హే ద్విజోత్తములారా! బ్రాహ్మణుడు జన్మతోనే ప్రభువు. సృష్టికర్త ఎంతో తపస్సు చేసి దాని ద్వారా హవ్యకవ్యాల రక్షణకై బ్రాహ్మణుని ప్రథమంగా సృష్టించాడు. వీని ద్వారానే దేవతలు హవ్యాన్నీ పితరులు కవ్యాన్నీ స్వీకరించగలిగారంటే, ఇక వీని కన్న శ్రేష్ఠుడెవడు? కాబట్టి బ్రహ్మజ్ఞానముగలవాడు పుట్టుకతోనే శ్రేష్ఠుడు, పూజనీయుడు నగుచున్నాడు. అయితే, గర్భాదానాది నలబై ఎనిమిది సంస్కారాలూ శాస్త్రవిధివత్ ఎవనికి సంపన్న మౌతాయో ఆయనే నిజమైన బ్రాహ్మణుడు. ఇట్టి ద్విజులను పూజించియే కదా దేవగణాలు స్వర్గఫలాలు భోగించగలుగుతున్నది! మనుష్యులు కూడా బ్రాహ్మణులను పూజించి, సేవించి దైవత్వప్రాప్తి నందగలుగుచున్నారు కదా! ఎవరి పట్ల బ్రాహ్మణులు ప్రసన్నులౌతారో వారి పట్ల శ్రీ మహావిష్ణువు కూడా ప్రసన్నుడైతాడు. అన్ని విషయాలపై అవగాహన. సర్వజ్ఞత్వము కలిగియున్న బ్రాహ్మణుడే దేవకార్యము, పితృకార్యము, యజ్ఞము, పెళ్ళి, అగ్నికార్యము, శాంతికర్మము, స్వస్తి అయనము. మున్నగు విధులన్నిటినీ చేయించగలడు. ఆయన లేనిదే దేవకార్య, పితృకార్య, యజ్ఞకర్మాంతర్గత, దాన, హోమ, బలి ఆది విధులేవీ సంపన్నాలు కాలేవు. ఇవి లేనిదే మానవ జీవితం లేదు.
బ్రాహ్మణుని చూడగానే లేచి నమస్కారం చేసి ఆయన నోటివెంట దీర్ఘాయుర్భవ అనే ఆశీస్సునందిన వారు చిరంజీవులౌతారు. బ్రాహ్మణునిపూజిస్తే ఆయువు, కీర్తి, విద్య, ధనం వృద్ధి పొందుతాయి. ఏ గృహంలోనైతే విప్రవరులకు కాళ్ళు కడిగి పూజలు చేయరో, ఏ గృహంలోనైతే వేదశాస్త్రాల ఉచ్చారణ ధ్వనులు వినిపించవో, ఏ గృహం నుండైతే స్వాహా, స్వధా, స్వస్తి శబ్దాలు నిర్గమించవో ఆ గృహము శ్మశాన సమానము.
ఈ క్రింది దోషాలు మనుష్యుని నరకం వైపు పయనింపచేస్తాయి. ఈ మనుష్యులెవరనగా (1) అధముడు (2) విషముడు (3) పశువు (4) పిశునుడు (5) కృపణుడు (6) పాపిష్ఠుడు (7) నష్టుడు (8) రుష్టుడు (9) దుష్టుడు (10) పుష్టుడు (11) హృష్టుడు (12) కాణుడు (13) అంధుడు (14) ఖండుడు (15) చండుడు (16) కుష్ఠు (17) దత్తాపహారకుడు (18) వక్త (19) కదర్యుడు (20) దండుడు (21) నీచుడు (22) ఖలుడు (23) వాచాలుడు (24) చపలుడు (25) మలీమసుడు (26)స్తేయి. (ఈ దోషాలు స్త్రీలకున్నా దోషాలే.)
విప్రేంద్రులారా! ఈ ఇరవై ఆరుదోషాల్లోనే మళ్ళా భేద, ప్రభేదాలు చెప్పబడ్డాయి. అందుకే వాటిని ఒక్కొక్కటిగా సంగ్రాహంగానైనా వివరించి చెప్పవలసివుంది. ఇలా:
(1) గురువుల వద్దకూ దైవసన్నిధికీ చెప్పులు విడవకుండానే, గొడుగును ముడవకుండానే పోవుట, గురువుగారి ఎదురుగానే ఉన్నతాసనంపై కూర్చుని యుండుట, పల్లకిలో కూర్చొని తీర్థయాత్రలు చేయుట, తీర్థాలలో గ్రామ్యధర్మాచరణను చేయుట - ఇవన్నీ అథమసంజ్ఞక దోషాలు. (2) పైకి ప్రియంగా మధురంగా మాట్లాడుతూ హృదయంలో మాత్రం హాలాహలాన్ని కలిగియుండి చెప్పేదొకటిగా చేసేదొకటిగా జీవించేవాడు విషముడు. (3) మోక్షమును గురించి అసలు ఆలోచించకుండా, ప్రాపంచిక విషయవాంఛలలోనే మునిగితేలుతూ, హరిసేవ వూసే తలపక, ప్రయాగలో వుంటూ ఇంకెక్కడో స్నానం చేస్తూ, ప్రత్యక్ష దైవాలను విస్మరించి అదృష్టభాగ్యాన్ని వెతుకుతూ, శాస్త్రసారాన్ని బొత్తిగా పట్టించుకోకుండా వుండేవాడు పశువు. (4) బలంతోగాని, వేషంతోనో మోసంతోనో గాని, మిథ్యాప్రేమను ప్రదర్శించి గాని మనుష్యులను తన లాభంకోసం ఆపదలలో ముంచేసేవాడు పిశునుడు. (5) దేవ, పితృ కార్యాలలో మంచి అన్నంపెట్టే స్తోమతు వుండీ కూడా మ్లానమై అశుభ్రమైన అన్నాన్ని భోజనాలలో వడ్డించే దుర్బుద్ధియైన మానవుడు కృపణుడు. వానికి స్వర్గమూ దొరకదు; మోక్షమూ లభింపదు. అప్రసన్నమైన మనసుతో కుత్సిత వస్తువులతో దాన కర్మలను గావిస్తూ కోపంగా మొహం మాడ్చుకొని పూజలను చేసేవాడూ కృపణుడే. శరీర విక్రయదారులు కూడా కృపణులే. (6) మాతాపితలను, గురువులను వారి కర్మకు వారిని వదలివేసి హోమ - యజ్ఞాల నిర్వహణలో కూడా లోపం చేసేవారు పాపిష్టులు. (7) సాధనాచరణను పరిత్యజించి, అసత్యపు సేవాప్రదర్శన చేయువాడు, వేశ్యాగామి, దేవధనం ద్వారా స్వంత పబ్బం గడుపుకొనేవాడు, భార్యచేత వ్యభిచారం చేయించి బతుకు నిలుపు కొనేవాడు, కన్యలను తెచ్చి అమ్ముకొనో మరే విధంగానో మొత్తానికి స్త్రీధనం ద్వారానే అపసవ్యంగా అక్రమంగా బతికేసేవాడు పురాణపరిభాషలో నష్టుడన బడతాడు. (8) మనసులో ఎప్పుడూ క్రోధమే తప్ప మరో మనోవికారమూ, సరాగమూ వుండనివాడు, తన హీనతను తానే తలచుకొని మరీ కోపం తెచ్చేసుకుని చల్లటి వాతావరణాన్ని మంటసెగలపాలు చేసేవాడు (ఉడుకుమోతువాని ముఖాన కనుబొమలు శాశ్వతంగా ముడివడే ఉంటాయి. చిరునవ్వన్నది వుండదు) - ఇలాంటివాడు రుష్ఠుడు (9) అకార్య లేదా నిందిత ఆచరణ ద్వారానే జీవించే వాడు. ధర్మకార్యమేదీ పూర్తిగా చేయనివాడు. నిద్రాళువు, దుర్వ్యసనాలపై ఆసక్తిగలవాడు, మదిరాలోలోడు, స్త్రీలను సేవిస్తుండేవాడు, ఎల్లపుడూ దుష్టులుగా జగత్ప్రసిద్ధులైన వారి సాంగత్యంలోనే తిరుగుతుండేవాడు దుష్టుడనబడతాడు. (10) మధుర, మృష్టాన్న భోజనాన్ని తానొక్కడే తినేవాడు, వంచకుడు, సజ్జనులను నిందించేవాడు, శుకర (మద్యశాల వంటి వాటిని శుభ్రపరచుట) తో సమానమైనవృత్తి చేసేవాడు పుష్టుడు. (11) నిగమాగమాలను అంటే వేదతంత్రాలను అధ్యయనం చేయకపోగా, వినడానికి కూడా రానివాడు హృష్టుడు (12,13) శ్రుతులు, స్మృతులు బ్రాహ్మణ్యానికి రెండు కళ్ళు. ఒకటి లేనివాడు కాణుడు, రెండూలేనివాడు అంధుడు. (14) అన్నదమ్ములతో కయ్యమాడేవాడు, మాతాపితలను అప్రియవచనాలతో బాధించువాడు ఖండుడవుతాడు. (15) శాస్త్రనింద జేయువాడు, చాటున కొండెములు చెప్పేవాడు, రాజ్‌మాగీ శూద్రసేవకుడు, శూద్రపత్నులతో అనాచరణ చేసేవాడు, శూద్రగృహంలో వండబడిన అన్నాన్ని ఒకమారు తిన్నా, శూద్రగృహంలో అయిదురోజులు నివసించినా... వాడు చండుడనబడతాడు, (16) ఎనిమిదిరకాల కుష్ఠురోగాలు కలవాడు, లేదా మూడురకాలైనా వున్నవాడు, శాస్త్ర నిందులతో కలిసి తిరిగేవాడు కుష్టుడు (17) కీటకంలా తెగ తిరిగేవాడు, కుత్సితదృష్టితోనే వ్యాపారం చేసేవాడు, దత్తాపహారకుడన బడతాడు. (18) కుపండితుడై, అజ్ఞానియై ఉండి కూడా ధర్మోపదేశాలు చేసేస్తుండేవాడు వక్త. (వక్త అనేమాటకి ప్రస్తుతం మాత్రం మంచి అర్థముంది. అదే రూఢి) (19) గురుజనుల వృత్తులను అపహరించడానికి ప్రయత్నించేవాడు. కాశీనివాసి అయివుండి కూడా కాశినొదిలేసి బహుదినాలు బయటి ఊళ్ళల్లో వుండేవాడు కదర్యుడు. (20) మిథ్యాక్రోధాన్ని ప్రదర్శిస్తూ, దండవిధానంలో, అమలులో కల్పించుకొని జనులను దండించేవాడు దండదోషి లేదా ఉద్దండుడు. (21) బ్రాహ్మణ, రాజ, లేదా దేవ సంబంధి ధనాన్ని అపహరించి మరొక బ్రాహ్మణునికో దైవానికో పెట్టేవాడు, ఆ ధనంతో భోజనాలు పెట్టేవాడు, అక్షరాభ్యాసముండి చదవడానికి గాని, బలవంతాన చదివినా అర్థం చేసుకోవడానికి గాని ప్రయత్నించనివాడు, అనాచారి, దురాచారి నీచుడు.(22) గుణవంతులలో సజ్జనులలో దోషాలు వెతకడమే పనిగా పెట్టుకొనేవాడు ఖలుడు. (23) భాగ్యహీనులను పరిహాసయుక్తంగా, వెటకారంగా సంబోధించి వేధించేవాడు, చండాలురతో మరీ బహి రంగంగా సల్లాపములాడేవాడు వాచాలుడు. (24) పక్షులను పెంచి అమ్ముకొనేవాడు పిల్లిపిల్లీ తగువులాడుకొని కోతి దగ్గరకు ధర్మంకోసం వెళితే రెండిటినీ మోసం చేసిన కోతిలాగా మానవద్రవ్యాలను భక్షించేవాడు, మాంసభక్షకుడు, అన్యాంగనాసక్తుడు, మట్టిపెళ్లలను పగులగొట్టేవాడు (వ్యర్థంగా) చపలుడనబడతాడు. (25) నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటి పోసుకోవడం వంటి శరీరశుద్ధికర్మ ఏనాడూ చేసుకోనివాడు, నిత్యశరీర శుభ్రతకర్మలేవీ చేపట్టనివాడు మలీమసుడు (26) స్తేయి అనగా చోరుడు దొంగతనం చేయడమేకాక మాతా పితలను పోషించకుండుట, గురువును గౌరవించకుండుట, మంచి ఆలోచనేదీ మనసులో లేకుండుట స్తేయి లక్షణాలు.
ఈ దోషాలలో ఏ ఒక్కటీ లేనివాడే నిజమైన మనిషి.
Summary of chapter 111 of the Bhavishya Purāṇa is as follows:
Sesame oil, which in Indian tradition is associated with the sun, with ancestors, and with purification, is the central element of the Abhyaṅga-saptamī. On this saptamī, the votary anoints the entire body with sesame oil before sunrise, reciting specific Sūrya mantras as the oil is applied. This act of self-anointing with the sun-associated oil is understood as drawing solar energy into the body through the skin, purifying the blood and the lymphatic system, and strengthening the skin's own protective and sensing capacities. Sūrya is then worshipped after the oil-bath with specific offerings of sesame. The chapter identifies this vrata as particularly effective for skin diseases, which in the Āyurvedic and Purāṇic understanding are associated with solar energy imbalance.