“విప్రవరా! స్త్రీ పురుషుల లక్షణాలను తెలిపే గ్రంథం మరల కార్తికేయునికి లభించిందా? నాకా లక్షణములను సవిస్తరంగా తెలుప ప్రార్థన.”
అడిగాడు శతానీకుడు చెప్తున్నాడు సుమంతుడు.
“రాజేంద్రా! ప్రజా క్షేమం కోసం కార్తికేయుడు క్రౌంచ పర్వతాన్ని తుత్తునియలు చేసినపుడు బ్రహ్మదేవుడు మిక్కిలి ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. “స్త్రీ, పురుష లక్షణాలపై నేను చేయదలుచుకున్న లక్షణయుక్తి పరమేశ్వరుని వల్ల ఆగిపోయింది. నేను చేసిన సిద్ధాంతాలను నేనే మరచిపోయాను. తమరు నాకు ఆ విషయంపై సంపూర్ణ జ్ఞానాన్నందజేయమని నా ప్రార్థన.” అని కోరుకున్నాడు కార్తికేయుడు.
సాముద్రికంలో నున్న మొత్తం లక్షణాలను చెప్పసాగాడు బ్రహ్మ ఇలా: ఉత్తమ, మధ్యమ, అధమ - అని స్త్రీ పురుషులను మూడు ప్రకారాలుగా పేర్కొనవచ్చును.
ముందు పురుషుల సంగతి చూద్దాం.
నూటయెనిమిది తన చేతివ్రేళ్ళ ఎత్తు అనగా నూటయెనిమిదంగుళాలు అని అనేస్తారు గాని అది సరికాదు. ఏ మనిషి యొక్క పొడవైతే మనం కొలవాలో ఆ మనిషి వ్రేళ్ళతోనే కొలవాలి. అనగా నాలుగు జానల పన్నెండు వేళ్ళున్నవాడు ఉత్తమ పొడగరి. నూరంగుళులు మధ్యమం, తొంభై అధమం.
పాదాలు కోమలంగా, మాంసపుష్టితో, రక్తవర్ణంలో, స్నిగ్ధంగా, ఎత్తుగా, చెమట పట్టకుండా, రక్తనాళాలు, ముడులు కనబడకుండా ఎవనికైతే వుంటాయో అతడు రాజవుతాడు. అరికాలిలో అంకుశ చిహ్నమున్నవాడు సుఖి. అందమైన మడమ, తాబేటి రూపమున్న పాదము, వెచ్చటి శరీరము, రక్తవర్ణములో, ముక్కలు కాకుండా, నల్లగీతలు లేకుండా వుండే గోళ్ళు కూడా రాజ లక్షణాలే. కాలివేళ్ళొక దానికొకటి తగులుతూ వుండడం ఐశ్వర్యలక్షణం. అలా తగలకుండా విడివిడిగా వున్నవాడు, తెల్లగా పారల్లాంటి గోళ్ళు, పాదంపై నరాలు, ముడులు కనిపించేవాడు దరిద్రుడు. నిత్య దుఃఖితుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టి రంగులో పాదాలున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు. నల్లని పాదాలవాడు తాగుబోతు, తెల్లని పాదాలవాడు తిండిబోతు.
కాలిబొటన వేలు దిబ్బగా వుండేవాడు భాగ్యహీనుడు. వికృతంగా వుండేవాడు దుఃఖపీడితుడు. ఆ వేలు వంకరగా, చిన్నదిగా, విరిగినట్టుగా వున్నవాడు కష్టాల పాలవుతాడు.
కాలి చూపుడు వేలు బొటనవేలు కన్నా పెద్దది గలవాడికి స్త్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికెన వేలు సామాన్యం కంటే పెద్దది కలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్ళు పాడైపోయినట్టుగా కనబడేవాడికి శీలముండదు, అలాగని కామభోగమూ లభింపదు.
తొడలపై రోమాలుంటే ధనం నిలువదు. తొడలు చిన్నవిగా నున్నగా వుంటే ఐశ్వర్యం పడుతుంది. కాని బంధనాల్లో వుండిపోతుంది. లేడితో సమానమైన జంఘలు రాజ్యాన్ని తెస్తాయి. పొడవుగా, దిబ్బగా, పుష్టిగా వుండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహపు తొడలవాడు ధనికుడు కాగలడు. మోకాలు మాంస రహితంగా వున్నవానికి పరదేశమరణం ప్రాప్తిస్తుంది. వికట జానువు దరిద్రహేతువు. మోకాళ్ళు కాస్త కిందికి వున్నవాడు ఏ ఆడదాన్నయినా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు రాజవుతాడు. శ్రేష్ఠమైన పశు, పక్షి (సింహం, ఏనుగు, హంస) గమనము గలవాడు రాజు గాని గొప్ప ధనికుడు గాని కాగలడు.
కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడవుతాడు. ఎరుపు, నలుపు కలగలిపిన రుధిర వర్ణమున్నవాడు అధముడు, పాపకర్ముడు కాగలడు. పగడపు రంగులోనుండి తేటగా మెరిసే రక్తము గలవాడు ఏడు ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడి లేదా నెమలిపొట్ట ఉత్తమపురుష లక్షణము. పులి, సింహము లేదా కప్ప వంటి కడుపు రాజలక్షణము. పులి వంటి పీఠము సేనాపతి లక్షణము. సింహము పీఠము వంటి పీఠము అంటే పొడవుగా వుంటే బంధనము లెక్కువవుతాయి. తాబేలు పీఠము సకలైశ్వర్యసంపన్న లక్షణము. విశాలంగా, ఎత్తుగా, పుష్టిగా, రోమయుక్తమై యున్న వక్షఃస్థలము గల పురుషుడు శతాయువు, ధనవంతుడునై అన్ని భోగాలనూ అనుభవించగల అదృష్టవంతుడు కాగలడు.
చేతిలో మీనరేఖ గలవాడు గొప్పకార్యసాధకుడు, ధనవంతుడు, పుత్రవంతుడు కాగలడు. తుల, వేది చిహ్నమున్నవాడు వ్యాపారంలో లాభాన్నార్జించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నచో యజ్ఞం చేస్తాడు. పర్వత, వృక్ష చిహ్నాలున్నవాని వద్ద లక్ష్మి స్థిరంగా వుంటుంది. అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలము, బరిసె, బాణము, తోమరము, ఖడ్గము లేదా ధనుస్సు వంటి చిహ్నమేదైనా అరచేతిలో గలవాడు యుద్ధవిజయుడు. ధ్వజం కాని శంఖంగాని వుంటే సముద్ర, ఆకాశయానం చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తాడు. శ్రీవత్సం, కమల, వజ్ర, రథ లేదా కలశచిహ్నమున్న పురుషుడు శత్రురహితుడైన రాజు కాగలడు. కుడిచేతి బొటనవేలిలో యవధాన్యపు గుర్తున్నవాడు అన్ని విద్యలలోనూ ఆరితేరినవాడవుతాడు. ప్రవక్త కూడా కాగలడు. చిటికెన వేలి క్రింది నుండి చూపుడు వేలి మధ్యదాకా ఆగకుండా పయనించే రేఖ గలవాడు వందేళ్లదాకా జీవిస్తాడు. పాము పొట్ట కలవాడు అధికభోజనుడు, దరిద్రుడు అవుతాడు. విశాలంగా, వెడల్పుగా, గంభీరంగా గుండ్రంగా నున్ను బొడ్డు గల పురుషునికి ధన ధాన్యాలు, సకలభోగాలూ ఉంటాయి. పొట్టిగా, నీచంగా నాభి వుంటే ఎన్నో దుఃఖాలు సంక్రమిస్తాయి. బలికి(బలిఅనగా = సన్నటి మడత) క్రింద, విషమంగా వుండే బొడ్డు గలవానికి ధనహాని కలుగుతుంది. దక్షిణావర్తనాభి బుద్ధికీ ఎడమవైపు బొడ్డు శాంతికీ సూచనలు. నూరు దళాల కమలానికి వుండే కర్ణికలాటి నాభి మహారాజలక్షణము. పొట్టలో ఒక సన్నటి మడత వున్నవాడు శస్త్రంచే చంపబడతాడు. రెండున్నవాడు స్త్రీ భోగి, మూడున్నవాడు రాజు లేదా ఆచార్యపీఠము, నాలుగున్నవాడు అనేక పుత్రవంతుడు అవుతారు.
భుజాలు గట్టిగా, పుష్టిగా, సరిసమానంగా వున్న నరుడు రాజవుతాడు. సుఖపడతాడు. వక్షస్సు ఉన్నతంగా, సాపుగా, పుష్టిగా, విశాలంగా వున్నవాడు రాజ సమానుడవుతాడు. దట్టమైన రోమాలుండి ఎగుడు దిగుళ్ళుగా నుండి ఆర్చుకుపోయినట్లుండే వక్షం దరిద్రుడికుంటుంది. వక్షం రెండువైపులా సమానంగా ధనవంతుడికుంటుంది. పుష్టిగా వుండే వక్షఃస్ధలం శూరవీర లక్షణం. గడ్డము వంకరగా వుండేవాడు ధనహీనుడు. ఉన్నతంగా సమానంగా వుండేవాడు భోగి. బలంగా లేకుండా అణిగియున్నట్లుగా కనిపించే మెడ ధనహీనుని లక్షణం. ఎద్దు మెడలాగా పుష్టిగా వుండే మెడ శూర, వీర లక్షణం. లేడి మెడవాడు దానిలాగే పిరికివాడుగా వుంటాడు. సమాన గ్రీవం రాజలక్షణం. చిలుక, ఒంటె, ఏనుగు, కొంగల్లాగా పొడవుగా వుండి, శుష్కించినట్లుండే మెడగల వాని వద్ద ధనము నిలువదు. చిన్నమెడ వాడు ధనికుడు, భోగి కాగలడు. పుష్టి, దుర్వాసనలేమి, సమత, చిన్నరోమాల కలిమి బాహుమూలములకు మంచి లక్షణాలు. అలాంటివి గలవాడు ఐశ్వర్యవంతుడు.
భుజాలు పైకి లాగబడినట్లుండేవాడు బంధనాల్లో పడతాడు. చిన్నభుజాలు దాసుడికీ,ఎగువ దిగువ భుజాలు దొంగకీ వుంటాయి. ఆజానుబాహువులు సర్వశుభ లక్షణం. చేతిపై భాగంలో గోతులున్న వానికి పిత్రార్జితం లభించదు. పిరికితనం కూడా వుంటుంది. ఎత్తుగా వుండే కరతలమున్నవాడు దాని కాగలడు. కరతలం విషమంగా వుండే వాడి జీవితం కూడా కలిమిలేముల మయమవుతుంది. లక్కవలె ఎర్రనైన కరతలముకలవాడు రాజవుతాడు. పచ్చనైన కరతలము కలవాడికి జీవితంలో ఒక గమ్యముండదు. అదే నల్లగా, నీలంగా వుంటే మత్తు పదార్థాలు సేవించే వాడవుతాడు, గరుకుగా వుంటే నిర్ధనుడౌతాడు.
చంద్రమండలము వంటి ముఖమున్న వాడు ధర్మాత్ముడు. తొండం ఆకారంలో ముఖమున్నవాడు భాగ్యహీనుడు. వంకరగా, ముక్కల నతికినట్లుగా, సింహం ముఖం వలె ముఖమున్నవాడు దొంగ కాగలడు. సుందరమై, కాంతియుక్తమై, మంచిజాతి ఏనుగువలె పరిపుష్టమైన వదనము రాజలక్షణము. గొఱ్ఱె, కోతి ముఖ కవళికలు ధనవంతుని కుంటాయి. సాధారణం కంటె పెద్ద, చిన్న, పొడవు క్రమంగా దరిద్ర, మూర్ఖ, పాపాత్మ ముఖ లక్షణాలు. ఆడదాని ముఖం దింపుడు కనులతో వుండే వానికి పుత్ర సంతాన ముండదు, ఉన్నా మిగలదు. నాలుగు కోణముల ముఖమున్నవాడు ధూర్తుడు.
కమలదళాలవలె కోమలములై కాంతివంతములైన కపోలాలు కలవాడు జీవితంలో కూడా శ్రేష్ఠకాంతులతో ప్రకాశిస్తాడు, ధనవంతుడై, కృషితో పై కొస్తాడు. సింహ, శార్దూల లేదా గజేంద్ర కపోలములు రాజలక్షణాలు. అవి వున్నవారికి వివిధ భోగాలు, సంపదలు, సేనలు, సేవకదళాలు ఉంటాయి. బాగా ఎర్రగా వుండే క్రింది పెదవి కలవాడు పాలకుడవుతాడు. కమలకోమలాధరుడు ధనవంతుడు. దిబ్బగా, ఎండినట్లున్న పెదవులు గలవాడు నిత్యదుఃఖితుడు.
మాంసరహితమైన చెవులున్నవాడు యుద్ధంలో మరణిస్తాడు. చప్పిడి చెవులు రోగికి, చిన్నవి లోభికి, శంఖం లాగుండేవి రాజుకి, ఎక్కువ వెంట్రుకలుండేవి దీర్ఘజీవికి సంకేతాలు. పెద్దగా, పుష్టిగా, పొడవుగా వుండే చెవులు దైవ, బ్రాహ్మణ భక్తుడైన రాజుకుంటాయి. చిలకముక్కులాటి ముక్కుగలవాడు సుఖజీవికాగా ఎండిన ముక్కు కలవాడు దీర్ఘజీవి కాగలడు. పలుచని ముక్కు రాజుకి, పొడవైనది భోగికి, చిన్నది ధర్మశీలికి, సూది ముక్కు వ్యాపార విజేతకి వుంటాయి.
మల్లెమొగ్గలవంటి దంతశ్రేణి కాంతులున్న వాడు రాజు కాగలడు. ఏనుగు దంతం రంగులో నుండి మృదువుగా నున్నగా వుండే పలువరుస గలవాడు సద్గుణవంతుడు. ఎలుగు లేదా కోతిపళ్ళున్నవాడు నిత్యము ఆకలితో గోలపెడుతుంటాడు. ముక్కలై ఖాళీలున్న దంతములున్నవానికి కలతలతోనే కాపురము. ముప్పది రెండు పళ్ళూ లక్షణంగా వున్నవాడు రాజు, ముప్పదియొకటైతే భోగి, ముప్పదైతే సుఖదుఃఖాలు సమానంగా అనుభవించేవాడు, ఇరవై తొమ్మిది దంతాలే వుంటే ఎక్కువ కష్టజీవి కాగలరు. నల్లగా గాని చిత్రమైన రంగులో గాని వుండే నాలుక గలవాడు దాస్యవృత్తితో జీవిస్తాడు. దిబ్బగా, మాడినట్లున్న నాలుక గలవాడు క్రోధి. శ్వేతవర్ణపు నాలుక కలవాడు పవిత్రంగా, సదాచరణ సంపన్నుడై వెలుగుతాడు. కొంచెం క్రిందికి వంగి, స్నిగ్ధంగా, అగ్రభాగం రక్తవర్ణంలో నుండి, పలుచని, చిన్ననాలుక గలవాడు విద్వాంసుడు కాగలడు. కమలపు ఆకువలె పలుచగా, పొడవుగా, మరీ సన్నంగా చిన్నదిగా మోటుగా కాకుండా వుండే జిహ్వ రాజలక్షణము. ముక్కలైనట్లుండి, కరకుగా కనిపించే తాలువు అనగా అంగిలి గలవాడు చెడ్డవాడు. నల్లని తాలువు గలవాడు కుల నాశకుడు. సింహ, గజ సమాన తాలువు రాజులక్షణము. తెల్లని తాలువు గలవాడు ధనవంతుడు.
కంఠస్వరము హంసధ్వనితోనో మేఘగర్జనతోనో సమానంగా కలవాడు ధన్యుడు. క్రౌంచ పక్షి కూత వంటి గొంతు రాజుకి, ధనికీ, సర్వసుఖ భోగికీ వుంటుంది. ధర్మవత్సలుడై ధన్యుడైన రాజుకి చక్రవాకి స్వరముంటుంది. దుందుభి స్వనం కూడా రాజలక్షణమే. పెద్దచప్పుడు వచ్చే గొంతున్నవారు, పశువుల అరుపుల్లాటి ధ్వనులు గల కంఠధ్వని గలవారు సుఖపడరు. నీలకంఠ పక్షి స్వరమున్నవాడు భాగ్యవంతుడు, పగిలిన కంచు పాత్ర మోతలాటి గొంతున్నవాడు అధముడు కాగలరు.
దానిమ్మపూవు (ఈ సమానత రంగులోనా, పూరేకు ఆకారంతోనా, చూడవలసి వుంది.)తో సమానమైన నేత్రములున్నవాడు రాజు కాగలడు. పులికన్నులవాడు ముక్కోపి, ఎండ్రి కన్నులవాడు జగడాలమారి, పిల్లి లేదా హంస కన్నులున్నవాడు అధముడు అవుతారు. తేనె రంగు పింగళవర్ణము కలిసిన కనుల ఛాయ గల వానిని లక్ష్మి ఎప్పుడూ విడచిపెట్టదు. గోరోచనము, గురిగింజ, హరతాలము కలిపిన పింగళవర్ణమున్న కన్నులవాడు బలవంతుడు, ధనవంతుడు కాగలడు. లలాటము అర్ధచంద్రాకారంలో వుంటే రాజు కాగలడు. పెద్ద నుదురు ధన సూచకము. చిన్న నుదురు ధర్మాత్మునికుంటుంది. లలాటమధ్యంలో అయిదు అడ్డరేఖలున్నవారు నూరేళ్ళు ఐశ్వర్యవంతులై జీవిస్తారు. నాలుగే వుంటే ఎనుబది, మూడుంటే డెబ్బది, రెండుంటే అరవై, ఒకే రేఖ వుంటే నలభై సంవత్సరాలు జీవిస్తారు. నుదుటిపై ఒక రేఖా లేనివారికి పాతికేళ్ళే ఆయుర్దాయము. ఈ రేఖలు చిన్నవిగా వుండే వ్యక్తికి ఆరోగ్యముండదు. లలాటంలో త్రిశూలంగాని పట్టిసముగాని చిహ్నంగా వున్నవాడు గొప్ప ప్రతాపవంతుడు. కీర్తి సంపన్నుడైన రాజు కాగలడు. గోళాకారమై సమమైన పొడవు వెడల్పులున్న తలగలవాడు సుఖపడతాడు. ఏనుగుతల ఆకారంలో శిరస్సు గలవాడు రాజ సమానుడు. విరలంగా, స్నిగ్థమై, కోమలమై, తుమ్మెదల లేదా కాటుక రంగులో నున్న కేశములు గలవాడు. అన్ని సుఖాలు అనుభవిస్తాడు, రాజు కాగలడు. కరుకుగా బెరుకుగా వుండే కేశాలున్నవాడు, ముందు వైపు ముక్కలగు కేశాలున్నవాడు దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తారు.”
Summary of chapter 17 of the Bhavishya Purāṇa is as follows:
The specific worship procedure for Brahma on the Pratipat tithi is given in liturgical detail. The pañcagavya abhiṣeka — the bathing of the Brahma image with the five pure products of the cow: milk, curd, ghee, urine, and dung — is described step by step with its accompanying mantras. The nyāsa procedure, by which the worshipper places the divine presence in the various parts of the image and of his own body, is detailed. The chapter declares the Gāyatrī Mantra as the supreme mantra for the Pratipat pūjā, affirming once again that this twenty-four syllable mantra contains within it the totality of Brahma's grace. The worshipper who performs this pūjā faithfully on every Pratipat is said to obtain Brahma-loka.