భవిష్య పురాణము

38-42 - విశోకషష్ఠీ వ్రతం - ఇతర షష్ఠీ వ్రతాలు

సేవించాలి. మరునాడు నూనె, ఉప్పు లేని భోజనం చేయాలి. ఇలా ఒక యేడాది పాటు ప్రతి నెలలో రెండు షష్ఠినాళ్ళలోనూ చేసి చివరి శుక్ల సప్తమినాడు సువర్ణ కమలయుక్త కలశనూ, శ్రేష్ఠమైన ఉత్తమశయ్యనూ, పాలిస్తున్న కపిలగోవునూ బ్రాహ్మణునకు దానమివ్వాలి. దర్జాగా ఈ వ్రతాన్ని చేసిన వారికి కోటి సంవత్సరాల దాకా ఏ జన్మలోనూ విషాదముండదు. రోగము, దుర్గతి వుండవు. ఇంతేకాక ఏదైనా కోరికను మనసులో పెట్టుకొని ఈ వ్రతాన్ని చేస్తే ఆ కోరిక వెంటనే తీరుతుంది. ఏ కోరికలూ లేకుండా వున్నవారికి మోక్షం ప్రాప్తిస్తుంది. కేవలం ఈ వ్రత దినాల్లో ఉపవాసం మాత్రమే చేయగలిగిన వారికి ఇంద్రలోక నివాసం లభిస్తుంది.

కమలషష్ఠీ వ్రతం చేసి ఉపవాసం చేసిన వారికి కూడా పాపముక్తీ, స్వర్గప్రాప్తీ కలుగుతాయి. ఆ వ్రతాన్నాచరించేవారు మార్గశిర శుద్ధపంచమినాడు నియమ స్వీకరణం చేసి షష్టినాడు ఉపవాసముండాలి. కృష్ణ సప్తమినాడు స్వర్ణ కమలం, సువర్ణఫలాలను చక్కెరతోబాటు ఒక కలశంలో వుంచి దానిని బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. ఈ విధంగా ఒక సంవత్సర పర్యంతం రెండు పక్షాలలో షష్ఠి దినాల్లో ఉపవాసంచేయాలి. క్రమంగా భాను, అర్క, రవి, బ్రహ్మ, సూర్య, శుక్ర, హరి, శివ, శ్రీమాన్, విభావసు, త్వష్ట, వరుణ అనే సూర్యనామాలకు ‘ప్రీయతాం’ శబ్దాన్ని జోడించి నెలకొక నామంగా వ్రతదీక్షలో నున్నప్పుడు ఉచ్చరిస్తూనే వుండాలి. మార్గశిరంలో భానుర్మేప్రీయతాం పుష్యమాసంలో అర్కోమే ప్రీయతాం మొదలుగా నెలకొక నామం చేయాలి. వ్రతాంతంలో బ్రాహ్మణ దంపతులను పూజించి, వస్త్రాలు, అలంకారాలు, చక్కెర నింపిన కలశ, స్వర్ణకమలం, స్వర్ణఫలంలను దానం చేసి ఈ క్రింది మంత్రం చదివి వ్రతాన్ని పూర్తి చేయాలి.

యథాఫలకరోమాస స్త్వద్భక్తానాం సదారవే

తథానంత ఫలావాప్తిరస్తు జన్మని జన్మని (ఉత్తరపర్వం 39/11)

ఈ అనంతఫలాలనిచ్చు ఫలషష్టీ వ్రతాన్ని చేయువారు సురాపానాది సర్వపాప విముక్తులై సూర్యలోకం చేరి అక్కడా సమ్మానితులౌతారు. ఈ వ్రతాన్ని విన్నవారికి సర్వశుభాలూ కలుగుతాయి (మత్స్యాది పురాణంలో ఈ వ్రతం సప్తమి అనే పేరుతో చెప్పబడింది. అ-76).

మందారషష్ఠీవ్రతము ను మాఘశుద్ధ పంచమి నాడే నియమ గ్రహణం చేసి మొదలు పెట్టాలి. షష్ఠినాడు ఉపవాసం చెయ్యాలి. బ్రాహ్మణులను సత్కరించి తాను మాత్రం మందారపువ్వును తిని పడుకోవాలి. (ఇది పంచమినాటి రాత్రి) షష్ఠినాడు వేగముగా మేల్కొని స్నానాదులగావించి రాగిరేకుపై నల్లనువ్వులతో నొక అష్టదళ కమలాన్ని నిర్మించాలి. చేతిలో నొక కమలాన్ని పట్టుకొని దానిపై సూర్యదేవుని సువర్ణప్రతిమను స్థాపించి రాగిరేకుపై నిలపాలి. ఎనిమిది సువర్ణ అర్క పుష్పాలతో గంధాది ఉపచారాలతో అష్టదళ కమలం రేకులకు సూర్యభగవానుని ఒక్కొక్క నామం ద్వారా దిక్కులలో క్రమంగా పూజ చేయాలి. ఆ కమలదళాలలో

ఓం భాస్కరాయ నమః                       అంటూ తూర్పులోనూ

ఓం సూర్యాయ నమః                         అంటూ ఆగ్నేయంలోనూ

ఓం అర్కాయ నమః                           అంటూ దక్షిణంలోనూ

ఓం అర్యమ్ణే నమః                              అంటూ నైరృత్యంలోనూ

ఓం వసుధాత్రే నమః                         అంటూ పశ్చిమంలోనూ

ఓం చండభానవే నమః                      అంటూ వాయవ్యంలోనూ

ఓం పూష్ణే నమః                               అంటూ ఉత్తరంలోనూ

ఓం ఆనందాయ నమః                      అంటూ ఈశాన్యంలోనూ

గల ఒక్కొక్క దళంలో ఈ ఉపచారాలను పెట్టాలి. కమలానికి మధ్యవర్తియైన కర్ణికలో ఓం సర్వాత్మనే పురుషాయ నమః అంటూ శుక్లవస్త్రాలతో, నైవేద్య మాల్యాది ఉపచారాలతో సూర్యదేవుని పూజించాలి. సప్తమినాడు తూర్పువైపుకి తిరిగి మౌనంగా నువ్వులనూ ఉప్పునూ తినాలి. ఈ విధంగా ప్రతిమాసంలో శుక్ల షష్ఠినాడు ఒక యేడాదిపాటు ఈ వ్రతాన్ని చేయాలి. సంవత్సరాంతంలో అదే ప్రతిమను ఒక కలశపై స్థాపించి దానిని యథాశక్తి గోవుతో, స్వర్ణంతో కలిపి బ్రాహ్మణునికి దానం చేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి.

నమో మందారనాథాయ మందార భవనాయచ।

త్వంచవైతారయ స్వాస్మాన స్మాత్ సంసార కర్దమాత్ (ఉత్తరపర్వం 40/11)

ఈవిధంగా మందార షష్ఠీ వ్రతాన్నాచరించిన వారికి అన్ని పాపాల నుండి విముక్తితో బాటు ఒక కల్పందాకా స్వర్గలోకంలో సుఖనివాసం ప్రాప్తిస్తుంది. ఈ వ్రత విధానాన్ని చదివిన వారికీ విన్నవారికి కూడా సర్వపాప విముక్తి సంప్రాప్తిస్తుంది.(మత్స్యాది పురాణం 71వ అధ్యాయములో మందార సప్తమీ వ్రతమను పేరుతో వర్ణింపబడింది.) 

లలితాషష్ఠీ వ్రతము భాద్రపద శుక్ల షష్ఠి నాడు చేయబడుతుంది. ఆ రోజు ఉత్తమ రూప, సౌభాగ్య సంతానాలను వాంఛించు స్త్రీ నదిలో స్నానం చేసి కొత్త వెదురు పాత్రను(ఇసుకతో నింపి) తీసుకొని ఇంటికి రావాలి. ఒక వస్త్రంతో మండపాన్ని తయారుచేసి దానిపై దీపాన్ని వెలిగించాలి. మండపంలో బాలుకామయమైన(బాలూ లేదా బాలుక అనగా ఇసుక.) వెదురుపాత్ర నుంచి బాలుకామయి, తపోవన నివాసిని, భగవతి లలితాగౌరిని ధ్యానించి పూజించాలి. ఆరోజు ఉపవాసముండాలి. చంపక, గన్నేరు, అశోక, మాలతి, నల్లకలువ, కేతకి, తగర పుష్పాలు ఒక్కొక్క జాతి 108 గాని 28 గాని అక్షతలతోబాటు పూజిస్తూ ఈ క్రింది మంత్రాన్నుచ్ఛరించాలి:

లలితే లలితే దేవి సౌఖ్యసౌభాగ్యదాయిని

యాసౌభాగ్య సముత్పన్నా తస్యై దేవ్యై నమో నమః (ఉత్తరపర్వం - 4/3)

ఈవిధంగా పూజించిన వెనుక రకరకాల లడ్లు పక్యాన్నాలు, గుమ్మడి, దోస, కాకర కాయలు, వంకాయలు, రకరకాల ఫలాలను లలితాదేవికి నైవేద్యం పెట్టి ధూప, దీప, వస్త్ర. అభూషణాదులను సమర్పించాలి. రాత్రి జాగరణ చేసి నృత్యగీతాదులతో సంబరం చేయించాలి. రెండవరోజు తెల్లవారగానే లలితామూర్తిని గిత రాదయ్ సహితంగా నదీతీరానికి గౌనిపోవాలి. అక్కడ మరల పూజలను చేసి పూజా సామగ్రిని బ్రాహ్మణునకు దానమిచ్చి భగవతి లలితాదేవి యొక్క బాలుకామయీ మూర్తిని నదిలో వదిలి వెయ్యాలి. ఇంటికి వచ్చి హవనం చేసి దేవతలను పితరులను, సువాసినులగు స్త్రీలను పూజించాలి. పదిహేనుగురు కుమారీ కన్యలను, అదే సంఖ్యలో బ్రాహ్మణులను మంచి రుచికరమైన మధురమైన భోజనాలతో సంతుష్టపఱచి దక్షిణలిచ్చి లలితాప్రీతియుక్తా అస్తు అంటూ వారిని సాగనంపాలి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీ పురుషులకు ఈ లోకంలో లభించని సిరి వుండదు. సుఖ భోగాలతో తులతూగుతూ దేహాంతంలో గౌరీ లోకాన్ని చేరుకొంటారు.

కుమారషష్ఠి కార్తికేయునికి ప్రీతిపాత్రం. మార్గశిర శుద్ధ షష్ఠినాడు చేయబడు ఈ వ్రతం పాపనాశిని, ధన, ధాన్య, శాంతిప్రదాయిని. అతి కల్యాణవారిణి, కార్తికేయుడు తారకాసురుని వధించిన రోజిది. అందుకే ఆయన కారోజంటే ఇష్టం. ఆరోజువించే స్నానదానాది కర్మల ఫలాలు అక్షమాలు, దక్షిణ దేశంలో కొలువైన కార్తికేయ స్వామిని ఈ తిథిలో దర్శించిన వారికి బ్రహ్మహత్య వంటి పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఈ రోజు బంగారంతోగాని వెండితోగాని మట్టితోగాని కుమారస్వామి మూర్తిని నిర్మించి దానిని పూజించాలి. అపరాహ్ణంలో స్నానం, ఆచమనం చేసి పద్మాననం వేసుకొని కూర్చుని ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేయాలి. అనంతరం ఈ మంత్రం చదువుతూ అభిషేకం చేయాలి.

చంద్రమండల భూతానాం భవభూతి పవిత్రతా

గంగాకుమార ధారేయం పతితా తవ మస్తకే (ఉత్తరపర్వం - 42/7)

అనంతరం సూర్యదేవుని పూజించి, మరల కార్తికేయుని ప్రతిమకు గంధ, పుష్ప, ధూప, నైవేద్యాది ఉపచారాలతో ఆయనను క్రింది మంత్రంతో పూజించాలి.

దేవసేనాపతేస్కంద కార్తికేయ భవోద్భవ

కుమారగుహగాంగేయ శక్తిహస్తనమోఽస్తుతే(ఉత్తరపర్వం - 42/9)

దక్షిణ దేశంలో లభించు అన్న, ఫల, మలయ చందనాదులను కూడా ఈ పూజలో వాడాలి. తరువాత స్వామికెంతో ప్రియమైన మేక, కోడి, నెమలిలకు ప్రత్యక్షంగా గానీ వాటి సువర్ణ ప్రతిమలకు గానీ పూజలు చేయాలి. తరువాత ‘దేవసేనాపతే స్కంద (42/3) అనే నామమంత్రం చదువుతూ తిలలను నేతిలో ముంచి హవనం చేయాలి. అనంతరం ఫలమును భక్షించి కుశదర్భం శయ్యపై శయనించాలి. క్రమంగా పన్నెండు నెలలలో భక్షించవలసిన పండ్లు - కొబ్బరి, వేప, నారింజ, పనస, జంబీర వేము, దానిమ్మ, ద్రాక్ష, మామిడి, బిల్వ, ఉసిరి, దోస.

ప్రాతఃకాలంలో బంగరు మేక లేదా కోడి యొక్క ప్రతిమను పేనానీ ప్రీయతాం అంటూ బ్రాహ్మణునికిచ్చెయ్యాలి, పన్నెండు నెలల్లో క్రమంగా సేనానీ, సంభూత, క్రౌంజారీ, షణ్ముఖ, గుహ, గాంగేయ, కార్తికేయ, స్వామీ, బలగ్రహాగ్రణీ, ఛాగప్రియ, శక్తిధర ద్వార అనే నామాలతో ఆయనను పూజించాలి. ఈ నామం చివర ‘ప్రీయతాం’ అనే మాటను చేర్చి దానమిస్తుండాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ప్రతి మౌనంగా తినాలి. సంవత్సరాంతంలో శుక్ల షష్ఠినాడు వస్త్ర, ఆభూషణాదులతో స్వామికి పూజనం, హవనం చేసి, పూజా ద్రవ్యాలను బ్రాహ్మణునకిచ్చి వేయాలి.

ఈ విధంగా ఈ వ్రతాన్ని నిర్వర్తించినవారు ఇక్కడెన్నో ఉత్తమ ఫలాలను పొంది దేహాంతంలో ఇంద్రలోకంలో నివసించగలరు. మరల పృథ్విపై పుట్టవలసి వచ్చినపుడు చక్రవర్తులౌతారు. షష్ఠినాడు నక్తవ్రతం చేసినవారు పాపముక్తులై కార్తికేయ లోకాన్ని చేరుకొంటారు.