భవిష్య పురాణము

71 - సూర్య నామ స్తోత్రం

‘యాజ్ఞవల్క్యా! సూర్యభగవానులే నామ స్తవనానికి ప్రసన్నులౌతారో విను’ అంటూ బ్రహ్మదేవుడు ప్రసాదించసాగాడు.

నమః సూర్యాయ నిత్యాయ రవ్యేఽరాయ భానవే

భాస్కరాయ మతంగాయ మార్తండాయ వివస్వతే II

నిత్య, రవి, అర్క, భాను, భాస్కర, మతంగ, మార్తండ, వివస్వాన్ అనే పేర్లతో భాసిస్తున్న భాస్కర భగవానులకు నా నమస్కారములు.

ఆదిత్యాయాది దేవాయ నమస్తే రశ్మి మాలినే

దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయచ

ప్రభాకరాయ మిత్రాయ నమస్తేఽదితి సంభవ

నమో గోపతయే నిత్యం దిశాంచపతయే నమః

నమోధాత్రే విధాత్రేచ అర్యమ్ణో వరుణాయచ

పూష్ణో భగాయ మిత్రాయ పర్జన్యా యాంశవేనమః

నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయచ

హరయే హరితాశ్వాయ విశ్వస్యపతయే నమః

విష్ణవే బ్రహ్మణోనిత్యం త్ర్యంబకాయ తథాత్మనే

నమస్తే సప్తలోకేశ నమస్తే సప్త సప్తయే

ఏకస్మైహి నమస్తుభ్య మేకచక్ర రథాయచ

జ్యోతిషాంపతాయే నిత్యం సర్వప్రాణభృతేనమః

హితాయ సర్వభూతానాం శివాయార్తి హరాయచ

నమః పద్మ ప్రబోధాయ నమో వేదాదిమూర్తయే

కాధిజాయ నమస్తుభ్యం నమస్తారా సుతాయచ

భీమజాయ నమోస్తుభ్యం పావకాయచవై నమః

ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిత్యదా

నమోఽస్వ్తదితిపుత్రాయ నమో లక్ష్యాయ నిత్యశః

బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు. ఓ మునీ! ఈ నామాలను ప్రాతఃకాల, సాయం కాలాల్లో పవిత్రుడై పఠించేవాడు నాలాగే మనో వాంఛితాలన్నిటినీ పొందగలడు. ఈ నామ స్తోత్ర సహితంగా సూర్యారాధన చేసేవారు ఆయన అనుగ్రహం వల్ల ధర్మార్థ కామాలను, ఆరోగ్య రాజ్య విజయాలనూ పొందగలరు; బంధనాలలో చిక్కుకున్నవాడు బంధవిముక్తుడౌతాడు. ఈ నామాలను జపిస్తే పాపాలన్నీ నశిస్తాయి. అని చెప్పి బ్రహ్మ తన అనుగ్రహభాషణాన్ని ముగించాడు” అని చెప్పాడు సుమంతుడు.