భవిష్య మహా పురాణము
34 - కాటేయబడిన మనిషి లక్షణాలు
కాల సర్పంచే కాటు వేయబడిన మనిషి లక్షణాలిలా వుంటాయి. నాలుక ముక్కలై పోయినట్లుంటుంది. గుండెలో నొప్పి వస్తుంది, కనులు పొరలు వేసేస్తాయి. దంతాలూ, శరీరమూ ఉడకబెట్టిన కూరగాయ లాగైపోతాయి. అన్ని అంగాలు శిథిలమై పోతాయి. మూత్రాదులు పోతుంటాయి. భుజాలూ, మెడా, నడుము వంగిపోతాయి, ముఖం కిందికి దిగుతుంటుంది. కనులు పైకిపోతుంటాయి. వెక్కిళ్ళు వస్తాయి. శస్త్రంతో పొడిచినా రక్తం ప్రవహించదు, ఆయాసం వస్తుంది. శరీరం పచ్చగా అయిపోతుంటుంది. ఈ లక్షణాలొక్కటే కనిపిస్తుంటాయి. మృత్యువాసన్నమయ్యేలోగానే ఇది కాలసర్పపు కాటు అని పోల్చవచ్చు. ఇంతేకాక గాయం వెడల్పుకావడం, చెమట ఎక్కువగా పట్టడం, మాటలు ముక్కులోంచి రావడం, పెదాలు అతుక్కుపోవడం, గుండెలో వణకుపుట్టడం, అద్దంలో గాని నీటిలో కాని ప్రతిబింబం కనబడకపోవడం, సూర్యునిలో తేజం కనబడకపోవడం ఇవన్నీ కాలసర్పం కాటు లక్షణాలే.
అష్టమి, నవమి, కృష్ణ చతుర్దశి, నాగపంచమి రోజుల్లో పాము కాటేసిన వారిని బతికించడం దాదాపు అసాధ్యం. ఆర్ర్థ, అశ్లేష, మఘ, భరణి, కృత్తిక, విశాఖ, త్రిపూర్వాలు, మూల, స్వాతి, శతభిష నక్షత్రాల్లోని సర్పదష్టుని కూడా బతికించడం అసాధ్యమే. ఖండహారంలో, శ్మశానంలో, ఎండిన చెట్టు కింద పాము కరిచినవారూ బతకరు.
మానవశరీరంలో నూటయెనిమిది మర్మస్థానాలుంటాయి. వీటిలో నుదుటి యెముక, కన్నులు, భ్రూమధ్యం, వస్తి (పొత్తికడుపు), భుజాలు, వక్షం, తాలు గడ్డము అనే వాటిలో ఎక్కడ పాముకాటు వేసినా ఆయుధం తగిలినా మనిషి బతకడం వుండదు.
వైద్యుని పిలవడానికి వెళ్ళేవాడు ఉత్తమ వర్ణంలో పుట్టిన హీనుడూ కారాదు, హీనవర్ణంలో పుట్టిన ఉత్తముడూ కారాదు. చేతిలో నిత్యం కర్రను పట్టుకునేవాడు, ఇద్దరు దూతలు, నల్లని గాని ఎర్రని గాని దుస్తులు ధరించేవాడు, ఎప్పుడూ ముఖం ముడుచుకొని ధుమధుమలాడుతుండేవాడు, నెత్తిపై అలవాటుగా గుడ్డ వేసుకునేవాడు, విరగబోసుకున్న జుట్టు ఉన్నవాడు, గబగబగా మాట్లాడేవాడు సర్పదష్టుని దూతగా వైద్యుని వద్దకు వెళ్ళడం అశుభాన్నే ఇస్తుంది.
పరమ శివుడొకప్పుడు కశ్యపునికి నాగోత్పత్తి గూర్చిన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. బ్రహ్మ మహా నాగులను నక్షత్రాల అంశలతో సృష్టించాడు. అనంతుడు - సూర్యుడు, వాసుకి -చంద్రుడు, తక్షక - భౌమ, కర్కోటక - బుధ, పద్మ - బృహస్పతి, మహాపద్మ - శుక్ర, కులిక శంఖపాలులు - శనైశ్చర రూపాలతో జనించారు. ఈ క్రిందివి అశుభ కాలాలు. ఆదివారం పదవ పదునాల్గవ యామార్ధములు, సోమవారం ఎనిమిదవ, పన్నెండవ, మంగళవారం ఆరవ, పదవ, బుధవారం తొమ్మిదవ, గురువారం రెండవ, ఆరవ, శుక్ర వారం నాలుగవ, ఎనిమిదవ, పదవ, శనివారం మొదటి, పదహారవ, రెండవ, పన్నెండవ యామార్ధాలు, అశుభకాలాలు. ఆ కాలాల్లో పాముకాటుకి గురైన వారు జీవించరు”
Summary of chapter 23 of the Bhavishya Mahā Purana is as follows:
The worship procedure for propitiating Gaṇeśa when his anger has been incurred — whether through inadvertent offence or astrological affliction — is detailed here. The abhiṣeka of the Gaṇeśa image with sweetened milk, honey, and fragrant waters, accompanied by specific śānti mantras, forms the core of the rite. The chapter also teaches the worship of the nine grahas alongside Gaṇeśa as a means of neutralising planetary afflictions. Particular attention is given to the signs by which one recognises Gaṇeśa's displeasure in dreams — specific animals, specific directions, specific colours appearing in the dream — and the appropriate remedies for each such sign. The chapter concludes with the assurance that Gaṇeśa, once propitiated, removes all obstacles and bestows success in every undertaking.