అగ్ని మహా పురాణము

Table of Contents

పాశుపత శాంతి వర్ణనము

పరమేశ్వరుడు చెప్పెను: ఇపుడు పాశుపతాస్త్ర మంత్రముతో చేయవలసిన శాంతి పూజాదులను చెప్పెదను. ఇవి వెనుక చెప్పినట్లే చేయవలెను. ఈ మంత్రమును ఆంశిక పాఠముగాని, జపముగాని చేసినచో పూర్వకృత పుణ్యము నశించును. షడంత సంపూర్ణ మంత్రము ఆ పథ్యాదులను నివారించును. ‘ఓం నమోభగవతే మొదలు సర్వదురితం నాశయ నాశయ ఫట్’ వరకును మూలోక్తమైనది. పాశుపత మంత్రము. దీనిని ఒక్క పర్యాయము ఆవృత్తి చేసినంతనే సమస్త విఘ్నములు నశించును. నూరు ఆవృత్తులచే సకల ఉత్పాతములు నశించును. యుద్ధాదులందు జయము కలుగును. ఆజ్యముతో బొగ్గులు కలిపి ఈ మంత్రముతో హోమము చేసినచో అసాధ్య కార్యములు కూడ సాధించవచ్చును. ఈ పాశుపతాస్త్ర పాఠ మాత్రముచే సకల క్లేశములు నశించును. (322)