భవిష్య మహా పురాణము
175 - 180 - శాంతిక కర్మ - అభిషేక విధి
గరుత్మంతుడిలా అడిగాడు, ‘అరుణా! ఆధి - వ్యాధి పీడితులు, రోగులు, దుష్టగ్రహాలచే పీడితులు,శత్రువులచే తాడితులు తమను తామే ఉద్ధరించుకోవాలంటే ఏం చెయ్యాలి. ?’
‘వైనతేయా! వివిధరోగ పీడిత, శత్రుసంతప్త వ్యక్తులకు సూర్యారాధనే తప్ప మరోదారిలేదు. వీరేకాదు ఎటువంటి ఆపదలకు లోనైన వారైనా సూర్యునారాధిస్తే సుఖిస్తారు.
1. అష్టదిక్పాలకులకాహుతులు ‘స్వాహా’ అనగానే ఆహుతివ్వాలి
ఆర్తక దేహరూపాయ రక్తాక్షాయ మహాత్మనే ।
ధరాధరాయ శాంతయ సహస్రాక్ష శిరాయచ ।
అధోముఖాయ శ్వేతాయ స్వాహా
చతుర్ముఖాయ పద్మాసన గతాయచ।
పద్మవర్ణాయ వేదాయ కమండలు ధరాయచ ।
ఊర్ధ్వముఖాయ స్వాహా
హేమవర్ణాయ దేహాయ ఐరావత గజాయచ।
సహస్రాక్ష శరీరాయ పూర్వదిశ్యున్ముఖాయచ।
దేవాధిపాయ చేంద్రాయ విహస్తాయశుభాయచ ।
పూర్వవదనాయ స్వాహా
దీప్తాయవ్యక్త దేహాయ జ్వాలమాలా కులాయచ ।
ఇంద్రనీలాభ దేహాయ సర్వారోగ్యకరాయచ ।
యమాయ ధర్మరాజాయ దక్షిణాశా ముఖాయచ ।
కృష్ణాంబరధరాయ స్వాహా
నీలజీమూతవర్ణాయ రక్తాంబరధరాయచ ।
ముక్తాఫలశరీరాయ పింగాక్షాయ మహాత్మనే।
శుక్లవస్త్రాయ పీతాయ దివ్యపాశ ధరాయచ ।
పశ్చిమాభిముఖాయ స్వాహా
కృష్ణపింగళ నేత్రాయ వాయవ్యాభి ముఖాయచ ।
నీలధ్వజాయ వీరాయ తథా చేంద్రాయ వేధసే ।
పవనాయ స్వాహా
గదాహస్తాయ సూర్యాయ చిత్రస్త్రగ్భూషణాయచ।
మహోదారాయ శాంతాయ స్వాహాధి పతయేతథా ।
ఉత్తరాభిముఖాయ మహాదేవప్రియాయ స్వాహా
శ్వేతాయ శ్వేతవర్ణాయ చిత్రాక్షాయ మహాత్మనే ।
శాంతాయ శాంతరూపాయ పినాక వరధారిణే ।
ఈశానాభి ముఖాయేశాయ స్వాహా (బ్రాహ్మ 175/18-32)
అపుడు గరుడుడు తన అసలు బాధనిలా బైటపెట్టాడు- ‘ద్విజశ్రేష్ఠా! బ్రహ్మవాదిని శాపంవల్ల నేను పంఖవిహీనుడనైపోయాను. రెక్కలు, విరిగి ఆరోగ్యం చెడివున్న నాకు మరల రెక్కలు, ఆరోగ్యం, ద్విగుణీకృతశక్తి రావాలంటే ఏంచేయాలి?’
‘గరుడా! నీవు శుద్ధచిత్తుడవై అంధకారాన్నీ అనారోగ్యాన్నీ నశింపజేసే జగన్నాథుడైన సూర్యుని పూజనీ, హవనాన్నీ నిర్వర్తించాలి.
‘నేను వికలాంగుడను కదా! సూర్యభగవానుని పూజ, అగ్నికార్యము ఎలా చేయగలను.? నీవే ఏదైనా ఉపాయం చూడాలి.’
‘సరే గరుడా! మహావ్యాధి ప్రపీడితులై దేవకార్య సంపాదనకు సామర్థ్యంలేని వారు ఎవరినైనా ఆ కార్యానికై నియోగించడం శాస్త్రసమ్మతమే. నీ రోగ శాంతికై పావకార్చనను అనగా అగ్ని హోమాన్ని నేను చేస్తాను. ఈ లక్ష హోమం అన్ని పాపాలనూ, విష్నూలనూ, వ్యాధులనూ నశింపజేస్తుంది. ఇది మహాపుణ్య జనకము, శాంతి ప్రదాయకము, అపమృత్యు నివారకము, మహాశుభకారి, విజయప్రదాయకము. ఇది అందరు దేవతలనూ తృప్తి పరుస్తుంది. సూర్యభగవానునికీ పరమ ప్రీతికరము.
ఈ పావకార్చనకై ముందు సూర్యమందిరంలోని ఆగ్నేయమూల నున్న భూమిని ఆవుపేడతో అలికి అగ్నిని స్థాపించి దిక్పాలకులకు ఆహుతుల నివ్వాలి.
ఖగేంద్రా ! ఈ రకంగా విధిపూర్వకంగా ఆహుతులిచ్చిన తరువాత ఓం భూర్భువః స్వాహా అంటూ లక్ష హవనా లివ్వాలి. సౌరమహాహోమంలో ఈ విధియే చెప్పబడింది. భాస్కర భగవానులనుద్దేశించి ఈ హవనాలు చేస్తే అన్ని లోకాలలోనూ సర్వప్రకారాల శాంతికీ ఇది ఉపయోగపడుతుంది. హవనానంతరం నిర్దిష్ట మంత్రాలను చదువుతూ అభిషేకం చేయ్యాలి. ఈ విధంగా గ్రహాలను ప్రార్థించాలి.
‘రక్తకమల సమాననేత్రుడు, సహస్రకిరణుడు, సప్తాశ్వరథికుడు, సిందూరసదృశ రక్తతేజుడు, సర్వదేవ నమస్కృతుడు నగు సూర్యభగవానుడు మా గ్రహపీడను శాంతింప జేయుగాక! మహాశాంతిని మాకు ప్రదానం చేయాలిగాక! శీతల కిరణయుక్తుడు, అమృతాత్ముడు, అత్రిపుత్రుడునగు చంద్రదేవుడు సౌమ్యభావంతో మా గ్రహపీడను దూరంచేయాలి గాక! పద్మరాగ సమవర్ణుడు, మధు సదృశ పింగళనేత్రుడు, అగ్నివలె అంగారకుడు, భూమిపుత్రుడునైన భౌముడు మా గ్రహపీడ నుండి మమ్ము రక్షించుగాక.
పుష్పరాగాభయుక్తుడు, (రాగాభ = రాగ + ఆభ ; ఆభ = కాంతి, వెలుగు) పింగళవర్ణుడు, పీతవస్త్ర మాల్యధారినగు బుధుడు మా గ్రహపీడను వదిలించుగాక! తప్తకాంచన సమతేజుడు, సర్వశాస్త్ర విశారదుడు, దేవగురువునైన బృహసృతి మా గ్రహపీడను దూరం చేసి మాకు శాంతిని ప్రసాదించాలి గాక! హిమ, కుందపుష్ష, చంద్రసమానమైన స్వచ్ఛ వర్ణము కలవాడు, దైత్యదానవ పూజితుడు, సూర్యార్చన తత్పరుడునైన మహామతియు, నీతిశాస్త్ర పారంగతుడు శుక్రాచార్యుడు మా గ్రహపీడను తొలగించాలి గాక! వివిధరూప ధారణ సమర్థుడు, అవిజ్ఞాత గతియుక్తుడు, సూర్యపుత్రుడునైన శనైశ్చరుడు మా గ్రహబాధను తొలగించాలి గాక! అనేక శిఖరాలను కలిగిన సర్వసమర్థులు, అమిత బలశాలులు, అమృతమయులునైన రాహు కేతువులు మాపై దయబూని గ్రహపీడలను దూరంచేసి అతులిత శాంతిని ప్రదానింతురు గాక! ఆపై త్రిమూర్తులనిలా ప్రార్థించాలి:
పద్మాసనః పద్మవర్ణః పద్మపత్ర నిభేక్షణః ।
కమండలు ధరః శ్రీమాన్ దేవగంధర్వ పూజితః ।
చతుర్ముఖో దేవపతిః సూర్యార్చన పరఃసదా ।
సురజ్యేష్ఠోమహాతేజాః సర్వలోక ప్రజాపతిః ।
బ్రహ్మ శబ్దేన దివ్యేన బ్రహ్మాశాంతిం కరోతు తే॥
పీతాంబరధరో దేవ ఆత్రేయీ దయితః సదా ।
శంఖ చక్రగదా పాణిర్మాధవో మధు సూదనః ।
సూర్యభక్తాన్వితో నిత్యం విగతిర్విగత త్రయః ।
సూర్య ద్యాన పరో నిత్యం విష్ణుః శాంతిం కరోతుతే
శశికుందేందు సంకాశో విశ్రుతాభరణై రిహ ।
చతుర్భుజో మహాతేజాః పుష్పార్థ కృతశేఖరః ।
చతుర్ముఖో భస్మధరః శ్మశాన నిలయః సదా।
గోత్రారిర్విశ్వనిలయస్తథా చక్రతు దూషణః ॥
వరోవరేణ్యో వరదో దేవదేవో మహేశ్వరః ।
ఆదిత్య దేహ సంభూతః సతేశాంతిం కరోతువై ॥ (బ్రాహ్మ176/1-8)
తదనంతరం బ్రహ్మాణి, రుద్రాణి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, వారాహి, చాముండి - అను పరాశక్తి రూపాలైన సప్తమాతృకలనిలా ప్రార్థించాలి.
పద్మరాగప్రభాదేవీ చతుర్వదన పంకజా ।
అక్షమాలార్పిత కరాకమండలు ధరా శుభా ।
బ్రహ్మాణీ సౌమ్యవదనా ఆదిత్యారాధనేరతా ।
శాంతిం కరోతు సుప్రీతా ఆశీర్వాద పరాఖగ।
మహాశ్వేతేతి విఖ్యాతా ఆదిత్యదయితా సదా ।
హిమకుందేందు సదృశా మహావృషభవాహినీ ।
త్రిశూలహస్తాభరణా విశ్రుతాభరణా సతీ ।
చతుర్భుజా చతుర్వక్త్రా త్రినేత్రా పాపనాశినీ
వృషధ్వ జార్చనరతా రుద్రాణీ శాంతిదా భవేత్।
మయూరవాహనా దేవి సిందూరారుణ విగ్రహా ।
శక్తి హస్త మహాకాయా సర్వాలంకార భూషితా ।
సూర్యభక్తా మహావీర్యా సూర్యార్చన రతా సదా ।
కౌమారీ వరదా దేవి శాంతి మాశు కరోతు తే॥
గదా చక్రధరా శ్యామా పీతాంబరధరా ఖగ।
చతుర్భుజా హి సాదేవి వైష్ణవీ సురపూజితా॥
సూర్యార్చన పరా నిత్యం సూర్యైక గతమానసా ।
శాంతిం కరోతుతే నిత్యం సర్వాసుర విమర్దినీ॥
ఐరావత గజారూఢా వజ్రహస్తా మహాబలా ।
సర్వత్ర లోచనాదేవి వర్ణతః కర్పురారుణా॥
సిద్ధగంధర్వనమితా సర్వాలంకార భూషితా ।
ఇంద్రాణి తే సదాదేవీ శాంతిమాశు కరోతు వై॥
వరాహఘోణా వికటా వరాహ వరవాహినీ ।
ఆర్ధకోశా కటీక్షామా నిర్మాంసా స్నాయుబంధనా ।
కరాలవదనా ఘోరా ఖడ్గఘంటోద్గతా సతీ।
కపాల మాలినీ క్రూరా ఖట్వాంగ వరధారిణీ ।
ఆరక్తా పింగ నయనా గజచర్మా విగుంఠితా ।
గోశ్రుతాభరణా దేవీ ప్రేతస్థాన నివాసినీ ।
శివరూపేణ ఘోరేణ శివరూప భయంకరీ ।
శ్యామావదాతాయా దేవీ శంఖచక్ర గదాధరా ।
తేజయంతీతి నిమిషాన్ పూజయంతీ సదారవిం ।
వారాహీ వరదాదేవీ తవశాంతిం కరోతు వై ।
చండ ముండ కరాదేవి ముండ దేహగతా సతీ ।
కపాలమాలినీ క్రూరా ఖట్వాంగ వరధారిణీ ।
ఆకాశమాతరో దేవ్యస్తథాన్యా లోకమాతరః ।
భూతనాం మాతరః సర్వాస్తథాన్యాః పితృమాతరః ।
వృద్ధి శ్రాద్ధేషు పూజ్యంతే యాస్తు దేవ్యో మనీషిభ్ణి ।
మాత్రేప్రమాత్రే తన్మాత్రే ఇతి మాతృ ముఖాస్తథా ।
పితామహీతు తన్మాతా వృద్ధాయాచ పితామహీ ।
ఇత్యేతాస్తు పితామహ్యః శాంతిం తే పిృతమాతరః ।
సర్వామాతృ మహాదేవ్యః సాయిధా వ్యగ్ర పాణయః ।
జగద్వ్యాప్య ప్రతిష్ఠం త్యో బలికామా మహోదయాః ॥
శాంతిం కుర్వంతు తా నిత్యమాదిత్యారాధనే రతాః।
శాంతేన చేతసా శాంత్యః శాంతయే తవశాంతిదా ।
సర్వావయవ ముఖ్యేన గాత్రేణ చసుమధ్యమా ।
పీత శ్యామాతి సౌమ్యేన స్నిగ్ధవర్ణేన శోభనా ।
లలాట తిలకోపేతా చంద్ర రేఖార్ధ ధారిణీ।
చిత్రాంబరధరా దేవీ సర్వాభరణ భూషితా ।
వరా స్త్రీమయరూ పాణాం శోభా గుణసుసంపదాం ।
భావనామాత్ర సంతుష్టా ఉమాదేవీ వరప్రదా।
సాక్షాదాగత్యరూపేణ శాంతే నామితతేజసా ।
శాంతిం కరోతుతే ప్రీతా ఆదిత్యారాధనేరతా । (బ్రాహ్మ 177/1-25)
ఆ తరువాత కార్తికేయ, నందీశ్వర, వినాయక, శంకర, పార్వతి, చండేశ్వర, ఐంద్రి దిశాధిపతులనేకాక లోకపాలకుల నగరాలను, సరస్వతి, అపరాజితాదేవిలను ప్రార్థించాలి.
అబలోబలరూపేణ ఖట్వాంగ శిఖవాహనః ।
పూర్వేణవదనః శ్రీమాన్ స్త్రీశిఖః శక్తిసంయుతః ॥
కృత్తికాయాశ్చ రుద్రశ్చ చాంగోద్భూతః సురార్చితః ।
కార్తికేయో మహాతేజా ఆదిత్య వర దర్పితః ।
శాంతి కరోతుతే నిత్యం బలం సౌఖ్యంచ తేజసా ।
ఆత్రేయో బలవాన్ దేవ ఆరోగ్యంచ ఖగాధిప ।
శ్వేతవస్త్రపరీధానస్త్ర్యక్షః కనక సుప్రభః ।
శూలహస్తో మహాప్రాజ్ఞో నందీశో రవిభావితః ।
శాంతిం కరోతుతే శాంతో ధర్మేచ మతిముత్తమాం ।
ధర్మేతరావుభౌ నిత్యమచలః సంప్రయచ్ఛతు॥
మహోదారో మహాకామః స్నిగ్ధాంజన సమప్రభః ।
ఏకదంష్ట్రోత్కటో దేవో గజవక్త్రోమహాబలః ॥
నాగయజ్ఞోపవీతేన నానాభరణ భూషితః ।
సర్వార్థ సంపదుద్ధారో గణాధ్యక్షో వరప్రదః ।
భీమస్య తనయో దేవో నాయకోఽథ వినాయకః ।
కరోతుతే మహాశాంతిం భాస్కరార్చన తత్పరః ।
ఇంద్రనీలనిభస్త్ర్యక్షో దీప్త శూలాయుధోద్యతః ।
రక్తాంబరధరః శ్రీమాన్ కృష్ణాంగో నాగభూషణః ॥
పాపాపనోదమతుల మలక్ష్యో మలనాశనః ।
కరోతు తే మహాశాంతిం ప్రీతః ప్రీతేన చేతసా॥
వరాంబరధరా కన్యా నానాలంకార భూషితా॥
త్రిదశానాంచ జననీ పుణ్యలోక నమస్కృతా ।
సర్వసిద్ధికరా దేవి ప్రసాద పరమాస్పదా ।
శాంతిం కరోతు తే మాతా భువనస్య ఖగాధిప ।
స్నిగ్ధ శ్యామేన వర్ణన మహామహిష మర్దినీ।
ధనుశ్చక్ర ప్రహరణా ఖడ్గపట్టిశ ధారిణీ ।
ఆ తర్జన్యాయతకారా సర్వోపద్రవ నాశినీ।
శాంతిం కరోతు తే దుర్గా భవానీచ శివాతథా ।
అతిసూక్ష్మో హ్యతిక్రోధః త్ర్యక్షోభృంగిరిటిర్మహాన్ ।
సూర్యాత్మకో మహావీరః సర్వోపద్రవ నాశనః ।
సూర్యభక్తి పరోనిత్యం శివంతే సంప్రయచ్ఛతు ।
ప్రచండగణ సైన్యేశో మహాఘంటాక్ష ధారకః ।
అక్షమాలార్పితకరశ్చాథ చండేశ్వరో వరః ।
చండ్రపాపహరో నిత్యం బ్రహ్మహత్యా వినాశనః ।
శాంతిం కరోతుతే నిత్య మాదిత్యారాధనే రతః ।
కరోతుచ మహాయోగీ కళ్యాణానాం పరంపరాం ।
ఆకాశమాతరో దివ్యా స్తథాన్యా దేవ మాతరః ॥
సూర్యార్చన పరాదేవ్యో జగద్వ్యాప్య వ్యవస్థితాః ।
శాంతిం కుర్వంతు తే నిత్యం మాతరః సురపూజితాః।
యేరుద్రా రౌద్రకర్మాణో రౌద్రస్థాన నివాసినః ।
మాతరో రుద్రరూపాక్ష గణానామధిపాశ్చయే ।
విష్నుభూతాస్తథాచాన్యే దిగ్విదిక్షు సమాశ్రితాః ।
సర్వే తే ప్రీతమనసః ప్రతిగృహ్ణంతు మే బలిం ।
సిద్ధిం కుర్వంతుతే నిత్యం భయేభ్యః పాంతు సర్వతః ।
ఐంద్రాదయో గణాయేతు వజ్రహస్తా మహాబలాః।
హిమకుందేందు సదృశా నీలకృష్ణాంగలోహితాః ।
దివ్యాంతరీక్షాభౌమాశ్చ పాతాలతల వాసినః ।
ఐంద్రాః శాంతిం ప్రకుర్వంతు భద్రాణిచపునః పునః।
ఆగ్నేయ్యాంయే భృతాః సర్వే ధ్రువహత్యానుషంగినః ।
సూర్యానురక్తా రక్తాభా జపాసుమనిభాస్తథా ।
విరక్తలోహితా దివ్యా ఆగ్నేయ్యాం భాస్కరాదయః
ఆదిత్యారాధనపరా ఆదిత్యగత మానసాః ।
శాంతిం కుర్వంతు తేనిత్యం ప్రయచ్ఛంతు బలింమమ ।
భయాదిత్య సమాయేతు సతతం దండ పాణయః ।
ఆదిత్యారాధన పరాః శంప్రయచ్ఛంతుమే సదా ।
ఐశాన్యాం సంస్థితాయేతు ప్రశాంతాః శూలపాణయః ।
భస్మోద్ధూలిత దేహాశ్చ నీలకంఠా విలోహితాః ।
దివ్యాంతరిక్షా భౌమాశ్చ పాతాలతల వాసినః ।
సూర్యపూజాకరా నిత్యం పూజయిత్వాంశు మాలినం ।
తతః సుప్రీతమనసో లోకపాలైః సమన్వితాః ।
శాంతిం కుర్వంతుమే నిత్యం శంప్రచ్ఛంతు పూజితాః ।
అమరావతీపురీ నామ పూర్వభాగేవ్యవస్థితా॥
విద్యాధరగణాకీర్ణా సిద్ధగంధర్వ సేవితా ।
రత్న ప్రకారరుచిరా మహారత్నోప శోభితా ।
తత్రదేవపతిః శ్రీమాన్ వజ్రపాణిర్మహాబలః ।
గోపతిర్గోసహస్రేణ శోభమానేన శోభతే ।
ఐరావతగజారూఢో గైరికౌబో మహాద్యుతిః ।
దేవేంద్రః సతతం హృష్ట ఆదిత్యారాధనే రతః ।
సూర్యజ్ఞానైక పరమః సూర్యభక్తి సమన్వితః ।
సూర్యప్రణామః పరమాం శాంతిం తేఽద్ర్యప్రయచ్ఛతు ।
ఆగ్నేయదిగ్విభాగేతు పురీ తేజసృతీ శుభా।
నానాదేవగణాకీర్ణా నానారత్నోప శోభితా ।
తత్రజ్వాలాసమాకీర్ణా దీప్తాంగార సమద్యుతిః ।
పుర గోదహనో దేవో జ్వలనః పాపనాశనః ।
ఆదిత్యారాధనరత ఆదిత్య గతమానసః ।
శాంతి కరోతుతే దేవస్తథా పాపపరిక్షయం ।
వైవస్వతీ పురీరమ్యా దక్షిణేన మహాత్మనః ।
సురాసుర శతాకీర్ణా నారారత్నోప శోభితా ।
తత్ర కుందేందు సంకాశో హరిపింగలలోచనః
మహామహిష మారూడ్ణ కృష్ణాస్రగ్వస్త్రభూషణః ।
అంతకోఽథమహాతేజాః సూర్యధర్మ పరాయణః ।
అదిత్యారాధనపరః క్షేమారోగ్యే దదాతుతే ।
నైరృతే దిగ్విభాగేతు పురీ కృష్ణేతి విశ్రుతా ।
మహారక్షో గణాశౌచ పిశాచ ప్రేత సంకులా ।
తత్ర కుందనిభో దేవో రక్తస్రగ్వస్త్రభూషణః
ఖడ్గపాణిర్మహాతేజాః కరాల వదన్జ్వోలః ।
రక్షేం ద్రో వసతే నిత్యమాదిత్యారాధనే రతః।
కరోతుమే సదాశాంతిం ధనందాన్యం ప్రయచ్ఛతు ।
పశ్చిమేతు దిశోభాగే పురీశ్రద్ధావతీ సదా ।
నానాభోగ సమాకీర్ణా నానా కిన్నర సేవితా ।
తత్రకుందేందు సంకాశో హరిపింగల లోచనః ।
శాంతిం కరోతుమే ప్రీతః శాంతఃశాంతేన చేతసా ।
యశోవతీ పురీరమ్యా ఐశానీం దిశమాశ్రితా ।
నానాగణ సమాకీర్ణా నానాకృత శుభాలయా ।
తేజః ప్రకార పర్యంతా అనేపమ్యా సదోజ్జ్వలా ।
తత్రకుందేందు సంకాశ శ్చాంబుజాక్షో విభూషితః ।
త్రినేత్రః శాంతరూపాత్మా అక్షమాలా ధరాధరంః ।
ఈశానంః పరమోదేవః సదాశాంతిం ప్రయచ్ఛతు ॥
భూలోకేతు భువర్లోకే నివసంతిచయే సదా ।
దేవాదేవాః శుభాయుక్తాః శాంతిం కుర్వంతు తే సదా ॥
జనలోకే మహర్లోకే పరలోకే గతాశ్చయే ।
తే సర్వే ముదితా దేవాః శాంతిం కుర్వంతుతే సదా ॥
సర్వసతీ సూర్యభక్తా శాంతి దావిద్ధాతుమే ।
చారు చామీకరస్థా యా సరోజ కరపల్లవా ॥
సూర్య భక్త్యాశ్రితాదేవి విభూతిం తేప్రయచ్ఛతు ।
హారేణసు విచిత్రేణ భాస్వత్కనకమేఖలా ।
అపరాజితా సూర్యభక్తా కరోతు విజయం తవ ॥ (బ్రాహ్మ178/1-48)
ఆ తరువాత ఇరవైయేడు నక్షత్రాలనూ, మేషాది ద్వాదశ రాశులనూ, సప్తర్షులనూ ఇతర మహాతపస్వులనూ, ఋషులనూ, సిద్ధులనూ, విద్యాధరులనూ, దైత్యేంద్రులనూ, అష్టనాగులనూ శాంతికై ఇలా ప్రార్ధించాలి.
(ఈ భావాలకన్నా ఆ శ్లోకాలే సులభంగా బోధపడేలాగున్నాయి కాబట్టి అవే వ్రాయబడుతున్నాయి.)
కృత్తికా పరమా దేవీరోహిణీచ వరాననా ।
శ్రీమన్మృగశిరా భద్రా అర్ర్దాచాప్య పరోజ్జ్వలా॥
పునర్వసుస్తథాపుష్య ఆశ్లేషాచ తథాధిప।
సూర్యర్చనరతా నిత్యం సూర్యభావానుభావితాః ॥
అర్చయంతి సదాదేవ మాదిత్యం సుర తే సదా ।
నక్షత్ర మాతరో హ్యేతాః ప్రభామాలా విభూషితాః ॥
మఘాసర్వగుణోపేతా పూర్వావతుఫాల్గునీ ।
స్వాతీ విశాఖా వరద దక్షిణం దిశమాశ్రితాః ।
అర్చయంతి సదాదేవ మాదిత్యం సురపూజితం ।
తవాసి శాంతికం ద్యోతం కుర్వంతు గగనోదితాః ॥
అనురాధ తధాజ్యేష్ఠా మూలం సూర్యపురః సరా।
పూర్వషాఢా మహావీర్యా ఆషాఢా చోత్తరాతథా॥
అభిజిన్నామ నక్షత్రం శ్రవణంచ బహుశ్రుతం ।
ఏతాః పశ్చిమతో దీప్తా రాజంతే చానుమూర్తయః ॥
భాస్కరం పూజయంత్యేతాః సర్వకాలం సుభావితాః ।
శాంతిం కుర్వంతు తేనిత్యం విభూతించ మహర్ధికాం ॥
ధనిష్ఠా శతభిషాతు పూర్వభాద్రపదాతథా ।
ఉత్తరాభాద్రరేవత్యౌ చాశ్వినీచమహామతే॥
భరణీచ మహాదేవీ నిత్యముత్తరతః స్థితాః ।
సూర్యార్చనరతా నిత్యమాదిత్యగత మానసాః ॥
శాంతిం కుర్వంతుతే నిత్యం విభూతించ మహర్ధికాం ।
మేషో మృగాధిపః సింహో ధనుర్దీప్తి మతాంవరః ॥
పూర్వేణభాసయంత్యేతే సూర్యయోగ పరాః శుభాః ।
శాంతిం కుర్వంతుతే నిత్యం భక్త్యా సూర్యపదాంబుజే ॥
వృషః కన్యాచ పరమా మకరశ్చాపి బుద్ధిమాన్ ।
ఏతే దక్షిణ భాగేతు పూజయంతి రవిం సదా ॥
భక్త్యా పరమయా నిత్యం శాంతిం కుర్వంతుతే సదా ।
మిథునంచ తులా కుంభః పశ్చిమేచ వ్యవస్థితాః ॥
జపంత్యేతే సదాకాల మాదిత్యం గ్రహనాయకం ।
శాంతిం కుర్వంతుతే నిత్యం ఖభోల్కజ్ఞాన తత్పరాః ॥
సగంధోదక పుష్పాభ్యాం యే స్మృతా సతతంబుధైః ।
ఋషయః సప్త విఖ్యాతా ధ్రువాంతాః పరమోజ్జ్వలాః ॥
భానుప్రసాదాత్సంపన్నాః శాంతిం కుర్వంతుతే సదా ।
కశ్యపో గాలవోగార్గ్యో విశ్వామిత్రో మహామునిః ।
మునిర్దక్షో వసిష్ఠశ్చ మార్కండః పులహః క్రతుః ।
నారదో భృగురాత్రేయో భారద్వాజశ్చవై మునిః II
వాల్మీకిః కౌశికో వాత్స్యః శాకల్యోఽథ పునర్వసుః ।
శాలంకాయన ఇత్యేతే ఋషయోఽథ మహాతపాః ॥
సూర్యధ్యానైక పరమాః శాంతిం కుర్వంతు తే సదా॥
మునికన్యా మహాభాగా ఋషికన్యాః కుమారికాః ॥
సూర్యార్చనరతా నిత్యం శాంతిం కుర్వంతుతే సదా ।
సిద్ధాః సమృద్ధతపసో యే చాన్యేవై మహాతపాః ॥
విద్యాధరా మహాత్మానో గరుడశ్చత్వయా సహ ।
ఆదిత్య పరమాహ్యేతే ఆదిత్యారాధనే రతాః ॥
సిద్ధింతే సంప్రయచ్ఛంతు ఆశీర్వాద పరాయణః ।
నముచి దైత్యరాజేంద్రః శంకుకర్ణో మహాబలః ॥
మహానాథోఽథ విఖ్యాతోదైత్యః పరమవీర్యవాన్ ।
గ్రహాధిపస్య దేవస్య నిత్యం పూజా పరాయణాః ॥
బలం వీర్యంచతే బుద్ధి మారోగ్యంచ బ్రువంతుతే ।
మహాఢ్యోయో హయగ్రీవః ప్రహ్లాదః ప్రభయాన్వితః ॥
అగ్నిముఖో మహాన్ దైత్యః కాలనేమిర్మహాబలః ।
ఏతే దైత్యే మహాత్మానః సూర్య భావేన భావితాః ॥
తుష్టిం బలం తథాఽరోగ్యం ప్రయచ్ఛంతు సురారయః ।
వైరోచనో హిరణ్యాక్షస్తుర్వసుశ్చ సులోచనః ॥
ముచికుందో ముకుందశ్చ దైత్యోరైవతకస్తథా ।
భావేన పరమేణేమం యజంతే సతతం రవిం ॥
సతతంచ శుభాత్మానః పుష్టిం కుర్వంతుతే సదా ।
దైత్యపత్న్యో మహాభాగా దైత్యానాం కన్యకాః శుభాః ॥
కుమారాయేచ దైత్యానాం శాంతిం కుర్వంతుతే సదా ।
ఆరక్తేన శరీరేణ రక్తాం తాయతలోచనాః ॥
మహాభాగాః కృతాటోపాః శంఖాద్యాః కృతలక్షణాః ।
అనంతో నాగరాజేంద్ర ఆదిత్యారాధనేరతః ॥
మహాపాప విషంహత్వా శాంతిమాశు కరోతుతే ।
అతి పీతేన దేహేన విస్ఫురద్భోగ సంపదా ॥
తేజసాచాతి దీప్తేన కృతస్వస్తిక లాంఛనః ।
నాగరాట్ తక్షకః శ్రీమాన్ నాగకోట్యా సమన్వితః ॥
కరోతుతే మహాశాంతిం సర్వదోష విషాపహాం ।
అతికృష్ణేన వర్ణేన స్ఫురితాధిక మస్తకః ॥
కంఠరేఖాత్రయోపేతో ఘోరదంష్ట్రా యుధోద్యతః ।
కర్కాటకో మహానాగో విషదర్ప బలాన్వితః ॥
విషశస్త్రాగ్ని సంతాపం హత్వా శాంతిం కరోతుతే।
పద్మవర్ణః పద్మకాంతిః ఫుల్ల పద్మాయతేక్షణః
ఖ్యాతః పద్మో మహానాగో నిత్యం భాస్కరపూజకః ।
సతేశాంతిం శుభం శీఘ్రమచలం సంప్రయచ్ఛతు ॥
శ్యామేన దేహభారేణ శ్రీమత్కమలలోచనః।
విషదర్ప బలోన్మత్తో గ్రీవాయాం రేఖయాన్వితః ॥
శంఖపాల శ్రియాదీప్తః సూర్యపాదాబ్జ పూజకః ।
మహావిషం గరశ్రేష్ఠం హత్వాశాంతిం కరోతుతే ॥
అతి గౌరేణ దేహేన చంద్రార్ధ కృతశేఖరః ।
దీపభాగే కృతాటోప శుభలక్షణ లక్షితః ॥
కులికో నామ నాగేంద్రో నిత్యం సూర్యపరాయణః ।
అపహృత్య విషం ఘోరం కరోతు తవశాంతికం ॥
అంతరిక్షేచయే నాగా యేనాగాః స్వర్గసంస్థితాః ।
గిరి కందర దుర్గేషు యే నాగాభువి సంస్థితాః ॥
పాతాలే యేస్థితానాగాః సర్వేయత్ర సమాహితాః ।
సూర్యపదార్చనా సక్తాః శాంతిం కుర్వంతుతే సదా ॥
నాగిన్యో నాగకన్యాశ్చ తథా నాగ కుమారకాః।
సూర్యభక్తాః సుమనసః శాంతిం కుర్వంతుతే సదా ॥
య ఇదం నాగసంస్థానం కీర్తయేచ్ఛుృణుయాత్ తథా।
నతం సర్పావిహింసంతి నవిషం క్రమతే సదా ॥ (బ్రాహ్మ 179/1-44)
ఈ నాగశాంతి శ్లోకాలను చదివినవారిని, విన్నవారిని సర్పగణాలేవీ కాటువేయవు. ఇతరత్రా ఎక్కించిన విషం కూడా వారినేమీ వేయలేదు.
గరుడా! ఆ తరువాత గంగాది పుణ్యనదులనూ, యక్షేంద్రులనూ, పర్వతాలనూ సాగరాలనూ, రాక్షసులనూ, ప్రేతాలనూ, పిశాచాలనూ, అపస్మారాది గ్రహాలనూ, అందరు దేవతలనూ, ఆ సూర్య భగవానునీ శాంతిదాతలు కమ్మని ఇలా ప్రార్థించాలి :
గంగా పుణ్యామహాదేవీ యమునా నర్మదానదీ ।
గౌతమీచాపి కావేరీ వరుణా దేవికా తథా ॥
సర్వగ్రహ పతిం దేవం లోకేశం లోకనాయకం ।
పూజయంతి సదా నద్యః సూర్యసద్భావ భావితాః ।
శాంతిం కుర్వంతు తే నిత్యం సూర్యధ్యానైక మానసాః ॥
నిరంజనా నామ నదీ శోణశ్చాపి మహానదః ।
మందాకినీ చ పరమా తథా సన్నిహితా శుభా ॥
ఏతాశ్చాన్యాశ్చ బహవో భువి దివ్యంతరీక్షకే।
సూర్యార్చనరతా నద్యః కుర్వంతు తవ శాంతికం ॥
మహావైశ్రవణో దేవో యక్షరాజో మహర్షికః ।
యక్షకోటి పరీవారో యక్షసంఖ్యేయ సంయుతః ॥
మహా విభవ సంపన్నః సూర్యపాదార్చనేరతః ।
సూర్య ధ్యానైక పరమః సూర్యభావేన భావితః ॥
శాంతిం కరోతుతేప్రీతః పద్మపత్రాయతేక్షణః ।
మణిభద్రో మహాయక్షో మణిరత్న విభూషితః ॥
మనోహరేణ హారేణ కంఠలగ్నేన రాజతే ।
యక్షిణీ యక్షకన్యాభిః పరివారిత విగ్రహః ।
సూర్యార్చన సమాసక్తః కరోతు తవశాంతికం ॥
సుచిరోనామ యక్షేంద్రో మణికుండల భూషితః ।
లలాటే హేమపటల ప్రబద్ధేన విరాజతే ॥
బహుయక్ష సమాకీర్ణో యక్షైర్నమిత విగ్రహః ।
సూర్య పూజా పరోయుక్తః కరోతు తవశాంతికం ॥
పంచికోనామ యక్షేంద్రః కంఠాభరణ భూషితః ॥
కుక్కుటేన విచిత్రేణ బహురత్నాన్వితే నతు ॥
యక్ష వృంద సమాకీర్ణో యక్షకోటి సమన్వితః ।
సూర్యార్చనపరః శ్రీమాన్ కరోతు తవశాంతికం॥
ధృతరాష్ట్రో మహాతేజా నానాయక్షాధిపః ఖగ ।
దివ్యపట్టః శుక్లచ్ఛత్రో మణికాంచన భూషితః ॥
సూర్యభక్తః సూర్యరతః సూర్యపూజా పరాయణః ।
సూర్యప్రసాద సంపన్నః కరోతుతవ శాంతికం॥
విరూపాక్షశ్చయక్షేంద్ర శ్వేతవాసా మహాద్యుతిః ।
నానా కాంచన మాలాభిరూప శోభిత కంధరః ॥
సూర్యపూజా పరోభక్తః కంజాక్షః కంజసన్నిభః ।
తేజసాదిత్య సంకాశః కరోతు తవ శాంతికం ॥
అంతరిక్ష గతాయక్షా యేయక్షాః సూర్యభక్తా దృఢవ్రతాః ।
నానారూపధరా మక్షాః సూర్యభక్తా ధృడ వ్రతాః॥
తద్భక్తాస్తద్గతమానసః సూర్యపూజా సముత్సుకాః ।
శాంతిం కుర్వంతు తే హృష్టాః శాంతాః శాంతి పరాయణాః ॥
యక్షిణ్యో వివిధాకారాస్తథా యక్ష కుమారకాః ।
యక్షకన్యా మహాభాగాః సూర్యారాధన తత్పరాః ॥
శాంతిం స్వస్త్యయనం క్షేమం బలం కల్యాణముత్తమం।
సిద్ధిం చాశు ప్రయచ్ఛంతు నిత్యంచ సుసమాహితాః ॥
పర్వతాః సర్వతః సర్వే వృక్షాశ్చైవ మహర్ధికాః ।
సూర్యభక్తాః సదా సర్వే శాంతిం కుర్వంతుతే సదా ॥
సాగరాః సర్వతః సర్వే గృహార్ణయాని కృత్‌స్నశః ।
సూర్యస్యారాధన పరాః కుర్వంతు తవ శాంతికం ॥
రాక్షసః సర్వతః సర్వే ఘోరరూపామ మహాబలాః ।
స్థలజా రాక్షసాయేతు అంతరిక్ష గతశ్చయే ।
పాతాలే రాక్షసాయేతు నిత్యం సూర్యార్చనే రతాః ।
శాంతిం కుర్వంతుతే సర్వేతేజసా నిత్య దీపితాః ॥
ప్రేతాః ప్రేతగణాః సర్వే యేప్రేతాః సర్వతోముఖాః ।
అతి దీప్తశ్చయే ప్రేతా యేప్రేతా రుధిరాశనాః ॥
అంతరిక్షేచ యేప్రేతా స్తథాయే స్వర్గవాసినః ।
పాతాలే భూతలే వాపి యేప్రేతాః కామరూపిణిః ॥
ఏకచక్ర రథోయస్య యస్తు దేవో వృషధ్వజః ।
తేజసా తస్య దేవస్య శాంతిం కుర్వంతుతే సదా ॥
యేపిశాచా మహావీర్యా వృద్ధిమంతో మహాబలాః ।
నానారూపధరాః సర్వే సర్వేచ గుణవత్తరాః ॥
అంతరిక్షే పిశాచాయే స్వర్గేయే చ మహాబలాః ।
పాతాలే భూతాలే యేచ బహురూపా మనోజవాః
యస్యాహం సారథిర్వీర యస్యః త్వం తురగః సదా।
తేజసాతస్య దేవస్య శాంతిం కుర్వంతు తే౦ఽజసా ॥
అపస్మారగ్రహాః సర్వే సర్వే చాపి జ్వరగ్రహః ।
యేచస్వర్గ స్థితాః సర్వే భూమిగాయే గ్రహోత్తమా ।
పాతాలేతు గ్రహాయేచ యేగ్రహాః సర్వతో గతాః ।
దక్షిణే కిరణేయస్య సూర్యస్యన స్థితో హరిః ॥
హరోయస్య సదావామే లలాటే కంజజః స్థితః ।
తేజసా తస్య దేవస్య శాంతిం కుర్వంతుతే సదా ॥
ఇతి దేవాదయః సర్వే సూర్యయజ్ఞ విధాయినః ।
కుర్వంతు జగతః శాంతిం సూర్యభక్తేషు సర్వదా ॥
జయసూర్యాయ దేవాయ తమోహంత్రే వివస్వతే ।
జయప్రదాయ సూర్యాయ భాస్కరాయ నమోఽస్తుతే ॥
గ్రహోత్తమాయ దేవాయ జయకల్యాణ కారిణే।
జయ పద్మవికాశాయ బుధరూపయా తే నమః ॥
జయదీప్తి విధానాయ జయశాంతి విధాయినే I
తమోఘ్నాయ జయాయైవ అజితాయ నమోనమః ॥
జయార్క జయదీప్తిశ సహస్ర కిరణోజ్జ్వల ।
జయ నిర్మితలోకస్త్వ మజితాయ నమోనమః ॥
గాయత్రీ దేహరూపాయ సావిత్రీ దయితాయచ ।
ధరాధరాయ సూర్యాయ మార్తండాయ నమోనమః ॥ (బ్రాహ్మ. 180/1-39)
శతానీక మహారాజా! గరుడుని సర్వశుభ కల్యాణ పరంపరల కోసం అరుణుడీ విధానంలో శాంతియజ్ఞ పూజనాలు ముగించగానే అద్భుతం జరిగింది. గరుత్మంతునికి అందమైన బలమైన రెక్కలు చూస్తుండగానే మొలుచుకొచ్చాయి. అతడు బుధసమాన తేజుడై దేదీప్యమానుడై విష్ణుసమానబలుడై విరాజిల్లాడు. ఓ రాజా! ఈ విధంగా సూర్యదేవుని దయవల్ల సుపర్ణుని సర్వాంగాలూ యథాపూర్వస్థితికి వచ్చి మరింత శోభిల్లాయి.
గరుత్మంతుడే కాదు, సామాన్య మానవులు కూడ రోగస్తులైతే ఈ అగ్నికార్యాన్ని సౌరశాంతి సంపన్నంగా చేస్తే నిరోగులై కాంతి సంపన్నులౌతారు. గ్రహోపఘాతం, దుర్భిక్షం కమ్ముకొన్నపుడు అనావృష్టి ఈ దేశాన్ని అతలాకుతలం చేసినపుడు లక్షహోమ సమన్విత సౌరసూక్తంతో వరుణసూక్తాన్ని కూడా సమన్వయం చేసి ప్రసన్నచిత్తంతో నెయ్యి, తేనె, నువ్వులు, యవలు, పాలతో కలిపి పాయసం చేసి దానితో హవనం, శాంతి యజ్ఞంచేసి బలులివ్వాలి. (జంతు బలికాదు) దేవతలు ప్రసన్నులై అప్పుడు లోక కల్యాణానికి పూనుకుంటారు. లక్ష్మినే వృష్టిగా కురిపిస్తారు. సూర్యభగవానుని మనసులో నిడుకొని ఈ శాంతి అధ్యాయాన్ని చదివినా, విన్నా విజయం లభిస్తుంది. పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. వ్యాధులేవీ అంటకుండా, ఉన్న వ్యాధులు పోగా సూర్యసమాన తేజస్సుతో ఆనందమయ జీవనాన్ని గడుపుతారు.
ఎవరికోసమైతే ఈ శాంతి యజ్ఞం చేయబడుతుందో వారు నిజంగా అదృష్టవంతులు. వారి కోరిక వెంటనే తీరడమే గాక వాత, పిత్త, కఫ జన్యరోగాలేవీ వారినంటవు. సర్పదంశ మృత్యువుగానీ అకాల మృత్యువుగానీ వుండదు. శరీరంపై ఏ విషమూ పనిచేయదు. అంగవైకల్యం కలగదు. ఇతరులు చేసే వామాచార ప్రయోగాలు (చిల్లంగి లాంటివి) పాకవు. ఇక సామాన్యులు ఈ యజ్ఞం చేయకపోయినా ఈ అధ్యాయములోని శ్లోకాలను వింటేచాలు. వారికి గంగాది తీర్థాలు సేవించిన దానికి కొన్నిరెట్లు పుణ్యం దక్కుతుంది. గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసిన పరమదుష్టులు కూడా పశ్చాత్తాపంతో, పరమభక్తితో ఈ అధ్యాయాన్ని చదువుకున్నా, విన్నా పాపముక్తులౌతారు. ఈ శాంతి, అగ్నికార్యం అతిశయోత్తమం, పరమపుణ్యమయం.”
Summary of chapter 95 of the Bhavishya Mahā Purana is as follows:
The comprehensive statement of merits associated with the Sūrya temple is given: building the temple, donating specific items for the temple's use, performing service in the temple (sweeping, flower-arranging, lamp-lighting, cooking for the daily offering), visiting the temple on auspicious days, and simply passing a Sūrya temple and paying reverence as one walks by — each act is assigned its specific quantum of merit. The chapter is clearly designed to encourage both the construction of new Āditya temples and the enthusiastic participation of the lay community in the support and daily life of existing ones. The living solar temple is presented as the most powerful sacred space available to the community — a place where Sūrya's grace flows most freely and most abundantly.