అగ్ని మహా పురాణము

Table of Contents

త్వరిత పూజాదికము

పరమేశ్వరుడు పలికెను:

ఓం గుహ్యకుబ్జికే.........నమః అను మూలోక మంత్రముచే గుహ్యకుబ్జికా జప పూజలు చేయవలెను. హ్రీం సర్వజనక్షోభణి ...........ఫట్ ఇది (మూలోక్తము) ‘నవాత్వరితా’ మంత్రము దానిని మాటిమాటికి జపించినచో విజయమును ఇచ్చును. హ్రౌం సింహాయ నమః అను మంత్రముచే ఆసనపూజచేసి దేవికి సింహాసనము సమర్పించవలెను. హ్రీం క్షే హృదయాయ నమః అని హృదయమును, వచ్చే శిరసే స్వాహా అని శిరస్సును స్పృశించ వలెను. త్వరితా మంత్ర శిరోన్యాసము పైవిధముగ చెప్పబడినది. క్షోం హ్రీం శిఖాయై వషట్ అని శీఖను క్షేం కవచాయ హుం అని భుజమును హ్రూం నేత్రయాయ వౌషట్ అని నేత్ర ద్వయమును, లలాట మధ్య భాగమును స్పృశించి హ్రీం అస్త్రాయఫట్ అని చప్పట్లు కొట్టవలెను. హ్రీంకారి, ఖేచరి, చండ, ఛేదని, క్షోభణి, క్రియ, క్షేమకారి, హూంకారి, ఫట్ కారి-వీరు నవశక్తులు.

ఇపుడు దూతికలను గూర్చి చెప్పెదను. వీరందరిని పూర్వాది దిశలందు పూజించవలెను. హ్రీం నచే బ్రహ్మవేతాలి మధ్యే (అని మూలోక్తము దూతీ మంత్రము). మరల త్వరిత గుహ్యాంగములను తత్త్వములను గూర్చి చెప్పెదను. హ్రౌం హ్రూం హః హృదయాయ నమః అని హృదయమునందు, హ్రీం హ్రాం శిరసే స్వాహా అని శిరస్సు నందును, ‘ఫాం’ జ్వల జ్వల శిఖాయై వషట్ అని శిఖయందును, ఇలే హంహం కవచాయ హుం అని రెండు భుజములందును క్రోం క్షూం శ్రీం నేత్ర త్రయాయ వౌషట్ అని నేత్ర లలాట మధ్యములందును న్యాసము చేసి, క్షౌం అస్త్రాయ ఫట్ అని చప్పట్లు కొట్టవలెను. మధ్య భాగమున హ్రుం స్వాహా అని వ్రాసి, పూర్వాది దిక్కులందు ఖే సదాశివే వ ఈశః భే మనోన్మనీ, మ క్షే తార్క్ష్యః హ్రీం మాధవః క్షౌం బ్రహ్మా హం ఆదిత్యః దారుణం ఫట్ అనివ్రాసి పూజచేయవలెను. ఈ విధముగ ఎనిమిది దిక్కులందు పూజింపదగిన దేవతలను గూర్చి చెప్పబడినది. (147)