అగ్ని మహా పురాణము

Table of Contents

నానావిధ  మంత్రౌషధములు

అగ్నిదేవుడు పలికెను:

“ఐం, కులజే ఐం సరస్వతి స్వాహా” ఇది పదకొండు అక్షరముల ముఖ్య మంత్రమైన సరస్వతీ విద్య. ఉప్పులేని ఆహారము తినుచు అక్షర లక్షలు జపముచేసినవాడు మేదోవంతుడగును. అత్రి(ద్), అగ్ని(ర్), వామనేత్ర(ఈ), బిందు(o) ఇవి కలుపగా ఏర్పడిన ‘ద్రీం’ అను మంత్రము శత్రువులను పారద్రోలు మహామంత్రము. వజ్ర కమలములను ధరించిన పీతవర్ణుడగు ఇంద్రుని ఆవాహనచేసి పూజించి ఘృత తిలములతో లక్ష హోమములు చేయవలయును. పిదప తిల మిశ్రజలముతో ఇంద్రునకు అభిషేకము చేయవలయును. అట్లు చేయుటచే రాజు కోల్పోయిన రాజ్యమును పుత్రాదులను పొందును. హ్రీం అనుదానికి ‘శక్తి దేవ’యనిపేరు. దీని ఉద్గారము ఘోష అగ్ని దండి దండములు. శివా శివ పూజలుచేసి ఈ మంత్రమును జపించవలయును. అష్టమీ నుండి చతుర్దశి వరకు పూజలో వుండవలెను. చేతులలో చక్రము పాశము అంకుశము అభయముద్ర ధరించిన వరదాత్రియగు దేవిని ఆరాధనచేసి హోమాదులు చేయుటచే సౌభాగ్యము కవితాశక్తి పుత్రులు లభింతురు. “ఓం హ్రీం ఓం నమః” మొదలు “కురుకురు ఓం” వరకును వున్న మూలోక్తమంత్రమును జపాదులు చేయుటచే సంపూర్ణ జగత్తు వశములో ఉండును. “ఓం హ్రీం చాముండే అముకం దహ దహ వచవచ మమవశమాయన స్వాహా ఓం”. అను ఇది చాముండా వశీకరణ మంత్రము. ఈ వశీకరణ ప్రయోగ సమయమున స్త్రీ చల్లని త్రిఫలాజలముతో తన గుహ్యాంగమును కడుగుకొనవలయును. అశ్వగంధయవ క్షార హరిద్రా కర్పూరాదులు కూడ ఇందుకు ఉపయోగించవచ్చును. ఎనిమిది పిప్పలి తండులములు ఇరువది మిరియము గింజలు బృహతీ రసము వీటి లేపముచే కూడ మరణాంతము వరకు వశము చేసుకొనగలుగును. కటీరమూల త్రికటు క్షౌద్ర లేపముకూడ ఇందులకు ఉపయోగించును. హిమ, కపిత్థక, రస, మాగధీ, మధు వీటి ప్రయోగము దంపతులకు క్షేమకరము. శర్కర కలిపిన కబందరసమును మధువును గుహ్యాంగము నందు లేపనము చేసినచో వశీకరణమగును. సహదేవి, మహాలక్ష్మి పుత్రజీవి కృతాంజలులు చూర్ణమును శిరస్సుపై ఉంచినచో ఇది ఉత్తమమైన వశీకరణ సాధనము. త్రిఫలా చందనముల క్వాథము ఒక ప్రస్థము వేరుగాను రెండు కుడవములు వేరుగాను వుంచి భృంగ హిమరసములు అంతే ప్రమాణము గల పసువు చుంబకము తేనె, నేతిలో ఉడికించినప్పుడు పసుపు, ఎండిన పసుపు వీటి అన్నిటితో లేపము తయారుచేసి బిదారి జటామాంస చూర్ణము నందు శర్కర కలిపి బాగుగా మర్దించి పాలతో ప్రతిదినము సేవించు పురుషుడు స్త్రీ శతముతో సంగమము చేయకలుగును.

గుల్మ, మాష, తిలప్రీహి చూర్ణములతో పాలు శర్కర కలిపి అశ్వత్థ, వంశ, దర్భమూల, వైష్ణవీశ్రీ మూలములను దూర్వా, అశ్వగంధ మూలములను పుత్రులు కోరు స్త్రీ పాలతో త్రాగవలెను. కాంతిలక్ష్మి, శిఫాధాత్రి, వజ్ర, లోధ్ర, వటాంకురములను స్త్రీ ఋతు కాలమునందు ఆజ్య క్షీరములు కలిపి త్రాగవలెను. పుత్రుడు కలుగును. పుత్రార్థినియగు స్త్రీ, శ్రీయను ఓషధీ మూలమును వటాంకురమును క్షీరముతో త్రాగవలెను. శ్రీ వటాంకుర దేవీల రసమును నశ్యముగా తీసుకొనవచ్చును. త్రాగవచ్చును. శ్రీ పద్మమూల అశ్వత్థ ఉత్తర మూలములను పాలతో త్రాగవలెను. కార్పాస ఫలములను పల్లవములను పాలలో నూరి పలుచగచేసి త్రాగవలెను. అపామార్గ నూతన పుష్పాగ్రములను గేదెపాలతో త్రాగవలెను. పైన చెప్పిన ఆరున్నర శ్లోకములలో నాలుగు పుత్రప్రాప్తి యోగమును చెప్పబడినవి. స్త్రీకి గర్భ స్రావమగుచున్నచో శర్కర, ఉత్పల పుష్ప, అక్షలోధ్ర, చందన, శారిబాలతలను బియ్యపు కడుగులో నూరిగాని లేదా లాజాయస్టిసితా, ద్రాక్ష, మధు, ఘృతములను కలిపిగాని స్త్రీ సేవించవలెను.

అటరూష, కలాంగలీ, కాకమాచీ శిఫలను నూరి నాభీ క్రిందు భాగమున పూసినచో సుఖ ప్రసవమగును. రక్త శుక్ల జపాపుష్పములు రక్త శుక్ల ఓషధులు కలిపి త్రాగవలెను. కేసర బృహతీ మూల గోపీ షష్టి తృణోత్పలములను మేక పాలతో నూరి తైలము కలిపి తిన్నచో వెంట్రుకలు మొలచును. జుట్టు ఊడిపోకుండగ చేయుటకు కూడ ఇవి ఉపయోగించును. ధాత్రి, భృంగ రసములు ఒక్కొక్క ప్రస్థము, తైలము, ఒక ఆఢకము పాలు షష్టి అంజనల ఒక పలము తైలము ఇవియన్నియు నేత్రకేశ శిరస్సులకు హితకరములు. హరిద్రా రాజవృక్షత్వక్ చంచాలవణ లోధ్ర పీతఖారులు, ఆవుల పొట్ట ఉబ్బు రోగమును తొలగించును. ‘ఓం నమో భగవతే’ మొదలు ‘కురు ఠఠఠ’ వరకునుగల మూలోక్త మంత్రము గోసముదాయ రక్షామంత్రము. మహాసేనుడు, వీరుడగు ఘంటా కర్ణుడు మహాబలవంతుడని చెప్పబడినాడు. జగత్పతియైన ఆతడు మహామారి వినాశకుడు, అతడు నన్ను రక్షించుగాక! ఈ రెండు మంత్రములును గోరక్షక మంత్రములు. వీటిని వ్రాసి ఇంటిలో వుంచుకొన వలయును. (302)