శ్రీకృష్ణుడిలా చెప్పసాగాడు. వత్సా! దివాకరభగవానుని మరొక పూజావిధానముంది, ఆలకించు. ఒక వేదిపై అష్టదళ కమలయుక్త మండలాన్ని నిర్మించి అందులో కాలచక్ర కల్పనను గావించాలి. దానికి పన్నెండు ఊచలుండాలి. ఇదే సర్వాత్మయు, సర్వదవశ్రేష్ఠుడును, ఉజ్జ్వల కిరణ యుక్తుడునునగు ఖఖోల్కనామక సూర్యదేవుని రూపం. ఇందులో వేయి కిరణాలు నాలుగు భుజాలు గల సూర్యదేవునుంచి పూజించాలి. ఈయనకు పశ్చిమంలో అరుణుడు, దక్షిణంలో నిక్షుభాదేవి, కాస్త ఎడంగా రేవంతుడు, ఉత్తరంలో పింగళుడు, సంజ్ఞాదేవిలను నిర్మించి పూజించాలి. ద్వితీయావరణంలో తూర్పున ఆకాశునికీ, దక్షిణాన దేవికీ, పశ్చిమంలో గరుడునికీ, ఉత్తరదిశలో నాగరాజుఐరావతునికీ పూజలు చేయాలి. ఆగ్నేయంలో హేలి, నైరృతిలో ప్రహేళి, వాయువ్యంలో ఊర్వశి, ఈశాన్యకోణంలో వినతాదేవిలకు పూజ చేయాలి.
తృతీయావరణంలో తూర్పున శుక్రునీ, పశ్చిమంలో శనినీ, ఉత్తరంలో బృహస్పతినీ, ఈశాన్యంలో బుధునీ, ఆగ్నేయంలో చంద్రునీ పూజించాలి. నైరృతి వాయవ్యాలలో రాహుకేతువులను పూజించాలి. నాలుగవ ఆవరణలో లేఖక, శాండిల్య, యమ, విరూపాక్ష, వరుణ, వాయుపుత్ర, ఈశాన, కుబేరాదులను వారి వారి దిశలలో పూజించాలి. అయిదవ ఆవరణలో పూర్వాదిక్రమంలో మహాశ్వేత, ఋద్ధి, విభూతి, ధృతి, ఉన్నతి, పృథ్వి, మహాకీర్తి, మున్నగు దేవతలను పూజించాలి. ఇంద్ర, విష్ణు, అర్యమ, భగ, పర్జన్య, వివస్వాన్, అర్క, త్వష్టాది ఆదిత్యుల పూజ ఆరవ ఆవరణలో గావించాలి. శిర, నేత్ర, అస్త్ర, శస్త్ర యుక్త రథసహిత సూర్యుని ఏడవ ఆవరణలో అర్చించాలి. యక్ష, గంధర్వ, మాసాధిపతి, సంవత్సరాదులకు కూడా పూజలు నిర్వర్తించాలి.
ఆ తరువాత భాస్కర భగవానులకు పుష్పగంధాదులతో విధి విధానానుసారం పూజ చేసి ఓం ఖఖోల్కాయనమః అనే మూల మంత్రంతో తన అంగాలను స్పృశించుకోవాలి. అంటే హృదయన్యాస సహిత పూజను గావించాలి. ఎవరైతే ఇలా నిత్యం గాని ఇరు పక్షాలలో సప్తమి దినాలందు గాని సప్తావరణ పూజనం చేస్తారో వారికి పరమపదం ప్రాప్తిస్తుంది.
Summary of chapter 82 of the Bhavishya Purāṇa is as follows:
The Āditya-vāra Kalpa — the section of the Saptamī Kalpa devoted specifically to Sunday worship — opens with the Nanda-vidhi, the worship procedure appropriate when Sunday falls on a Nandā tithi (the first, sixth, or eleventh of the fortnight). This configuration creates a particularly joyful and auspicious energy, and the worship procedure emphasises the celebratory aspects of Sūrya worship: abundant flowers, sweet food offerings, music, the wearing of new clothes, and the distribution of sweets to children. The Nanda configuration of Sunday is particularly propitious for beginning new ventures, making major purchases, and celebrating family milestones, and the chapter provides specific mantras for invoking Sūrya's blessing on each type of new beginning.