సాంబడు సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుని మళ్ళా ఇలా అడిగాడు. ‘పరంధామా! సూర్యచక్రోపాసన, సూర్యదీక్షాదులను పట్టేవారు ఈ చక్రాన్నీ తత్ స్థిత పద్మాన్నీ ఏమాత్రం విస్తారంగా నేమి నాభి, పోచలతో సహా నిర్మించాలో దయచేసి ఉపదేశించండి. యజ్ఞమంత్రాలతో సహా చెప్పండి.’
చెప్పసాగాడు శ్రీకృష్ణభగవానుడు.
‘సాంబా! చక్రం అరవైనాలుగంగుళాలూ, నేమి ఎనిమిది అంగుళాలూ వుండాలి. నాభి విస్తారం కూడా ఎనిమిది అంగుళాలే వుండాలి. పద్మము నాభికి మూడు రెట్లు అనగా ఇరవై నాలుగంగుళాలుండాలి. కమలంలో నాభి, కర్ణిక, కేసరాదులను నిర్మించాలి. నాభికన్నా కమలం ఎత్తులో వుండాలి. అక్కడే ద్వారము యొక్క కోణంలో కమల పుష్పము యొక్క ముఖాన్ని కల్పించాలి. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, ఇంద్రులకు నాలుగు ద్వారాలను కల్పించాలి. ద్వారాలను నిర్మించాక పై నలుగురు దేవతలకూ మంత్ర సహితంగా భక్తి పూర్వకంగా ఆవాహన చేసి పూజ గావించాలి. అర్కమండల పూజకై యజ్ఞక్రియకి అనురూపంగా దీక్షితులు కావాలి.
ఖఖోల్క మంత్రాన్ని అనగా చతుర్థీ విభక్తిలో ప్రణవ, నమః ల సహితంగా కమల దళాలపై వ్రాయించి అంగన్యాస, హృదయన్యాసములను, పూజను చేసి హవనం చేసే సమయంలో ఈ మంత్రాలనుచ్చరించాలి.
ఓం ఖఖోల్కాయ స్వాహా ।
ఓం ఖఖోల్కాయ విద్మహే
దివాకరాయ ధీమహి
తన్నః సూర్యః ప్రచోదయాత్ II
ఈ ఇరవై నాలుగక్షరాల సూర్యగాయత్రిని అంటే జపాన్ని అన్ని కర్మలలోనూ చెయ్యాలి. అపుడే ఆ కర్మాల ఫలాలు ప్రాప్తిస్తాయి. ఈ సూర్య గాయత్రి బ్రహ్మగోత్రోద్భవం, సర్వతత్త్వమయం, పరమ పవిత్రం. సూర్య దేవునికిది మిక్కిలి ప్రీతిపాత్రం. మంత్ర జ్ఞానాన్ని, కర్మవిధినీ ఎంత ప్రయత్నం చేసైనా సరే తెలుసుకోవాలి. అభీష్ట మనోరథసిద్ధికి ఇది మంచిదారి.
ఆదిత్య మండల దీక్షకి అన్ని వర్ణాల స్త్రీ పురుషులూ అర్హులే. సూర్యశాస్త్రాన్ని అభ్యసించినవాడు, సత్యవాది, నిత్యశుచి, వేదవేత్తయైన బ్రాహ్మణుడిని గురువుగా స్వీకరించాలి. భక్తిపూర్వకంగా ముందు ఆయనకే ప్రణామం చెయ్యాలి. షష్ఠినాడు ఇందాక చెప్పినట్టుగా అగ్నిస్థాపన చేసి విధిపూర్వకంగా సూర్యుని అగ్నిని పూజించి హవనం చేయాలి. ఆవిధంగా పవిత్రుడైన శిష్యుని కుశలు, అక్షతల ద్వారా ప్రత్యంగంలో సూర్యుని భావిస్తూ స్పృశించాలి. శిష్యుడు వస్త్రాదులతో అలంకృతుడై పుష్పగంధాదులతో సూర్యుని పూజించి బలి కూడా ఇచ్చేయ్యాలి. ఆదిత్య, వరుణ, అగ్నిదేవాదులనొకమారు హృదయంలో ధ్యానించాలి. నెయ్యి, బెల్లం, పెరుగు, పాలు, బియ్యం మొదలైన వాటిని పట్టుకొని నీటిలో కొంచెంకొంచెంగా ముంచుతూ అగ్నిలో వేయాలి. ఆ తరువాత శిష్టాచార ప్రకారం గురువు శిష్యునకు పలుదోము పుల్లనివ్వాలి. ఈ పుల్ల పన్నెండంగుళాల పొడవుండాలి. దానిని పాలుగారు చెట్టునుండే తీయాలి. పళ్ళు తోమిన పిమ్మట దానిని తూర్పు వైపే విసిరేయాలి. మరి ఆ దిక్కువైపు చూడరాదు. దంతధావన మెప్పుడైనా తూర్పు, పశ్చిమ, ఈశాన్యములవైపు తిరిగి చేస్తే శుభం కలుగుతుంది. మిగతా దిక్కులకు తిరిగి దంతధావనం చేస్తే అశుభాన్ని ఆహ్వానించినట్టే. ఒకవేళ నిందిత దిశలో సాధకుడు దంతధావనం చేస్తే గురువు వెంటనే శాంతి చేయించాలి. పూజన, అర్చన చేయించి మరల గురువు శిష్యుని ఇదివరకటి పద్ధతిలో సూర్యభావనతో స్పృశించాలి.
సూర్యగాయత్రి జపంచేస్తూ అతని కన్నులను ముట్టుకోవాలి. ఇంద్రియ సంయమనము కోసం శిష్యుని చేత సంకల్పము చేయించాలి. ఆ తరువాత ఆశీర్వాదమంత్రాలను పఠించి అతనికి శయనించడానికి అనుమతినివ్వాలి.
రెండవరోజు ఆచమనం చేసి ప్రాతఃకాలంలోనే సూర్యునికి నమస్కారం చేసి అగ్నిని స్థాపించి హవనం చేయాలి. స్వప్నంలో ఏవైనా శుభసంవాదాలు వినిపించినా, ఇలలో నెటువంటి అశుభశకునాలు కనిపించినా సాధకుడు గురువుకి చెప్పి సూర్యనారాయణునికి ఒక వంద ఆహుతులివ్వాలి. స్వప్నంలో దేవాలయం, నది, అగ్ని, సుందరఉద్యానవనం ఉపవనం, పత్ర, పుష్ప, ఫల, కమల, రజతాదులు గాని వేత్తయైన బ్రాహ్మణుడు, శౌర్య సంపన్నుడైన రాజు, ధనాఢ్యుడైన వైశ్యుడు, సేవలో లీనుడైన శూద్రుడు, (లేదా శుభ శకునములలో ఇదివరకటి స్వప్నాధ్యాయములోనివి) కనిపిస్తే శుభమనుకోవాలి. షష్ఠి నాటి రాత్రి చెడ్డకలలు వస్తే సప్తమినాడు సూర్యచక్రాన్ని పొద్దున్నే లిఖించి సూర్యదేవుని పూజించాలి. బ్రాహ్మణులను, గురువును సంతుష్టపఱచాలి. ఆదిత్యమండలము పవిత్రము. అది అందరికీ ముక్తినిస్తుంది. కాబట్టి మన హృదయాన్నే ఆదిత్యమండలమనుకొని లేదా మనసులోనే ఆదిత్యమండలాన్ని నిర్మించుకొని దానికి నూరు ఆహుతులనివ్వాలి.
ఇలా ఈ క్రమంలో దీక్షావిధిని మంత్రానుసారంగా చేస్తూ బయటనున్న ఆదిత్య మండలానికి పుష్పాంజలిని సమర్పించాలి. దీనివల్ల వ్యక్తి కుటుంబం సర్వవృద్ధి చెందుతుంది. సూర్యప్రోక్తమైన పురాణాలను శ్రవణంచేయాలి. సూర్య దర్శనానంతరమే భోజనానికి వెళ్ళాలి. ప్రతిమ నీడను దాటుకొని పోరాదు. తిథి వార నక్షత్రాలను తప్పనిసరిగా పాటించాలి. అయనాలు, ఋతువులు, పక్షాలు, దినాలు, కాలము, సంవత్సరాలు అన్నీ సూర్యాధీనములే. సూర్యస్తుతి, వందనం, పూజ ఎల్లపుడూ చేస్తుండాలి. మనసా వాచా కర్మణా ఏ దేవతనీ నిందించరాదు. చేతులూ కాళ్ళూ కడుక్కొని, శోకాలన్నిటినీ మరచిపోయి శుధ్ధమైన అంతఃకరణతో సూర్యనమస్కారాలు చేయాలి. ఇది సూర్యదీక్ష. ఇది సుఖ, భోగ, ముక్తి, ప్రదాయకం.
Summary of chapter 81 of the Bhavishya Purāṇa is as follows:
The Vijaya-saptamī is a specific saptamī occurring when the seventh tithi falls in conjunction with certain victory-conferring planetary configurations. The vrata is particularly prescribed for warriors, rulers, and those engaged in lawsuits or competitive endeavours of any kind. The procedure involves fasting from the previous night, bathing at dawn in a sacred river, offering red flowers and red cloth to Sūrya, reciting specific victory-mantras (vijaya-mantras) a prescribed number of times, and distributing red-coloured food to brāhmaṇas. The stories of kings and heroes who observed the Vijaya-saptamī before setting out on military campaigns — and whose victories were extraordinary and complete — are narrated as testimony to the vrata's efficacy.