అగ్ని మహా పురాణము
నానార్థ వర్గము - నిరూపణము
అగ్ని పలికెను:
‘నాకః=ఆకాశము, స్వర్గము, ‘లోకః=లోకము, జనులు, ‘శ్లోకః’=పద్యము, కీర్తి, ‘సాయకః=బాణము, ఖడ్గము, ‘ఆనకః=పటహము, భేరి. ‘కలంకః’=మచ్చ, అపవాదము ‘కః=(పుం)=వాయువు, బ్రహ్మ, సూర్యుడు, కం=(న)=శిరస్సు, జలము. ‘పులాకః=తుచ్ఛ ధాన్యము, సంక్షేపము, అన్నపుమెతుకు, ‘కౌశికః=మహేంద్రుడు, గుగ్గులు, గుడ్లగూబ, పాములవాడు, ‘శాలావృకః=వాన రము, శునకము, ‘మానమ్’=కొలుచు సాధనము. ‘సర్గః=స్వభావము, నిర్మోక్షము, నిశ్చయము, అధ్యాయము, సృష్టి, ‘యోగః’=కట్టుట, ఉపాయము, ధ్యానము. సంగతి, యుక్తి, ‘భోగః’=సుఖము, వేశ్యా స్త్రీలకు, మొదలగువారికి ఇచ్చు భృతి ‘అబ్జః=శంఖము, చంద్రుడు, ‘కరటః=కాకి, ఏనుగు గండస్థలము ‘శిపివిష్టః’=దుష్ట చర్మముకల వాడు, ‘రిష్టం’=క్షేమము, అశుభము, అభావము, ‘అరిష్టం’=శుభము, అశుభము ‘వ్యుష్టిః’=ప్రభాతము, సమృద్ధి ‘దృష్టి’=జ్ఞానము, నేత్రము, దర్శనము. ‘నిష్టా’=నిష్పత్తి, నాశము, అంతము. ‘కాష్ఠా’=ఉత్కర్షము, స్థితి, దిక్కు, ‘ఇడా’, ‘ఇలాః=భూమి, గోవు. ‘ప్రగాఢః=అత్యంతము, కఠినము, ‘బాఢం’=మిక్కిలి ప్రతిజ్ఞ, ‘దృఢః=సమర్థుడు, స్థూలమైనది. వ్యూఢః=ఏర్పరుపబడినది. కలిసియున్నది. ‘కృష్ణః=వ్యాసుడు, అర్జునుడు, హరి, ‘పణః’=జూదాదుల యందు పందెము, భృతి మూల్యము, ధనము, ‘గుణః’=నారి, గుణము, సత్త్వాదులు, శుక్లాదులు, సంధి మొదలగునవి. ‘గ్రామణీః=శ్రేష్టుడు, గ్రామాధిపతి. ‘ఘృణా’=జుగుప్స, కరుణ. ‘తృషా’=ఆసక్తి, దాహము. ‘విపణిః=వర్తకుల వీథి. ‘తీక్ష్ణమ్’=విషము, యుద్ధము, లోహము, తీక్ష్ణమైనది అను అర్థమున ఇది త్రిలింగము, ‘ప్రమాణమ్’=హేతువు, మర్యాద, శాస్త్రము, ఇంత అను నిశ్చయము. ప్రామాణికుడు. ‘కరణమ్’=క్షేత్రము, శరీరము, మొదలగునవి. ఈరిణమ్=శూన్యము ఊషర క్షేత్రము.
‘యంతా’=మావటివాడు, సారథి. ‘హేతి’=అగ్నిజ్వాల, ‘శ్రుతమ్’=శాస్త్ర నిర్ణయము, శాస్త్రము. ‘కృతం’=కృతయుగము, పర్యాప్తము, ప్రతీతః=ప్రసిద్ధము, చూడబడినది. ‘అభిజాతః=సత్కులీనుడు, పండితుడు. ‘వివిక్త=పవిత్రమైనది. విజనము. ‘మూర్ఛితః=మూర్ఛపొందినవాడు, అంతటా వ్యాపించినది. ‘అర్థః=అర్థము, ధనము, వస్తువు, ప్రయోజనము, నివృత్తి. ‘తీర్థం’=మూల కారణము, ఆగమము, మహర్షులు సేవించిన జలము, గురువు. ‘కకుద్’=ప్రధానము, రాజ చిహ్నము, ఎద్దు మూపురము, ‘సంవిత్’=జ్ఞానము, సంభాషణము, క్రియానియమము, యుద్ధము, నామము. ‘ఉపనిషత్’=ధర్మము, రహస్యము. ‘శరత్’=శరదృతువు, సంవత్సరము, ‘పదం’=నిశ్చయము, రక్షణము స్థానము, చిహ్నము, పాదము, వస్తువు, ‘స్వాదు’=ఇష్టము, మధురము. ‘మృదు’=తీక్ష్ణము కానిది, కోమలము. ‘సత్’=సత్యము, సాధువు, ఉన్నది, ప్రశస్తము, పూజ్యము, విధిః=విధానము, దైవము. “ప్రణిధిః”=పార్థన, గూఢచారి. “వధూ’=భార్య, కోడలు, స్త్రీ “సుధా”=సున్నము, అమృతము, “శ్రద్ధా’=ఆసక్తి, విశ్వాసము, పండితంమన్య, గర్విత=పండితుడు నని గర్వించినవాడు, ‘బ్రహ్మ బంధుః’=బ్రాహ్మణుని అధిక్షేపమును తెలుపును. ‘భానుః=సూర్యుడు, కిరణము. ‘గ్రావా’=పర్వతము, శిల. ‘పృథక్ జన=మూర్ఖుడు, నీచుడు. ‘శిఖరీ’=వృక్షము, పర్వతము. ‘తనుః=చర్మ, దేహము. ‘ఉత్థానమ్’=పౌరుషము, తంత్రము. ‘పుణ్యత్థానమ్’=ఎదిరించుట. ‘నిర్మాతనం’=వైరము తీర్చుకొనుట. దానము, న్యాసము తిర్గి ఇచ్చుట. ‘వ్యసనం’=ఆపద, క్రింద పడుట, కామ క్రోధములవలన కలిగిన దోషము, వేట, జూదము, పగటి నిద్ర, ఇతరులను నిందించుట, స్త్రీ సక్తి, మద్య పానము, నాట్యము, గానము, వాద్యములు, వ్యర్థముగా, తిరుగుట. ఇవి కామము వలన కలిగిన పదీ వ్యసనములు; చాడీలు చెప్పుట, సాహసము, ఈర్ష్య, అసూయ, అర్థ దూషణము, పరుషవాక్, పరుష దండము. ఇవి క్రోధము వలన కలిగిన ఎనిమిది వ్యసనములు.
‘కౌపీనం’=చెడ్డపని, గుహ్యము. ‘మైథునం’=సంగతి, రతి. ‘ప్రధానం’=పరమార్థ బుద్ధి. ‘ప్రజ్ఞానం’=చిహ్నము, బుద్ధి. ‘క్రందనం’=ఏడ్పు, పిలుచుట. ‘వర్ష్మ’=దేహము, ప్రయాణము. ‘ఆరాధనం’=సాధనము, ప్రాప్తి, సంతోష పెట్టుట. ‘రత్నం’=స్వజాతి శ్రేష్టము. ‘లక్ష్మ’=చిహ్నము, ప్రధానము, కలాపః=భూషణము, నెమలి పింఛము, అంబులపొది, సంఘటితము. ‘తల్పం’=శయ్యా, అట్టాలిక, భార్య. ‘డింభుః=శిశువు, మూర్ఖుడు. ‘స్తంభః=స్తంభము, కొయ్యబారుట. ‘సభా’=సమితి, సదస్సులు. ‘రశ్మిః’=కిరణము, కళ్ళెము. ‘ధర్మః’=పుణ్యము యమాదులు, లలామం, పుచ్ఛము, పుండ్రము, అశ్వము, అలంకారము, ప్రాధాన్యము, ధ్వజము. ‘ప్రత్యయః’=అధీనము, శపథము, జ్ఞానము, విశ్వాసము, హేతువు. ‘సమయః’=శపథము, ఆచారము, కాలము, సిద్ధాంతము. ఒడబాటు. “అత్యయః”=అతిక్రమణము, కాఠిన్యము, “సత్యం”=శపథము, తథ్యము. “వీర్యం=బలము, ప్రభావము. “రూప్యం”=రూపము, ప్రశస్తము. ‘దురోదరః=(పుం) జూదరి (నపుం) పందెము, జూదము. ‘కాంతారః’=మహారణ్యము, దుర్గ మార్గము. ‘హరిః=యముడు, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, విష్ణువు, సింహాదులు, ‘దరః=(పుం, న.) భయము, గొయ్యి. ‘జఠరః=ఉదరము, కఠినము. ‘ఉదారః’, దాతా, మహాపురుషుడు, ‘ఇతరః=అన్యుడు, నీచుడు, ‘మౌళిః=శిఖ, కిరీటము, ముడివేసిన జుట్టు, ‘బలిః’=పన్ను, ఉపహారము, ‘బలం’=సైన్యము, స్థైర్యము మొదలగునది. ‘నీవీ’=స్త్రీకటి వస్త్రబంధము, మూల ధనము, ‘వృషః=అధిక వీర్యవంతుడు, ఎలుక, శ్రేష్ఠము, పుణ్యము, వృషభము, ఆకర్షః’=జూదము నందు ఉపయోగించు పాచికా, సారి ఫలకము ‘అక్షం’-ఇంద్రియము. ‘అక్షః=పాచికా, కర్షము, వ్యవహారము, కలిద్రుమము. ‘ఉష్ణీశః=కిరీటాదికము, ‘కర్షూః=చిన్ననది. ‘అధ్యక్షః=పత్యక్షము, అధికారి, ‘విభావసుః=సూర్యుడు, అగ్ని, ‘రసః=శృంగారాది రసము, విషము, వీర్యము, గుణము, రాగము, ద్రవము, ‘వర్చస్’=తేజస్సు, పురీషము. ‘ఆగః=పాపము, అపరాధము. ‘ఛందస్’=పద్యము, అభిలాష, సాధీయన్’=ఉత్తమము, నిశ్చితము. ‘వ్యూహః’=సమూహము. ‘అహిః=వృత్రాసురుడు, ‘తమోపహ’=అగ్ని, చంద్రుడు, సూర్యుడు. (362)
