అగ్ని మహా పురాణము

Table of Contents

అష్టాష్టకము

పరమేశ్వరుడు పలికెను:

ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన త్రిఖండిని గూర్చి చెప్పెదను. ‘ఓం’ ‘క్షం నమో భగవతే రుద్రాయ నమః ......... వచనం శుభమ్’ అను (మూలోకమగు) బ్రహ్మఖండ పదమునందు రుద్ర మంత్రమునకు సంబంధించిన నూట ఇరువది అక్షరములున్నవి. ‘ఓం నమశ్చా ముణ్డే.........విచ్చే స్వాహా’ అను (మూలోక్తమగు) యథోచితాక్షరములు గల రెండవ మంత్రఖండము విష్ణు ఖండపదము’ ‘ఓం నముశ్చాముణ్డే నమో విచ్చే’ అను(మూలోక)మంత్రము మహేశ్వర ఖండము. ముప్పదియొక్క పదములు గలది. దీనిలో నూట డెబ్బది యొక్క అక్షరములున్నవి. ఈ మూడు ఖండములకు ‘త్రిఖండి’ అని పేరు. ఈ త్రిఖండీ మంత్రమునకు ఆద్యంతములందు హేం ఘోంలను పంచప్రణవములను చేర్చి జపపూజాదులు చేయవలెను. హేం ఘోం శ్రీ కుబ్జికాయై నమః అను మంత్రమును త్రిఖండీ పదముల సంధులయందు చేర్చవలెను. అకులాది త్రిమధ్యగ, కులాది త్రిమధ్యగ, మధ్యమాది త్రిమధ్యగ, పాదత్రిమధ్యగలు నాలుగు విధములగు మంత్ర పిండములు. మూడున్నర మాత్రలుగల ప్రణవమును మొదటచేర్చి వీటి జపమును, పూజను చేయవలెను. పిదప ఓం క్షౌం శిఖాభైరవాయ నమః’ అను భైరవశిఖామంత్ర జపము పూజ చేయవలెను. స్ఖాం-స్ఖీం-స్ఖే ఇవి మూడు సబీజు త్ర్యక్షరములు; హ్రాం-హ్రీం-హ్రేం ఇవి నిర్బీజ త్ర్యక్షరములు. విలోమక్రమమున ‘క్ష మొదలు ‘క’ వరకు నున్న ముప్పది రెండు అక్షరముల వర్ణమాలకు అకులా అనిపేరు. దీనికే అనులోమక్రమమున సకులా అని పేరు.

శశినీ, భావనీ, పావనీ, శివ, గాంధారీ, ‘ణ’పిణ్డాక్షీ, ‘వ’ అజరా, ‘య’ కుమారీ, ‘న’ కాలరాత్రీ, ‘ద’ సంకటా, ‘ధ’ కాలికా, ‘ఫ శివా, ‘ణ భవఘోరా, ‘ట’ బీభత్సా, ‘త’ విద్యుతా, ‘ఠ’ విశ్వంభరా, శంసినీ, ‘ఉ’ విశ్వంభరా, ‘ఆ’ శంసినీ, ‘ద’ జ్వాలామాలినీ, కరాలీ, దుర్జయా, రఙ్గి, వామా, జ్యేష్ఠా, రౌద్రీ, ‘ఖ’ కాలీ, ‘క’ కులాలమ్బీ అనులోమా, ‘ర’ పిణ్డినీ, ‘ఆ’ వేదినీ, ‘ఐ’ రూపీ, ‘వై’ శాంతిమూర్తి, కలాకులా, ‘ఋ’ ఖడ్గినీ, ‘ఉ’ వనితా, కులా, ‘ఌ’ సుభగా, వేదనాదినీ, కరాళీ, ‘అం’ మధ్యమా, ‘అః’ అపేతరయా అను శక్తులను యోగపీఠముపై క్రమముగా పూజించవలెను. ‘స్ఖాం స్ఖీం స్ఖౌం మహాభైరవాయ నమః’ అనునది మహాభైరవ పూజామంత్రము. బ్రహ్మాణి అష్టకదళమున, అక్షోద్యా, ఋక్షకర్ణీ, రాక్షసీ, క్షపణా, క్షయా, పింగాక్షి, అక్షయా, క్షేమా అను శక్తులుండును. ఇలా, లీలావతీ, నీలా, లంకా, లంకేశ్వరీ, లాలసా, విమలా, మాలలు, మహేశ్వరీ, అష్టకమున ఉందురు. హుతాశనా, విశాలాక్షీ, హ్రూంకారి, బడవాముఖీ, మహారవీ, క్రూరా, క్రోధా, ఖరాననా అనువారు కౌమారీ శరీరమునుండి ప్రకటమైనవారు. వీరు పూజితలై సకలసిద్ధులను ఇచ్చెదరు. సర్వజ్ఞా, తరలా, తారా, ఋగ్వేదా, హయాననా, సారాహరా, స్వయంగ్రాహా, శాశ్వతీ అను ఎనమండుగురు శక్తులు వైష్ణవీకులమున ప్రకటమైనవారు. తాలుజిహ్వ, రక్తాక్షీ, విద్యుజ్జిహ్వ, కరంకిణీ, మేఘనాదా, ప్రచం దోగ్రా, కాలకర్ణీ, కవి ప్రియులు వారాహీ కులమునందు ఉత్పన్న మైనవారు. విజయము కోరువాడు ఈ శక్తులను పూజించవలెను. చంపా, చంపావతీ, ప్రచంపా, జ్వలితాననా, పిశాచీ, పిచువక్త్రా, లోలుపా అనువారు ఇంద్రాణీ శక్తి కులమునందు ఉత్పన్నమైనవారు. పావనీ, యావనీ, వామనీ, దమనీ, బిన్దువేలా, బృహత్కుక్షీ, విద్యుతా, విశ్వరూపినులు, చాముండాకులోత్పన్నలు. వీరిని మండలము నందు పూజించినచో విజయము నిత్తురు. యమజిహ్వా, జయన్తీ, దుర్జయా, యమాంతికా, బిడాలీ, రేవతీ, జయా, విజయలు, మహాలక్ష్మీ కులమునందు ఉత్పన్న మైనవారు. ఈ విధముగ ఎనిమిది అష్టకములు వర్ణింపబడినవి. (146)