సర్ప, బాలసర్ప, సర్పిణి, సూతికా, నపుంసక వ్యంతర అనే రకాలుగా విభజింపబడ్డ సర్పాల్లో కాటు తేడా చికిత్సా భేదమూ వుంటాయి.
సర్పం కాటేస్తే కనులు పైకి వెళ్ళిపోతాయి. బాలసర్పం కాటుకి కుడివైపు, బాలసర్పిణి కాటుకి ఎడమవైపు చూపు వంగుతుంటుంది. గర్భిణీ సర్పం కాటుకి చెమట ఊరగా ప్రసూతి కాటుకి రోమాంచము, కంపన కలుగుతాయి. నపుంసక సర్పం కాటుకి దేహం ముక్కలైపోతుంది.
సర్పానికి పగలూ, సర్పిణికి రాత్రి, నపుంసకానికి సందెవేళ విషం అధికంగా వుంటుంది. పాము ఏ రకందో తెలుసుకుంటే చికిత్స సులభమవుతుంది. దర్వీకర, మండలి, రాజిల, వ్యంతర అని సర్పాల్లో నాలుగు రకాలున్నాయి. అవి క్రమంగా వాత, పిత్త, కఫ, సన్నిపాత స్వభావాల నెక్కువగా కలిగి వుంటాయి. సర్పాల్లో కూడా వర్ణవ్యవస్థ వుంటుంది. బ్రాహ్మణ సర్పం కాటేస్తే మంట, దాహం ఎక్కువగా పుడతాయి. ప్రబల మూర్ఛ, ముఖము నల్లనగుట, ఎముకల మధ్య మూలుగు స్థంభించుట జరుగుతాయి. అపుడు రోగికి అశ్వగంధ, వావిలి, ఉత్తరేను వేళ్ళ మిశ్రమాన్ని నెయ్యితో రంగరించి ముక్కుద్వారా, నీటితో తడిపి నోటి ద్వారా లోనికి పంపించాలి.
క్షత్రియ సర్పదష్టునికి మూర్ఛ, దృష్టి పైకేగుట, విపరీతమైన నొప్పి, చెరుపు - మరుపు కలుగుతాయి. అపుడు ఆకమందు మొక్కవేరు, ఉత్తరేను, ఇంద్రాయణం, ప్రేంకణం కలిపి పొడిని ముక్కు ద్వారా, ముద్దను నోటి ద్వారా రోగిలోనికి పంపించాలి. (ఇంద్రాయణ మనగా వెఱ్ఱిపుచ్చ) వైశ్య సర్పం కాటేసిన వ్యక్తికి కఫం, లాలాజలం ఎక్కువగా పైకి వచ్చుట, మూర్ఛ, చైతన్య శూన్యత లక్షణాలు. వీటికి అశ్వగంధ, గృహధూమ గుగ్గిల, శిరీష, అర్క, శ్వేత గిరికర్ణిక వీటన్నిటినీ గోమూత్రంతో రంగరించి ముక్కు ద్వారా నోటి ద్వారా పంపితే సర్పబాధ వెంటనే దూరమవుతుంది. శూద్ర సర్పపు కాటు తగిలిన వానికి చలవలు కమ్మేసి జ్వరం వస్తుంది. అన్ని అంగాలు దురదవేసినట్టుగా కదులుతాయి. అపుడు కమలం, దానికేసరం, లోధ్ర, చెఱకు, తేనె, మధుసార, శ్వేత గిరికర్ణి - వీటన్నిటినీ సమపాళ్ళలో గ్రహించి చల్లని నీటితో రంగరించి ముక్కు ద్వారా నోటి ద్వారా రోగి లోనికి పంపిస్తే విష ప్రభావం తగ్గుతుంది.
మధ్యాహ్నం క్షత్రియ, దానికి ముందు పగలు బ్రాహ్మణ, ఆ తరువాత వైశ్య, సాయంత్రం శూద్ర సర్పాలు కుడి, ఎదుటి, ఎడమ, వెనుక వైపులనుండి కాటేస్తాయి. అయితే కామజ్వర పీడితములైన సర్పాలు ఈ నియమాలకు విరుద్ధం. సర్పాలకు వాసనలుంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర సర్పాలు క్రమంగా పుష్ప, చందన, నెయ్యి, చేపల వాసనలను కలిగియుంటాయి. ఇవి అదే క్రమంలో నదులు, తోటలు, పవిత్ర స్థానాల్లోనూ, గ్రామ నగరద్వారాల కూడళ్ళలోనూ, శ్మశాన, ఊషర, ధూళి, గడ్డి, చెట్లల్లోనూ, అపవిత్ర స్థానాలు, నిర్జన వనాలు, శూన్యగృహాలు, వంటి చోటుల్లోనూ నివసిస్తాయి.
పాముల రంగుల్లోనూ ఆయావర్ణాల స్వభావాలు కనిపిస్తాయి. తెల్లగా వున్న నల్లగా వున్న అగ్ని సమాన తేజస్సు వుండీ సాత్త్వికంగా కనిపిస్తాయి బ్రాహ్మణ సర్పాలు. పెసలు లేదా బంగారు రంగులో మెరుస్తుంటాయి క్షత్రియసర్పాలు. అవిసెపువ్వు రంగులో వైశ్యసర్పం, మిగతా రకరకాల రంగుల్లో శూద్ర సర్పాలు మెరుస్తుంటాయి.
నాగదేవత నెల్లప్పుడూ పూజిస్తూనే వుండాలి. ముఖ్యంగా పంచమినాడు పాలు, పెరుగు నైవేద్యం పెట్టాలి. శ్రావణ శుక్ల పంచమినాడు ద్వారానికి ఇరువైపులా పేడతో చేసిన నాగ ప్రతిమల నుంచాలి. పెరుగు, పాలు, గరిక, పూలు, దర్భలు, గంధం, అక్షతలు అనేక రకాల నైవేద్యాలతో నాగపూజ చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి.
భాద్రపద పంచమినాడు అనేక రంగుల్లో నాగ చిత్రాలు గీసి పైన చెప్పిన విధంగానే పూజించి గుగ్గిల ధూమం వెయ్యాలి. అపుడు తక్షకాది మహానాగాలు ప్రసన్నులవుతారు. ఆ భక్తుడికి ఏడు తరాలదాకా సర్పబాధ వుండదు.
ఆశ్వయుజ పంచమినాడు కుశదర్భలతో నాగాకృతిని చేసి పాలు, నెయ్యి, నీరులతో స్నానం చేయించి పాలు, గోధుమలతో వండిన నైవేద్యాలను సమర్పిస్తూ పై విధంగా పూజించాలి. వాసుకి వంటి మహానాగులు సంతృప్తి చెంది ఆ భక్తునికి నాగలోక ప్రాప్తిని కలిగిస్తారు.
ఓం కురుకుల్లే ఫట్ స్వాహా
అనే మంత్రం నిత్యం జపించబడే చోటికి సర్పాలు రాలేవు.”
Summary of chapter 25 of the Bhavishya Purāṇa is as follows:
The sāmudrika teaching continues with the marks of the genitals, the quality of semen (as an indicator of health and progeny), the shape of the belly, the configuration of the ribs, the breadth and depth of the chest, the length and musculature of the arms, and the shape and lines of the hands. A man with a deep chest, long arms reaching to the knees, and a broad back bears the marks of a cakravartī — a universal sovereign. Specific lines on the palm are correlated with longevity, with the number of progeny, with wealth, and with the likelihood of renunciation. The teachings of this chapter would have been applied in royal courts, where astrologers and sāmudrika-readers were employed to evaluate candidates for marriage, adoption, or succession.