భవిష్య మహా పురాణము
17-18 - వివిధకర్మల్లో అగ్నినామాలు - హోమద్రవ్యాలు
మునులారా! నేను (సూతమహర్షి) ఇప్పుడు శాస్త్ర సమ్మత విధ్యనుసారము చేయబడే వివిధ యజ్ఞాలలో అగ్ని ధరించే నామాలను పేర్కొనుచున్నాను. శతార్ధ - హోమంలో, అయిదువందల సంఖ్యదాకా ఆహుతులుండే యజ్ఞంలో అగ్నిని కశ్యపనామంతో పిలుస్తారు, ఈ హోమాలలోనే ఆజ్యహోమంలో విష్ణువని, తిలయాగంలో వనస్పతియని, సహస్ర యాగంలో బ్రాహ్మణయని, అయుతయాగంలో హరియని, అక్షహోమంలో వహ్నియని, కోటిహోమంలో హుతాశనయని, శాంతికకర్మాల్లో వరుణయని, మరణ - కర్మలో అరుణయని, నిత్యహోమంలో అనలయనీ, ప్రాయశ్చిత్తంలో హుతాశనయని. అన్నయజ్ఞంలో లోహితయనీ పిలుస్తారు.
దేవప్రతిష్ఠలో లోహిత, వాస్తు, మండప పద్మకయాగాల్లో ప్రజాపతి, ప్రపాయాగంలో నాగ, మహాదానంలో హవిర్భుక్, గోదానంలో రుద్ర, కన్యాదానంలో యోజక, తులా - పురుషదానంలో ధాతరూపాల్లో అగ్నిదేవుడుంటాడు. అలాగే అగ్నికి వృషోత్సర్గంలో సూర్య, వైశ్వదేవ కర్మలో పావక, దీక్షాగ్రహణాల్లో జనార్దన, ఉత్పీడనంలో కాల, శవదాహంలో కవ్య, పర్ణదాహంలో యమ, అస్థిదాహంలో శిఖండిక, గర్భాదానంలోమరుత్, సీమంతంలో పింగళ, పుంసవనంలో ఇంద్ర, నామకరణంలో పార్థివ, నిష్క్రమణంలో హాటక, ప్రాశ్నంలో శుచి, చూడాకరణంలో షడానన, వ్రతోపదేశంలో సముద్భవ, ఉపనయనంలో వీతిహోత్ర, సమావర్తనంలో ధనంజయ, ఉదరంలో జఠర, సముద్రంలో బడబానల, శిఖలో విభు, స్వరాది శబ్దాలలో సరీసృప నామాలతో విరాజిల్లుతుంటాడు. అలాగే అశ్వాగ్నిని మంథరుడని, రథాగ్నిలో జాతవేదుడని, గజాగ్నిలో మందరుడని, సూర్యాగ్నిలో వింధ్యుడని, తోయాగ్నిలో వరుణుడని, బ్రాహ్మణాగ్నిలో హవిర్భుక్‌యని, పర్వతాగ్నిలో క్రతుభుక్‌యని అగ్నిని పిలుస్తారు. దావాగ్ని స్థితాగ్ని సూర్యదేవునిగా, దీపాగ్నిస్థితాగ్ని పావకునిగా, గృహాగ్నిలో ధరణీపతిగా, ఘృతాగ్నిలో నలునిగా, సూతికాగ్నిలో రాక్షసునిగా అగ్నిదేవుడు సంభావింపబడుతున్నాడు.
హోమంలో ఉపయోగింపబడే ద్రవ్యాలకి నిశ్చిత ప్రమాణాలుంటాయి. ప్రమాణాలు లేని ద్రవ్యాలను వేసి ఎంత హోమం చేసినా ఫలముండదు. కాబట్టి శాస్త్రప్రమాణాలను తెలుసుకొని హోమం చెయ్యాలి.
Summary of chapter 119 of the Bhavishya Mahā Purana is as follows:
The dīpadāna — the offering of a lit lamp to Sūrya — is identified as one of the simplest and most powerful acts of Sūrya worship. Each lamp offered carries its specific fruit: a ghee lamp grants wisdom and knowledge; a sesame-oil lamp grants liberation from the ancestral cycle; a castor-oil lamp grants health and healing; a camphor lamp grants purity of the sense organs. The manner of the offering — how the lamp is held, what prayer is spoken, how many times it is waved before the image — is specified. The chapter then catalogues the extraordinary post-mortem fruits of sustained dīpadāna practice: the devotee who has offered lamps to Sūrya throughout a lifetime finds the path after death brightly lit, and the darkness of the intermediate state (antara-gati) is completely dispelled by the accumulated light of the offered lamps.