అగ్ని మహా పురాణము

Table of Contents

అవ్యయవర్గము, నిరూపణము

అగ్ని పలికెను:

‘ఆఙ్’=కొంచము అను అర్థమునందును, అభివ్యాప్తియందును, ‘సీమ’ అను అర్థము నందును ప్రయోగింపబడును. దానిని ధాతువుతో చేర్చినపుడు వేర్వేరు అర్థములు ఉండును. ‘ఆ’ ఇది ప్రగృహ్య సంజ్ఙకము. స్మృతి వాక్యము అను అర్థమున ప్రయోగింపబడును. ఆః=కోపము, పీడ, కు=పాపము, నింద, కొంచెము ‘ధిక్=అసహ్యించుకొనుట, నింద. ‘చ’ ఇది అనువాచయ సమాహార ఇతరేతర, సముచ్చయార్థములందు ప్రయోగింపబడును. ‘స్వస్తి’ =ఆశీర్వాదము. క్షేమము-పుణ్యాదికము. ‘అతి’=ప్రకర్ష లంఘించుట, ‘స్విత్=ప్రశ్న వితర్కము ‘తు’=భేదము, అవధారణము. ‘సకృత్=కలిసి, ఒక పర్యాయము, ‘ఆరాత్’=దూరము, సమీపము. ‘పశ్చాత్’=పశ్చిమ దిక్కు వెనుకటిది. ‘ఉత’ ‘అపి’ అనుదానికి వున్న అర్థములను వికల్పార్థమును బోధించును. పునః సదా అను పదములకు ఉన్న అర్థమును ‘శ్వత్’ అనునది బోధించును. ‘సాక్షాత్=ప్రత్యక్షము, తుల్యము. బత=భేదము, అనుకంప, అసంతోషము, విస్మయము, ఆమంత్రణము. హంత=హర్షము, అనుకంప, వాక్యారంభము. విశాదము. ‘ప్రతి’=ప్రతినిధి, వీపు, లక్షణాదికము. ‘ఇతి’=హేతువు, ప్రకరణము, ప్రకాశాదికము, సమాప్తి. ‘పురస్తాత్’=పూర్వదిక్కు, ప్రథమము, పూర్వము. ‘అగ్రతః=ఇదికూడ పై ఆర్థములనే చెప్పును. ‘యావత్ తావత్’ ఇవి సాకల్యము అవధి, మానము, అవధారణము అను అర్థములను చెప్పును. ‘అథో’ ‘అథ’=మంగళ, అనంతర, ఆరంభ, ప్రశ్న, సంపూర్ణత్వములు, వృథా=నిరర్థకము, యథా, విధిగ లేనిది. నానా=అనేకము, ఉభయము. ‘ను’=ప్రశ్న, వికల్పము. అను=వెనుక, సాదృశ్యము. ‘నను’=ప్రశ్న అవధారణము, అనుజ్ఞ అనునయము, ఆమంత్రణము. ‘ఆపి’=గర్హ, సముచ్ఛయము, ప్రశ్న, శంక, సంభావన. వా=ఉపమ, వికల్పము. సామి=సగము, జుగుప్సితము. అమా=కూడ, సమీపము. కం=నీరు, శిరస్సు. ఏవం=అనునది ‘ఇవ’ ‘ఇత్థం’ పదముల అర్థము బోధించును. నూనం=తర్కము అర్థ నిశ్చయము. జోషం=మౌనముగా ఉండుట, సుఖము. ‘కిం’=ప్రశ్న నింద. ‘నామ’=పాకాశ్యము. సంభావ్యము, క్రోధము, స్వీకారము, నింద. అలం=భూషణము, పర్యాప్తి శక్తి, నివారణము. ‘హూం’=వితర్కము, పరిప్రశ్న. ‘సమయా’=సమీపము, మధ్య. ‘పునః=ప్రథమము కానిది, భేదము. ‘నిః’=నిశ్చయము, నిషేధము. ‘పురా’=చిరకాలమునకు పూర్వము, సమీప భవిష్యత్తు. ‘ఉరరీ’ ‘ఊరీ’ ‘ఉరి’=విస్తారము, అంగీకారము. ‘స్వర్’=స్వర్గము, పరలోకము. కిల=వార్త, సంభావనా, ‘ఖలు’=నిషేధము. వాక్యాలంకారము. జిజ్ఞాసావసరము. అబితః=సమీపము, రెండు వైపుల, శీఘ్రము, సాకల్యము, అభిముఖము. ‘ప్రాదుస్’ నామ, ప్రకాశము. ‘మిథః’=అన్యోన్యము, రహస్యము, ‘తిరస్’=అంతర్ధానము, అడ్డము. ‘హా’=విషాదము, శోకము, ఆర్తి. ‘అహః’=అద్భుతము, భేదము. ‘హి’=హేతువు, అవధారణము.

చిరాయ-చిరరాత్రాయ చిరస్య మొదలగునవి చిరార్థకములు. ముహుః, ‘పునఃపునః’, ‘శశ్వత్’, ‘అభీక్ష్ణం’ ‘అసకృత్’=మాటిమాటికి. ద్రాక్, ఝటితి, అంజసా, అహ్నాయ, మంక్షుః. ‘సపది’=శీఘ్రము, ఋవత్. ‘సుష్టు’ శోభనము. ‘కిముత’=వికల్పము. కిం, కిమూత=వికల్పము. ‘తుహి’, ‘చ’, ‘స్మ’, ‘హ’, ‘వై’ పాదపూర్తికి ఉపయోగించబడును. ‘అతి’=పూజార్థకము ‘దివా=పగలు. ‘దోషా’, ‘నక్తం’=రాత్రి. ‘సాచి’, ‘తిరస్’=అడ్డముగా. ‘ప్యాట్’ పాట్, అంగ, ‘హే’, ‘హై’ భోః=ఇవి సమానార్థకములు. సమయా, నికషా, హిరుక్=దగ్గర, “సహసా”=అతర్కితము, ‘పురః, పురతః, అగ్రతః=ఎదుట, దేవతలకు హవిస్సును ఇచ్చునపుడు ‘స్వాహా’ స్రౌషట్, వౌషట్, స్వధా, అనుపదములు ప్రయోగింపబడును. ‘కించిత్’, ‘ఈశత్’ మనాక్=కొంచెము. ‘ప్రేత్య’, ‘అముత్ర’=జన్మాంతరము నందు. యతా, తథా=సామ్యము అహో-ఓ=ఆశ్చర్యము. ‘తూష్ణీం, తూష్ణీకమ్’=మౌనము. ‘సద్యః, సపది’=తత్క్షణము. ‘దిష్ట్యా’ సముప జోషమ్’=ఆనంద సూచకములు. ‘అంతరే, అంతరా, అంతరేణ’=మధ్య యందు. “ప్రసహ్య’=హఠాత్తుగా. ‘సాంప్రతం. స్థానే=కాయుక్తము. ‘అభిక్ష్ణమ్, శశ్వత్’=నిరంతరముగ. ‘నహి, అ’ నో, న’=అభావము, ‘మాస్మ, మా, అలమ్’=ఇవి నిషేధార్థకములు. ‘చేత, యది’=ఇవి పక్షాంతరమును ‘అద్ధా, అంజసా’ వాస్తవార్థమును బోధించును. ‘ప్రాదుః, ఆవిః=ప్రకట మగుట. ‘ఓం, ఏవం’ పరమం=అంగీకారము. ‘సమంతతః పరితః, సర్వతః, విశ్వక్=నలు వైపుల. ‘కామమ్, ఇష్టము లేని అనుమతిని సూచించును. ‘అస్తు=కోపముతో కూడిన అనుమతిని సూచించును. నను=విరోధోక్తిని సూచించును. ‘కచ్చిత్’=కోరికను తెలుపుటను సూచించును. ‘నిస్సమం’, ‘దుస్సమం’=నింద్యము. యథాస్వం, యథా యథము-యథా యోగ్యముగా, మృషా, మిథ్యా=అసత్యము. ‘యథాతథమ్’ యథార్థము. ‘ఏవం, తు’ పునః, వై, వా=ఇవి నిశ్చయార్థకములు. ప్రాక్ ఇది అతీతార్థమును ‘సూనం, అవశ్యం’ నిశ్చయముగా, ‘సంవత్’=సంవత్సరము. ‘ఆర్వాక్’=వెనుకటి కాలము. ‘ఆం, ఏవమ్’=అట్లే. ‘స్వయం’=స్వయముగా. ‘నీచైః=అల్పము. ‘ఉచ్చైః=అధికము. ‘ప్రాయః=తరచుగా, శనైః =మందముగా, ‘సనా=నిత్యము, ‘బహిః’=వెలుపల, ‘స్మ=భూత కాలార్థము. ‘అస్తమ్’=అదృశ్యము. ‘ఆస్తి’=ఉన్నది. ‘ఊ’=కోపోక్తి. ‘అయి’=ప్రశ్నము. అనునయము. ‘హూం=తర్కము. ‘ఉషా’=ప్రాతఃకాలము. ‘నమః’=నమస్కారము, అంగమరల. ‘దుష్టు’=నింద. ‘సుష్టు=ప్రశంసా. ‘సాయం’=సాయం కాలము. ‘ప్రగే’=ప్రాతఃకాలము. ‘నికషా’=సమీపమున. ఐషమః=గడచుచున్న సంవత్సరము. ‘పరుత్’=నిరుడు. ‘పరారి’=ముందటి ఏడు. అద్య=నేడు. ‘పూర్వ, ఉత్తర, ఆపర, అధర, అన్య, అన్యతర, ఇతర, శబ్దములకు, పూర్వే అహ్ని, ఇత్యాద్యర్థము లందు పూర్వేద్యుః ఇత్యాది పదములు నిష్పన్నమగును. ‘ఉభయద్యుః, ఉభయేద్యుః=రెండు దినములందును. ‘పరేద్యవి’=మరుసటి రోజున. ‘హ్యః’=నిన్న. ‘శ్వః’=రేపు. ‘పరశ్వః=ఎల్లుండి. ‘తదా’ తదానీం=అపుడు. ‘యుగపత్, ఏకదా’=ఒక్కమాటుగా, ‘సర్వదా, సదా’=ఎల్లప్పుడును. ‘ఏతర్హి, సంప్రతి, ఇదానీం, అధునా, సాంప్రతం’=ఇపుడు. (361)