బ్రాహ్మణోత్తములారా! ఇపుడు నేను వివిధ ప్రకార మాసాలను వర్ణిస్తాను. ఇవి నాలుగు ప్రకారాలు - చాంద్ర, సౌర, సావన, నక్షత్ర. శుక్ల పాడ్యమి నుండి అమావాస్య దాకా చంద్రమాసమనబడుతుంది. సూర్యుడొక సంక్రాంతి నుండి మరొక సంక్రాంతిలో ప్రవేశించే దాకా సాగేకాలం సౌరమాసమనబడుతుంది. పూర్తిగా ముప్పది దినాలు సావనమాసం. అశ్విని నుండి రేవతి దాకా కాలం నక్షత్రమాసం. ఒక సూర్యోదయకాలం నుండి మరొక సూర్యోదయం దాకా పట్టే కాలాన్ని సావనదినమంటారు. ఒక తిథిలో చంద్రుడెంత సేపుంటాడో ఆ కాలం చాంద్రదివసమవుతుంది. రాశిలో మూడవభాగం సౌరదినం. ఒక దినము (పగలు) ఒక రాత్రి కలిపి అహోరాత్రమవుతుంది. ఏతిథి నుండైనా మొదలెట్టి ముప్పది దినములను లెక్కపెట్టగా వచ్చేకాలం సావన - మాసమనబడుతుంది. ప్రాయశ్చిత్తాలలో, అన్నప్రాశ్నకూ, మంత్రోపాసనకూ, రాజకర - గ్రహణానికీ, వ్యవహారాల్లో, యజ్ఞాలలో, దినగణనాదులకూ సావన - మాసమే గ్రహింపబడుతున్నది. వివాహాది సంస్కారాలకూ, యజ్ఞవ్రతాది సత్కర్మలకు, స్నానాదులకూ సౌరమాసాన్ని గ్రహిస్తారు. పార్వణలకు, అష్టకాశ్రాద్ధాలకు, సాధారణ శ్రాద్ధాలకు, ధార్మిక కార్యాదులకూ చాంద్ర మాసము ననుసరిస్తున్నారు. చైత్రాదిమాసాలలో తిథిని బట్టి విహితమైన కర్మలను చాంద్ర మాసం లెక్క ప్రకారం చేయాలి. సోమ, పితృగణ కార్యాదులను నక్షత్ర మాసానుసారం చెయ్యడం ప్రశస్తం. చిత్రా నక్షత్రయోగంతో చైత్రీ పూర్ణిమ వస్తుంది. దాని పేరిట చైత్ర మాసమేర్పడింది. చైత్రాది పన్నెండు చాంద్రమాసాలూ ఆయా నక్షత్రాల పేరిటనే వ్యవహరింపబడుతున్నాయి.
ఏ నెలతోనైతే పౌర్ణమి యోగించదో, ఆ నెల ప్రజలకూ, పశువులకూ అహితకారి. ఏ ముప్పదిరోజుల్లో సంక్రమణముండదో దానిని మలిమ్లుచ, మలమాస, అధికమాస, పురుషోత్తమమాస నామాలతో పిలుస్తారు. దీనితో సూర్యునికెటువంటి సంక్రాంతీ వుండదన్నమాట. ఇది ముప్పది రెండు మాసములకొక మారు రావచ్చు. ఈ మాసంలో ప్రేత - క్రియలనూ, సపిండన క్రియలనూ చేసుకోవచ్చు. ఈ కాలంలో యజ్ఞ, వివాహాది క్రియలు జరుగవు. తీర్థస్నానాలు, దేవదర్శనాలు, వ్రతాలు, ఉపవాసాలు, సీమంతోన్న యనము, ఋతుజశాంతి, పుంసవన, పుత్రాదిక ముఖదర్శనము - చేయవచ్చు. వ్రతారంభం, ప్రతిష్ఠ, చూడాకర్మ, ఉపనయనం, మంత్రోపాసన, వివాహము, నూతన గృహనిర్మాణము, గృహప్రవేశము, ఆవులను గ్రహించుట, ఆశ్రమాంతరంలో ప్రవేశం, తీర్థయాత్ర, అభిషేక కర్మ, వృషోత్సర్గము, యజ్ఞయాగాదులు - ఇవన్నీ మలమాసంలో నిషిద్ధాలు. అలాగే శుక్రస్త, దాని వార్థక్య, బాల్యత్వములపై కూడా నిషేధముంటుంది. కర్కరాశిలోకి సూర్యుడు రాగానే భగవంతుడు శయనిస్తాడు, తుల రాశిలోకి రాగానే నిద్రను త్యజిస్తాడు.
Summary of chapter 123 of the Bhavishya Purāṇa is as follows:
The procedure for drawing the sacred geometric diagram — the maṇḍala — that serves as the ritual ground for Sūrya worship is described. The maṇḍala is drawn on a freshly purified floor using rice flour, turmeric, and red and white powders. Its structure represents the solar cosmos: Sūrya at the centre, the twelve Ādityas in the twelve outer positions, the seven horses in seven peripheral positions. The procedure for drawing each element — the lines, the lotus petals, the outer boundary — is given with its accompanying mantras. The completed maṇḍala is then used as the base for the pūjā: the image of Sūrya is placed at the centre, and all offerings are made within the sacred geometric space that the maṇḍala has established.