అగ్ని మహా పురాణము

Table of Contents

సమాసములు - నిరూపణము

స్కందుడు చెప్పెను:

ఆరు విధములగు సమాసములను చెప్పెదను. ఇది మరల ఇరువది యెనిమిది విధములు. నిత్యము అనిత్యము అని సమాసము రెండు విధములు. లుక్, అలుక్ లచే మరల రెండు విధములు. కుంభకారః, హేమకారః, ఇత్యాదులు నిత్య సమాసములు. రాజ్ఞః పుమాన్ రాజ పుమాన్ ఇత్యాదులు అనిత్య సమాసములు. కష్టశ్రితః ఇత్యాదులు లుక్ సమాసములు. కంఠేకాలః ఇత్యాదులు అలుక్స మాసములు. ప్రథమాది సుప్రత్యయము లనుబట్టి తత్పురుషము ఎనిమిది విధములు. పూర్వం కాయస్య పూర్వకాయః ఇది ప్రథమాతత్పురుషము. అపరకాయః, అధరకాయః, ఉత్తరకాయః, అర్ధ కణాతుర్యబిక్షా ఇత్యాదులు ప్రథమాతత్పురుషములు. ఆపన్న జీవికః, అధరాశ్రితః, వర్షం భోగ్యః, వర్షభోగ్యః ఇత్యాదులు ద్వితీయాతత్పురుషములు. ధాన్యార్థః ఇది తృతీయాతత్పురుషము. విష్ణుబలిః ఇది చతుర్థీతత్పురుషము. వృకభీతిః పంచమీ తత్పురుషము. రాజ్ఞః పుమాన్, రాజపుమాన్, వృక్ష ఫలము ఇత్యాదులు షష్ఠీ తత్పురుష అక్షశౌండః ఇది సప్తమీ తత్పురుష. అహితః ఇది నఞ్ తత్పురుషము.

కర్మధారయము ఏడు విధములు. నీలోత్పలమ్ ఇత్యాదులు ఉదాహరణములు. ఇది విశేషణ పూర్వపదము. వైయాకరణ ఖసూచిః ఇది విశేష్యోత్తర పదము. శీతోష్ణమ్. ఇది విశేషణోభయపదము. శంఖపాండురః. ఇది ఉపమాన పూర్వపదము. పురుష వ్యాఘ్రః ఇది ఉపమానోత్తరపదము. గుణవృద్ధిః ఇది సంభావనా పూర్వపదము, గుణ ఇతి వృద్ధిః అని విగ్రహ వాక్యము. సుహృదేవసుబంధుకః, నుహృత్సుబంధుకః. ఇది అవధారణ పూర్వ పదము. బహువ్రీహి ఏడు విధములు. ఆరూఢ భవనః ఇది ద్విపద బహువ్రీహి. అర్చితా శేష పూర్వః ఇది బహుపద బహువ్రీహి. ఉపదశాః సంఖ్యోత్తర పదము. ద్విత్రాః ఇత్యాదులందు సంఖ్యోభయపదము. సమూలోధ్ధృతః. ఇది సహ పూర్వ బహువ్రీహి- కేశాకేశి, నఖానఖి ఇత్యాదులు వ్యతిహార లక్షణ బహువ్రీహి. దక్షిణ పూర్వా ఇత్యాదులందు దిగ్లక్షణ బహువ్రీహి. ద్విగువు రెండువిధములు. ద్విశృంగమ్. ఇది ఏకవద్భావీ ద్విగు. అనేక వద్భావి కూడ వుండును. ద్వంద్వ సమాసము రెండు విధములు. రుద్ర విష్ణూ ఇతరేతర యోగ ద్వంద్వము. భేరీపటహం. ఇది సమహార ద్వంద్వము. అవ్యయీభావము రెండు విధములు. శాకస్య మాత్రాశాక ప్రతి. ఇది నామ పూర్వ పదావ్యయీ భావము. ఉప కుంభమ్. ఉపరథ్యమ్, అవ్యయ పూర్వక అవ్యయీ భావములు. సమాసము ప్రాధాన్యమును బట్టి నాలుగు విధములు. ఉత్తర పదార్థ ప్రధానమగు తత్పురుషము, ఉభయ ప్రధానమగు ద్వంద్వము, పూర్వార్థ ప్రధానమగు అవ్యయీ భావము, అన్యార్థ ప్రధానమగు బహువ్రీహి. (355)