మహారాజా! ఇపుడొక సప్తమీ కల్పాన్ని వర్ణిస్తాను విను. మాఘ శుద్ధ సప్తమినాడు సంకల్పం చేసుకొని సూర్యభగవానుని ‘వరుణదేవ’ నామంతో పూజించాలి అష్టమినాడు తిలలు, పిష్టం, బెల్లం, అన్నాలతో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించాలి. దీనివల్ల అగ్నిష్టోమయజ్ఞ ఫలం ప్రాప్తిస్తుంది.
మిగతా మాసాల్లో ఇలా చేయాలి:
ఇదే విధంగా ఇవే సూర్యనామాలతో కృష్ణ సప్తమి రోజుల్లో కూడా ఈ వ్రతాన్ని చేయాలి. ఇలా ఒక ఏడాది చేశాక ఒకటి, రెండు లేదా నాలుగు హస్తాల ఎఱ్ఱచందన మండలాన్ని తయారుచేసి దానిలో సిందూరం, ఎఱ్ఱమన్నులతో సూర్యమండలాన్ని నిర్మించాలి - కమలాది రక్తపుష్పాలతో శల్లాకి వృక్షపుజి గురు నుండి చేయబడ్డ ధూపంతో అనేక నైవేద్యాలతో సూర్యభగవానుని పూజించాలి. అన్నంతో స్వర్ణంతో నింపిన కలశలను దానికెదురుగా స్థాపించాలి. అగ్నిని సంస్కరించి తిలలు, నేయి, బెల్లం, జిల్లేడు సమిధలను హవనం ఆకృష్ణేన (యజు. 33/43) మంత్రంతో ఒకవేయి ఆహుతులతో చేయాలి. అనంతరం పన్నెండు గురుబ్రాహ్మణులకు ఒక్కొక్క దూడతోడి గోవును, ఎఱ్ఱబట్టలను, గొడుగును, చెప్పుల జతను, దక్షిణలను ఇచ్చి భోజనం పెట్టి క్షమాభిక్ష వేడాలి. అప్పుడు ప్రతి మౌనంగా భోంచేయాలి.
ఈ ప్రకారంగా(ఈ ప్రకారంగా ఇదే పేరుతో బ్రాహ్మపర్వంలో ఒక వ్రతం చెప్పబడింది. అది వేరు.) ఉభయ సప్తమి చేయువారు నిరోగులై, కుశలవక్తలై, రూపవంతులై, దీర్ఘాయువుతో వర్ధిల్లగలరు. ఇది సమస్త అశుభాలనూ దూరంచేసి దేహాంతంలో సూర్యలోక నివాసాన్ని కూడా ప్రాప్తింపజేస్తుందని నారదమహర్షి ఒక సందర్భంలో చెప్పియున్నాడు.”