అగ్ని మహా పురాణము

Table of Contents

అర్ధసమ నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

ప్రథమ పాదమున స, స, స, స, ల, గులు; రెండవ పాదము భ, భ, భ, గు, గు, లు వుండి ఉత్తరార్ధము పూర్వార్ధము వలె ఉన్నచో అది ఉపచిత్రకము. ప్రథమ పాదమున భ, భ, భ, గు, గు, లు; ద్వితీయ పాదమున న, జ, జ, జ, లు వున్న ద్రుత మధ్య ప్రథమ పాదమున స, స, స, గు, లు; ద్వితీయ పాదమున భ, భ, భ, గులు వున్నచో వేగవతి, మొదటి పాదమున త, జ, ర, గులు; ద్వితీయ పాదమునయ, స, జ, గు, గు, లు ఉన్నది భద్రవిరాట్. ప్రథమ పాదమున స, జ, స, గు, లు; ద్వితీయ పాదము భ, ర, న, గు, గు, లు వున్నవి ‘హేతుమతి’. ప్రథమ పాదమున త, త, జ, గు, గు, లు; ద్వితీయ పాదమున జ, త, జ, గు, గులు వున్నది ‘ఆఖ్యానికి’ ఏత ద్విపరీతముగా ఉన్నది ‘విపరీ తాఖ్యానకి’. ప్రథమ పాదమునస, స, స, ల, గు లు; ద్వితీయమున న, భ, భ, ల లు ఉన్నది ‘హరిణప్లుత’. ప్రథమ పాదమున న, న, ర, ల, గు లు; ద్వితీయమున న, జ, జ, ర, లు; ఉన్నది ‘అపరవక్త్రము’. ప్రథమ పాదమున న, ర, య, లు; ద్వితీయము న, న, జ, ర, గు, లు ఉన్నది ‘పుష్పితాగ్ర’. ప్రథమ పాదమున ర, జ, ర, జ లు, ద్వితీయ పాద మున జ, ర, జ, ర, గులు ఉన్నది ‘యమవతి’. ప్రథమ తృతీయ చరణములందు ఇరు వది ఎనిమిది లఘువులు ఒక గురువు ద్వితీయ చతుర్థ చరణములందు ముప్పది లఘువులు ఒక గురువు వున్నది శిఖా. ఏత ద్విపరీతముగ ఉన్నది ఖంజ. ఇపుడు సమవృత్తము చెప్పబడుచున్నది. (333)