదులలో కర్త అనభిహితము. ఈ విధముగా కర్త ఐదు విధములుగా చెప్పబడినది. కర్మ ఏడు విధములు. ‘యతిః హరిం శ్రద్దదాతి’ ఇచట ఈప్సిత కర్మ. అహింలంఘయతే; ఇది అనీప్సిత కర్మ, ‘దుగ్ధం సంభక్షయన్ రజభక్షయతి’ ఇది ఈప్సితా నిప్సిత కర్మకు ఉదాహరణము. ‘గోపాలః గాం పయోదోగ్ధి’ ఇది అకథిత కర్మ; ‘గురుం శిష్యం, గ్రామంగమయతి’ ఇచట కర్త్రు కర్మ, హరేః పూజాక్రియతే. ఇచట అభిహిత కర్మ హరేః స్తోత్రం కుర్యాత్’ ఇచట అనభిహితకర్మ; కరణము బాహ్యము అభ్యంతరము అని రెండు విధములు; ‘చక్షుషా రూపం గృహ్ణాతి’ ఇచట బాహ్యకరణము. ‘ధాత్రేణలు నాతి’ ఇచట ఆంతర కర్మము; సంప్రదానము మూడు విధములు; ‘బ్రాహ్మణాయ గాం దదాతి’ ఇచట ప్రేరక సంప్రదానము. ‘నరః నృపతయే దాసందదాతి’ ఇచట అనుమంత్రక సంప్రదానము. భర్త్రే పుష్పాణిదదాతి. ఇచట అనిరాకర్తృక సంప్రదానము; అపాదానము రెండు విధములు; ధావతః ఆశ్వాత్ పతితః ఇచట చలాపాదానము. సః వైష్ణవః గ్రామాదాగచ్ఛతి ఇచట అచలాపాదానము.

అధికరణము నాలుగు విధములు ‘దధ్నిఘృతమ్’ తిలేషుతైలమ్ ఇత్యాదులందు వ్యాపకాధి కరణము. కపిః గృహే తిష్ఠతి’. ఇచట ఔపశ్లేషిక అధికరణము. జలేమత్స్యః ఇత్యాదులందు వైషయికాధి కరణము. గంగాయాం ఘోషః వసతి, ఇత్యాదులందు సామీప్య కాధికరణము. దీనికే ఔపచారిక వాక్యమని పేరు. కర్త అనభిహితమైనపుడు తృతీయ కాని, షష్టికాని వచ్చును. ఉదా: లోకైః విష్ణుః సంపూజ్యతే, ‘తేన లేదా తస్యగంతవ్యమ్’ కర్తృ కర్మలు అభిహితమైనచో ప్రథమా విభక్తి వచ్చును. భక్తః హరిం ప్రణమేత్. ఉదా: హేతర్థమున తృతీయా విభక్తి వచ్చును. ఉదా: అన్నేన వసేత్. తాదర్థ్యమున చతుర్థి వచ్చును. ఉదా: వృక్షాయ జలమ్. పరి, అప, తిఙ్ మొదలగు వాటితో సంబంధము ఉన్నపుడు పంచమి వచ్చును. ఉదా: దేవః పరిగ్రామాత్ వృష్టః, పూర్వః, గ్రామాత్, ఋతేః విష్ణోః నముక్తి మరొక ఉదాహరణము. ఇతరః హరేః పృథక్ వినా మొదలగు వాటితో సంబంధము ఉన్నపుడు పంచమి కాని తృతీయ కాని వచ్చును. ఉదాహరణములు పృథక్ గ్రామాత్ ‘విహారేణవినా’, కర్మ ప్రవచనీయలతో సంబంధమున్నపుడు ద్వితీయ వచ్చును. ఉదాహరణములు అన్వర్జు నంయోద్ధారః, అభితః గ్రామమ్. నమః, స్వాహా, స్వధా, స్వస్తి, వషట్ మొదలగునవి ప్రయోగించినపుడు చతుర్థి వచ్చును. ఉదాహరణములు నమః దేవాయ, తేస్వస్తి, భావవాచకము కంటే తుమర్థమున చతుర్థి వచ్చును. ఉదాహరణము-పాకాయయాతి మొదలగునవి; సహార్థక శబ్దములతో సంబంధము ఉన్నపుడును హేత్వర్థమునందును కుత్సితాంగ వాచకమునకును తృతీయ వచ్చును. ఉదాహరణములు-పితాపుత్రేణ సహ అగాత్ అక్ష్ణాకాణః, భృత్యః అర్థేన నివసేత్ ఇత్యాదులు కాలమునందును భావార్థమునందును సప్తమి వచ్చును. ఉదాహరణములు- ‘విష్ణౌనతే ముక్తిర్భవేత్ ‘వసంతే సహహరింగతః’ ఇత్యాదులు న్రూణాంస్వామి నృషుస్వామి, నృణాం ఈశః, సతాంపతిః, నృణాం సాక్షి, నృషుసాక్షి, గోషునాథః, గవాంపతిః గోషు సూతః, గవాంసూతః, రాజ్ఞాం దాయకః. ఇత్యాద్యుదాహరణములలో షష్టీ సప్తమీ విభక్తులు వచ్చినవి. స్మృత్యర్థ కర్మకు షష్టి వచ్చును. మాతుః స్మరతి. కర్తృకర్మలకు నిత్యముగ షష్టివచ్చును. అపాంఖేత్తా, తవకృతిః, ఇత్యాదులు ఉదాహరణములు. నిష్ఠాది యోగమునందు షష్ఠిరాదు. (354)