అగ్ని మహా పురాణము

Table of Contents

శివరాత్రి వ్రతం

అగ్ని దేవుడు చెప్పెను:

ఇపుడు భుక్తి ముక్తి ప్రదమగు శివరాత్రి వ్రతమును గూర్చి చెప్పెదను ఏకాగ్ర చిత్తముతో వినుము. మాఘ ఫాల్గుణముల మధ్య వచ్చు కృష్ణ చతుర్దశినాడు కోరికలు గలవాడు ఉపవాస ముండవలెను. రాత్రి జాగరముచేసి ఇట్లు చెప్పవలెను. ‘నేను చతుర్దశినాడు ఉపవాసముండి శివరాత్రి వ్రతము చేయుచున్నాను. నేను వ్రతముక్తుడనై రాత్రి జాగరముచేసి శివుని పూజ చేయుచున్నాను. భోగ మోక్షములను ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు నరక సముద్రమును దాటించు నౌకవంటివాడవు. నీకు నమస్కారము. నీవు ప్రజా రాజ్యాధుల నిచ్చువాడవు. మంగలమయుడవు. శాంత స్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య, ఆరోగ్య, విద్యా, ధన, స్వర్గములను ఇచ్చు వాడవు. నాకు ధర్మమును, ధనమును, కామభోగాదికమును ప్రసాదించుము. నన్ను గుణ, కీర్తి, సుఖ సంపన్నుని చేయుము. నాకు స్వర్గ, మోక్షములను ఇమ్ము’. శివరాత్రి వ్రత ప్రభావముచే పాపాత్ముడైన సుందరసేనుడను వ్యాధుడుకూడ పుణ్యవంతుడు ఆయెను. (193)